Tdp mla fired congress mp undavalli

TDP MLA fired congress MP undavalli, TDP Party, Congress Party, Raithu poru bata, Chief Minister, Delhi, Revanth Reddy,

TDP MLA fired congress MP undavalli

MLA.gif

Posted: 01/21/2012 10:17 AM IST
Tdp mla fired congress mp undavalli

తమ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వక్రీకరిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. చిత్తూరు జిల్లా రైతు పోరు బాట యాత్రలో అక్కడి రైతులతో తమ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లా డుతూ గతంలో ముఖ్యమంత్రి దోచుకున్నంత దోచుకున్నాడని అంటే ఆ మాటలను మసి పూసి మారేడు కాయ చేస్తూ ఉండవల్లి ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహా కూటమి ఏర్పాటైన తర్వాత రాజా ఆఫ్‌ కరెప్షన్‌ పుస్తకాన్ని వేసి ప్రధానికి, ఢిల్లీ పెద్దలందరికీ ఫిర్యాదు చేశామన్నారు. ఉండవల్లి అనువాద అవకాశాలు తెచ్చుకో వడమే కాకుండా వైఎస్‌కు భజన చేస్తూ పార్లమెంటుకు ఎన్నికయ్యారని చురకలు వేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం అంటే సోనియా గాందీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించినంత సులువు కాదని రేవంత్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉండవల్లి ఊసరవెళ్లని రాష్ర్ట ప్రజలందరికీ తెలుసని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని దురదృష్ట వశాత్తూ అంబేద్కర్‌ రాశాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆనక నాలుక కరుచుకుని ఆ తర్వాత విగ్రహం కాళ్లు కడిగి నెత్తిన పోసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పిన వ్యక్తివి నువ్వు కాదా! అని గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Obamas singing gets raves from american idol coach
Film critic nikhat kazmi passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles