Six years wonder boy

six years wonder boy, Chief Minister Kiran kumar Reddy, Hyderabad, Kachiguda, Mother, Bhagyalakshmi, Teacher, Aswin kumar, sister, naina, Degree,

six years wonder boy

six years.gif

Posted: 01/21/2012 10:33 AM IST
Six years wonder boy

six years wonder boy

అమెరికా జాతీయ పతాకంలో ఎన్ని రంగులుంటాయి..? ఇటలీ ప్రధాని ఎవరు..? దక్షిణావూఫికా రాజధాని ఏదీ..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే కాస్త ఆలోచించాల్సిందే..! ఇవేకాదు.. ఇలాంటి ఎన్ని ప్రశ్నలకైనా తడబడకుండా సమాధానం చెప్పగలడు అగస్త్య. సరస్వతీ మంత్రమైనా.. గాయత్రీ మంత్రమైనా... అలనాటి సినిమాల్లోని గీతాలైనా అలవోకగా పాడగలగడు అగస్త్య. వయసు ఆరేళ్లే..! జ్ఞాపకశక్తి కొండంత..! పిన్నవయసులోనే ఆ బాలుడు ఘనాపాఠి. అందరినీ అబ్బురపరుస్తున్న అగస్త్య స్వస్థలం హైదరాబాద్ కాచిగూడ డివిజన్‌లోని కుద్బిగూడ. తండ్రి అశ్విన్‌కుమార్ న్యాయవాది.. తల్లి భాగ్యలక్ష్మి టీచర్. తల్లిదండ్రుల ఒడినే బడిగా చేసుకొని అగస్త్య ప్రపంచ చరిత్రను తెలుసుకున్నాడు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. ప్రపంచ దేశాల జాతీయ పతాకాలు, రాజధానులు, చారిత్రక ప్రదేశాలు, శాస్త్రవేత్తలు.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఠక్కున చెప్పడంలో అగస్త్య దిట్ట.
అక్క రికార్డును అధిగమించాలని..
అశ్విన్‌కుమార్, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు నైనా పెద్దది.. అగస్త్య చిన్నవాడు. ఎనిమిదేళ్ల వయసులోనే నైనా కేంబ్రిడ్జి యూనివర్సిటీ వారి అనుమతితో పదో తరగతి పరీక్షలు రాసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం నైనా డిగ్రీ చదువుతోంది. అక్కకు దీటుగానే తమ్ముడు అగస్త్య ప్రత్యేకతను చాటుతున్నాడు. నైనా నెలకొల్పిన ఏళ్ల వయసులో పదోతరగతి పరీక్షల రికార్డును తాను ఆరేళ్లకే సాధించాలనుకుంటున్నాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp modugula comments on congress party
Obamas singing gets raves from american idol coach  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles