Voter list can be checked modified or included tomorrow

voter-list-1.gif

Posted: 01/24/2012 05:14 PM IST
Voter list can be checked modified or included tomorrow

రేపు రాష్ట్రంలో ఓటర్ల దినోత్సవం జరుగనుంది. ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు పోలింగ్ బూత్ లలో అధికారులు ఈ సందర్భంగా ఓటర్లకి అందుబాటులో ఉంటారు. ఓటర్ల జాబితాలలోని ఓటర్ల పేర్లను సవరించుకోవటం కానీ నమోదు చేసుకోవటం కానీ చెయ్యటానికి ఈ సమయంలో దరఖాస్తులు ఇవ్వవచ్చని ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు.

ఓటు హక్కు, ఓటర్ల జాబితాల్లో ఉండటం సరే కానీ, ఓటు ఎవరికి వెయ్యాలో తెలియని పరిస్థిత ఏర్పడుతుంటే ఓటు గురించి ఏం పట్టించుకోవాలంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. మాది మంచి పార్టీ, అంకితభావంతో పనిచేస్తాం, లోగడ ఇంత చేసాం, ఇకముందు ఇంత చేస్తాం అని చెప్పుకోవటం వేరు. కానీ ఇతర పార్టీల వైఫల్యాలను, అవినీతిని తమకు అనుకూలంగా చేసుకునే ప్రచారంలో భాగంగా చేసుకోవటం ఎంత మాత్రం సబబని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

ఒకరి మీద మరొకరు చేసుకునే వ్యాఖ్యానాల వలన వారి వారి అభిమానుల మధ్య చిచ్చు రేగిన ఉదంతం నెల్లూరు లో వెలుగుచూసింది. బాలయ్య వ్యాఖ్యలను చిరంజీవి, చిరంజీవి వ్యాఖ్యలను బాలయ్య తిప్పికొట్టడాలలో వారి వారి సినీ అభిమానులలో కూడా ఉద్రేకాలు పెరిగిపోయాయి. వీళ్ళ నాయకుడిని వాళ్ళు, వాళ్ళ నాయకుడిని వీళ్ళూ తిడుతూ దిష్టిబొమ్మలు తగలబెట్టేంతవరకూ వచ్చింది. ఈ పార్టీ అవినీతికి పాల్పడిందని, ఆ పార్టీ, కాదు ఆ పార్టీయే అవినీతికి పాల్పడిందని ఈ పార్టీ ఇలా కాంగ్రెస్, వైయస్ ఆర్ కాంగ్రెస్, తెదేపా, తెరాస మధ్యలో జరుగుతున్న ఆరోపణలతో పాటు ప్రతి పార్టీవారూ మిగిలిన పార్టీలన్నీ కుమ్ముక్కయ్యాయని ప్రచారం చెయ్యటంతో ఓటర్లంతా సందిగ్ధావస్తలోనే పడుతున్నారు.

ప్రచారంలో ఉపయోగించటానికి పాత వార్తా పత్రికలను వెతకటం, వాగ్ధాటిని పెంచుకోవటం, భాషమీద పట్టు పెంచుకోవటం, చట్టాలను శోధించటం లాంటివి అన్ని పార్టీలవారూ చేస్తున్నారు కానీ ఓటర్లను మాత్రం ఎటూ తేల్చుకోలేని స్థితిలోకి పడేస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజలదే అంతిమ తీర్పు అని అంటారు కానీ ఆ ప్రజలే ఎవరికి పట్టం కట్టాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చివరకు ఎలా తయారైందంటే, ఎవరు ఏం చెప్పినా నమ్మటానికి సందేహిస్తున్నారు.

అందువలన, ఓటర్ల జాబితాను సవరించటంతో పాటు ఓటర్ల మనసులను కూడా సందేహాలకు తావు లేకుండా చెయ్యాలి. దానికోసం ఎన్నికల కమిషన్ ఇచ్చే 24 గంటల ప్రచార రహిత కాలం సరిపోదేమే. దానికో వెయ్యి రెట్లు ఎక్కువ సమయాన్నివ్వాలేమో.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rashdie video addressing also was stopped at jaipur literature festival
Incomparable subash chandra bose  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles