రాజకీయంగా అందరి దృష్టిలోకీ పోవాలంటే ఏదో ఒక సమస్యను చేతిలోకి తీసుకుని జనం లోకి పోవాలి. ప్రస్తుతం ఉన్నది ఒక్కటే గట్టి వాదన. అదే ప్రత్యేక తెలంగాణా వాదన. అది నాదంటే నాదని అందరి వాదన. దానికోసం నేను పోరాడాను, ఇంకా పోరాడతాను, నేనే నిజమైన ఉద్యమకారుడిని అంటూ ప్రతివారూ దాన్నే పట్టుకోవటానికి కారణం, ఈ మధ్యకాలంలో అత్యంత సమర్ధవంతంగా శక్తివంతంగా కనిపించిన ఆందోళన అదొక్కటే. తెరాస దాన్ని తెరమీదకు తెస్తే ఐకాస దానికి వత్తాసు పలికింది. సకల జనుల సమ్మె పేరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చేసరికి ఎవరికి వారు అదే దోవలో పోత్ మంచిదనుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.
తెదేపా నుంచి విడిపోయి వచ్చిన నాగం జనార్దన రెడ్డి కాని, ఆ తర్వాత తెలంగాణా ఫోరం గా ఏర్పడ్డ తెదేపా నాయకులు కానీ, కాంగ్రెస్ శాసనసభ్యులలో తెలంగాణా ప్రాంతానికి చెందినవారు కానీ, తెలంగాణా ఎంపీలు కానీ, రాష్ట్రంలో ప్రవేశించి నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న భాజపా కానీ, ఇంకా ఎన్నో చిన్నా చితకా సంస్థలు తెలంగాణా ఉద్యమ బాటను పట్టాయి. దీక్షలు, రాజీనామాలు, ఢిల్లీ, హైద్రాబాద్ లకు రాకపోకలు జరిగాయి.
దానితో ఎప్పటి నుంచో విప్లవకారులుగా పేరు మోసిన వారికి కాస్తంత మనస్తాపం కలగటం కూడా సహజమే. ఇన్ని సంవత్సరాలుగా మేం చేస్తుంటే నిన్న గాక మొన్న వచ్చి ఉద్యమాన్ని పైకెత్తుకుని ఎదుగుతున్నారని కసితో తెరాస మీద వ్యాఖ్యానాలు చేసిన వారూ ఉన్నారు. తాజాగా మావోయిస్ట్ నాయకుడు జగన్ కూడా, సకల జనుల సమ్మె విరామం కాదిది విద్రోహమని అన్నారు. ఉద్యమాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉద్యమాలను నడిపించింది, నడిపించేదీ మేమే అన్నారు. ఆప్పుడు పీపుల్స్ వార్ అయితే ఇప్పుడు మావోయిస్ట్ లు గా ఉద్యామాలు చేస్తున్నది, త్యాగాలు చేస్తున్నది మేమే అన్నారు జగన్. అయితే, ఉనికి కోసమే మావోయిస్ట్ నేతలు అలా మాట్లాడుతున్నారని తెరాస నాయకులు ఆ మాటలను ఖండించారు కూడా. దీనికి ముందే తెదేపా తెలంగాణా ఫోరం కూడా ఉద్యమం పేరుతో డబ్బులు దండుకున్నారు, ఢిల్లీకి తాకట్టు పెట్టి పోలవరం టెండర్లు దక్కించుకున్నారని ఆరోపించారు.
మరో సమస్య రైతు సమస్య కూడా తెరపైకి వచ్చింది కానీ తెలంగాణా ఉద్యమానికొచ్చిన ఆదరణ దానికి రాలేదు. తెదేపా, వైయస్ ఆర్ కాంగ్రెస్, భాజపా కూడా రైతుల సమస్యలను తెలకెత్తుకున్నారు కానీ పెద్దగా పైకి రాలేదది. అందువలన ఉన్న సమస్యలను తలమీదకు తీసుకుని జెండా పైకి లేపాలి, లేదా అందుకు వీలు కాని వారు ఆ ఉద్యమం చేస్తున్నావారి నిజాయితీని శంకిస్తూ వుండాలి. ఇవే నేటి రాజకీయాలు. అందుకే మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ, లోగడ పివి నరసింహారావు, చెన్నారెడ్డి, జలగం వెంగళరావులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణా వాదన ఎందుకు రాలేదు, ఆంధ్రా నాయకులే ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే ఎందుకు వస్తోందంటే వారికి సిఎమ్ గద్దె కావాలి కనుక అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more