Team india wins perth match

team india wins perth match

team india wins perth match

17.gif

Posted: 02/08/2012 07:35 PM IST
Team india wins perth match

indiaభారత్ - శ్రీలంక జట్ల మధ్య పెర్త్ లో జరిగిన ట్రై సీరిస్ రెండో వన్డేలో భారత్ బోణీ కొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో విజయ దుందుభి మ్రోగించింది. శ్రీలంక నిర్ధేశించిన 234 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఇంకా 20 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.aswin

భారత జట్టులో సెహ్వాగ్ 10, సచిన్ 48, కోహ్లీ 77, రైనా 24, శర్మ 10, పరుగులు చేసి అవుటయ్యారు. జడేజా 24, అశ్విన్ 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్ 2, మలింగ, ప్రసాద్, ఫెరీరా చెరో వికెట్ దక్కించుకున్నారు.

perth_matchఅంతకుముందు టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. లంకేయులు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసారు. లంక జట్టులో అత్యధికంగా చాందీమాల్ 64, దిల్షాన్ 48, సంగక్కర 26, జయవర్ధనే 23, మ్యాథ్యూస్ 33 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 3, జహీర్ 2, వినయ్, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. మూడు వికెట్లు తీసి బ్యాటింగ్ లో సత్తా చాటిన ఆర్. అశ్విన్ ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వరించింది.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp nitin gadkari stage collapse
Rohan gavaskar quits cricket  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles