2జి కుంభకోణంలో నిందితులుగా గుర్తించిన అధికారుల మీద చర్యలు తీసుకోవటంలో ప్రధానమంత్రి కార్యాలయం తాత్సారం చేస్తోందని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ని సుప్రీం కోర్టు స్వీకరించింది. దానితో మరోసారి కేంద్ర ప్రభుత్వం డిఫెంస్ లో పడింది. సుబ్రహ్మణ్యస్వామి తన పిటిషన్ లో ప్రభుత్వం చాలా ఎక్కువగా జాప్యం చేస్తోందని ఫిర్యాదు చేసారు.
నిందితులుగా పేర్కొన్న వారి మీద విచారణ జరిపించటానికి దర్యాప్తు సంస్థలకు అనుమతులివ్వాలని, ఆ పని మూడు నెలల లోపులోనే జరగాలని జస్టిస్ జిఎస్ సింఘ్వి, జస్టిస్ ఎ కె గంగూలీ ల ధర్మాసనం ఆదేశించింది. ప్రధాని కార్యాలయానికి ఆదేశాలివ్వలేమని అన్న హైకోర్టు తీర్పుని పక్కకు నెడుతూ, నాలుగు నెలల లోపులో అనుమతులు రాకపోతే ప్రధాని కార్యాలయం అనుమతించినట్టుగా భావించబడుతుందని సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. మాజీ టెలికాం మంత్రి ఎ.రాజాను ఈ కేసులో ప్రాసిక్యూట్ చెయ్యటానికి ఆదేశాలివ్వాలని కోరిన సుబ్రమణ్యస్వామి పిటిషన్ కి లోకస్ స్టాండి ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అవినీతి నిరోధం కింద ప్రభుత్వోద్యోగి మీద ఫిర్యాదు చేసే హక్కుందని కూడా ధర్మాసనం తెలియజేసింది.
అయితే కేంద్ర ప్రభుత్వం సుబ్రమణ్య స్వామి చేసిన ఆరోపణలన్నిటినీ అంగీకరించటం లేదని, ప్రధాన మంత్రి కార్యాలయం రాజా మీద చర్య తీసుకోవటానికి ఇవ్వవలసిన అనుమతిని పరిశీలిస్తోందని, దర్యాప్తు సంస్థల నుండి ఇంకా రావలసిన నివేదికలవలన జాప్యం జరుగుతోందని అఫిడవిట్ ఫైల్ చేసింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more