అమాయకులను మోసగాళ్ళనుంచి రక్షించటానికి పబ్లిక్ చీటింగ్ కేసులు పోలీసులకు అందుబాటులో ఉన్నాయి. కానీ అప్పటికల్లా జరగాల్సిందంతా జరిగిపోతుంది, అమాయకులు బలైపోతారు కూడా. మోసగళ్ళు దొరికిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ అదే విధంగా మోసాలకు పూనుకోకుండా వారిమీద కేసులు పెట్టటం జరుగుతుందే కానీ, పోయిన సొమ్మంతా తిరిగి రావటం కానీ, బాధితులకు తిరిగి ఇప్పించటం కానీ జరిగిన దాఖలు మనదేశంలో లేవు.
మోసం చేసినవాళ్ళు కచ్చితంగా నిందితులే కానీ బాధితులంతా అమాయుకులా అంటే చట్టం దృష్టిలో ఔననే అనాలి కానీ, నిజానికి వాళ్ళూ నిందితులే. కష్టపడకుండా తేరగా డబ్బు వస్తుందంటే వారి మనసులో కలిగే ఆశే వారిని మోసంలోకి లాగబడుతుంది. అందులో ఒకరిద్దరు తెలిసినవాళ్ళు అందులో వేలు పెట్టి దాన్ని బయటకు లాక్కోవటం కోసం తమకి ఎంతో ఆదాయం వచ్చిందని నమ్మబలుకుతారు. దాన్ని చూసి ఇతరులు కూడా మదపు చేస్తుంటారు. అందువలన కేవలం ఆ మోసానికి పూనుకున్నవాళ్ళే కాదు దానిలో చేరి ఇతరులను చేర్పించినవారంతా నేరస్తులే. అంటే అలాంటి స్కీం లో చేరినవారంతా తెలిసో తెలియకో ఒకరినొకరు మోసం చేసుకుంటున్నవారే. స్కీం మారవచ్చు కానీ సారాంశం అదే- డబ్బులు కట్టండి, కష్టపడకుండా దానికి ఎన్నో రెట్లు తిరిగి పొందండి.
ఈసారి జరిగిన మోసం ఎప్పటినుంచో హైద్రాబాద్ లో ఉన్నదే. ఈసారి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగింది బయటపడింది. ఇంత సొమ్ము కట్టండి, రోజుకి ఇంత తీసుకోండి, దానితో పాటు ప్లాటు కూడా ఉచితంగా పొందండి. వాళ్ళకి రోజుకి తిరిగిచ్చే సోమ్ముతోనే నాలుగైదు నెలల్లో వారి సొమ్ము వారికి తిరిగివస్తుంది. ఆ తర్వాత కూడా రోజుకి కొంత లేదా నెలకి ఇంత అని వస్తుండటంతో పాటు రోజురోజుకీ పెరిగిపోతున్న ఇళ్ళ స్థలాల రేట్లు కూడా వారికి ఎంతో లాభం చేకూరుస్తుంది. ఈ స్కీంతో ఒక్క తణుకులోనే స్కీంలో చేరినవారి పేరాశలను సొమ్ముచేసుకుని 60 లక్షలు తీసుకుని ఉడాయించారు నిర్వాహకులు. డబ్బు వస్తున్నప్పుడు ఇంతెందుకు వస్తుంది అని ఎవరూ ఫిర్యాదు చెయ్యరు. పోయినప్పుడు మాత్రం మోసపోయామంటూ ఫిర్యాదు చేస్తారు తమ తప్పేమీలేనట్టు.
అయితే ఫిర్యాదు చెయ్యవలసిందే. కనీసం ఇతరులు ఆమోసం లోకి పోకుండా ఉంటారు. కానీ సమాజంలో నిజాయితీ పెరిగి నేను సంపాదించింది నాకు చాలు అని అనుకున్నప్పుడు ఇలాంటి మోసగాళ్ళ ఆటలు ఎక్కడా సాగవు. రాత్రి పదిన్నరయింది. ఎదురుగా వస్తున్న మనిషి గభాలున సంచీలోంచి ఒక పుస్తకం తీసి , సర్ మీరు లక్కీ పర్సన్ ఈరోజు. ఇది మీకు ఉచితం అన్నాడు. నాకు వద్దన్నాడితను. అబ్బే దీనికేమీ చెల్లించక్కర్లేదన్నాడు ఆ పెద్దమనిషి. నేను ఉచితంగా ఏమీ తీసుకోను అన్నాడీ మనిషి. ఇది మీకు లక్కీ ఆఫర్ సర్. మీరు వేరెవరికైనా ఇవ్వచ్చు అన్నాడతను. అదేదో మీరే చెయ్యండి, నాకు దారి ఇవ్వండి చాలు అని వెళ్ళిపోయాడా పేరాశలేని వ్యక్తి. ఇలా వ్యవహరిస్తే అసలు మోసంలోకి పోకుండానే ఉంటారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more