Wikileaks founder assange to launch tv show

WikiLeaks founder Julian Assange says launching TV show, promises controversy. WikiLeaks-The Show,Julian Assange,United Kingdom,Western Europe,Europe,WikiLeaks,Television programs,Entertainment,Arts and entertainment

WikiLeaks founder Julian Assange says launching TV show, promises controversy. WikiLeaks-The Show,Julian Assange,United Kingdom,Western Europe,Europe,WikiLeaks,Television programs,Entertainment,Arts and entertainment

WikiLeaks founder Assange.GIF

Posted: 01/25/2012 12:51 PM IST
Wikileaks founder assange to launch tv show

Wikileaksజూలియట్ అసాంజె ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ‘వీకీలీక్స్’ వెబ్ సైట్. ఈ వెబ్ సైట్ లో అసాంజే వివిధ అగ్రరాజ్యాల సమాచారాన్ని తేటతెల్లం చేశాడు. అసాంజె ధాటికి అగ్ర రాజ్యం అమెరికా కూడా గజగజ లాడింది. ఇతను బయట పెట్టిన సమాచారంతో అగ్ర రాజ్యం ఇతన్ని అరెస్ట్ కూడా చేయించింది. ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్న అసాంజె ఆ మధ్య ఫెనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో వీకీలీక్స్ ని నిలిపి వేస్తున్నానని కూడా ప్రకటించాడు.

అలాంటి వీకీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజె ఇక బుల్లి తెర పై కనిపించబోతున్నాడు. ముఖాముఖి (ఇంటర్వ్యూ) కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు. 'రేపటి ప్రపంచం' సిరీస్ కింద దార్శనికులు, సంస్కరణవాదులు, ప్రగతిశీలవాదులతో నిర్వహించే ఈ ఇంటర్వ్యూలు మార్చి మధ్య నుంచి ప్రసారం కానున్నాయని వెబ్‌సైట్‌లో అసాంజే ప్రకటించారు.

"ఈ కార్యక్రమంలో పాల్గొనే వారితో రేపటి మన ప్రపంచం తీరుతెన్నులపై సాధ్యాసాధ్యాలను ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తాను. మన ప్రయాణం ఆదర్శ ప్రపంచం వైపా.. అధోజగత్ వైపా.. మన మార్గాన్నెలా సరిచేసుకోవాలి అన్న అంశాలను ప్రస్తావిస్తాను'' అని వివరించారు. "నా అతిథులతో వారి తత్వాన్ని, వివేచన, పోరాటాలను వినూత్నంగా, ముందెన్నడూ లేనంత స్పష్టం గా ఆవిష్కరిస్తాను'' అని పేర్కొన్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలు ఏయే ఛానళ్ల నుంచి ఎక్కడ నుంచి ప్రసారం అయ్యేదీ తెలపలేదు.

మరి తన వెబ్ సైట్ తో ఎన్నో నిజాల్ని బయట పెట్టిన అసాంజే టీవీ తెర పై ఎన్ని సంచలనాలు చేస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Charminar gets mega tourist destination status
Pm office started tweets to reach youth  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles