తెలుగు సినిమా మరువలేని మనిషి
తన జీవితం మనందరికీ ఆదర్శం, తను సాధించిన విజయాలు, సృష్టించిన సంచలనాలు తెలుగు సినిమా ఉన్నంత వరకు గుర్తుంటాయి. ఒక్క తెలుగు సినీ పరిశ్రమ మాత్రమె కాదు, తమిళ్, హిందీ సినీ పరిశ్రమల్లో కూడా తనదైన ప్రాముక్యతని సంపాదించుకున్నారు. ఈనాడు భౌతికంగా ఈయన మన మధ్య లేకపోయినా, ఈయన సిని పరిశ్రమకి, ప్రజానికానికి అందించిన సేవ మరువలేనిది. ఈయనే, ఎల్. వీ. ప్రసాద్. 'మిస్సమ్మ', 'అప్పు చేసి పప్పు కూడు', 'షావుకారు' వంటి ఎన్నోజనరంజకమైన సినిమాలని మనకు అందించిన ఈయన జీవితమే ఏ సినిమా కధ కన్నా తక్కువ కాదు...
ఏలూరు దగ్గర పల్లెలో రైతు కుటుంబంలో జన్మించిన లక్ష్మి వరప్రసాద్, ఎల్. వీ. ప్రసాద్ గా మారడానికి ఎన్నో ఒడిదుడుకులని ఎడురుకోవలసి వచ్చింది. ఆ విజయ పరంపర వెనుక ఉన్న కధ, క్లుప్తంగా మీ కోసం;
చిన్ననాటి నుండి ప్రసాద్ గారికి నాటకాలన్న, నటనన్నా యెనలేని అభిమానం. కానీ వాస్తవ పరిస్థితులు వేరు. పదిహేడు ఏళ్ళ వయసులోనే పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తండ్రయిన ప్రసాద్ గారు, నటన పై ఉన్న ఆసక్తి చంపుకోలేక, అప్పటిలో మూకీ సినిమాల్లో కనీసం కనిపిస్తే చాలు అనుకుని, ఇంట్లోంచి వంద రూపాయలు తీసుకుని దొంగల బండిలో ముంబై చేరుకున్నారు... అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ, స్టుడియోల చుట్టూ తిరిగారు. అవకాశాలు కాదు కదా, కనీసం లోపల అడుగుపెట్టడానికి కూడా అనుమతి దొరకలేదు. ఇలా కొంతకాలం కష్టాలని చవి చూసిన తరువాత, ఎలాగో అలాగా ఒక సినిమా ధియేటర్లో టికట్ కలెక్టర్ గా ఉద్యోగం సంపాదించుకున్నారు, అలాగే వీనస్ కంపెనీ లో కూడా ఉద్యోగం తెచ్చుకున్నారు. అలా కొంత కాలం గడిచిన తరువాత, హిందీ లో తొలి టాకీ చిత్రం 'ఆలం ఆర' లో చిన్న వేషం వేసే అవకాసం సంపాదించుకున్నారు... ఇదే సమయం లో తమిళం లో తొలి టాకీ చట్రం 'కాళిదాసు', తెలుగులో తొలి టాకీ 'భక్త ప్రహ్లద ' లో కూడా నటించే అరుదైన అవకాశాన్ని తన సొంతం చేసుకున్నారు... ఆ తరువాత ఎన్నో సినిమాలకు సహాయ దర్శకుడిగా ఉంటూ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతల్ని స్వీకరించారు... 'గృహ ప్రవేశం' ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా. ఇక ఆ తరువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన పని పడలేదు ఎల్. వీ. ప్రసాద్ గారికి. మిస్సమ్మ వంటి ఎవ్వరు ఎంచుకోడానికి కూడా ఆలోచించే కధలను ఎంచుకొని తనదైన శైలిలో సినిమాలు తీసి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ ఫిలిం మేకర్ గా కొనసాగారు... మహానటులు యన్. టీ. ఆర్, సావిత్రి, జమున, శివాజీ గనేషన్ వంటి వారిని 'స్టార్' ల జాబితాలోకి చేర్చింది ఎల్. వీ. ప్రసాద్ గారే అని చెప్పచ్చు...
ఆయన నిర్మించిన స్టూడియోలు, ల్యాబ్ లు, ఆస్పత్రులు ఈ రోజున ఎన్ని సేవలు అందిస్తున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ఎల్. వీ. ప్రసాద్ గారిలాంటి వ్యక్తీ కేవలం సినిమాల పరంగానే కాక, మామూలు వ్యక్తీ వందల్లో ఒకనిగా ఎదగాలంటే, ఒక లెజెండ్ గా, ఆదర్శప్రాయంగా నిలిచారు...
జనవరి పదిహేడు, ఈ మహా వ్యక్తీ జయంతి... సినిమా ఉన్నంతకాలం గుర్తుండిపోయే మహనీయుడు ఎల్. వీ. ప్రసాద్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more