సమ్మక్క సంబరాల్లో ఈ రోజు ప్రధానమైన ఘట్టం. మేడారం లో ప్రతి ఏటా జరిగే ఈ వేడుకల్లో భాగంగా సమ్మక్క దేవాలయాన్ని పూజారులు, ముత్తయిదువలు, గ్రామస్తులు శుభ్రం చేసి, తర్వాత వనం లో వనదేవతను గద్దెల మీద కూర్చోబెడతారు. ఆ తర్వాత మధ్యాహ్నం వడేరాలను (పసిడి కుండలు) గద్దెల మీద ప్రతిష్టింపజేసి, ఆదివాసీ కులపెద్దలూ, పూజారులూ కలిసి చిలకల గుట్టకి సమ్మక్క ని తీసుకుని రావటానికి పోతారు. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య కుంకుమ భరిణ రూపంలో సమ్మక్కను తీసుకుని వస్తారు. జిల్లా కలెక్టర్ సమ్మక్కకు స్వాగతం పలికి, గాలిలో తుపాకులు పేలుస్తారు. సమ్మక్కను గద్దె మీద ప్రతిష్టింపజేయటం ప్రధాన కార్యక్రమం.
దీన్ని తిలకించటానికి లక్షలాది మంది భక్తులు వేచియుంటారు. పూనకాలు, జయజయ ధ్వనులతో ఆ ప్రదేశమంతా మారుమోగుతుండగా సమ్మక్కను గద్దె మీద కూర్చోబెడతారు. ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు పూర్తవుతుంది. సమ్మక్క కొలువుతీరిన తర్వాత భక్తులంతా తమ ముడువులు చెల్లించుకుంటారు. మేడారం చేరే రోడ్లన్నీ ఇప్పటికే కిక్కిరిసి ఉన్నాయి. చాలా చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయినట్టుగా సమాచారం అందుతోంది. లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తిలకించే ఈ కార్యక్రమానికి తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more