"నవ్విపోదురు గాక నాకేంటి అనే రీతిలో నిస్సిగ్గుగా మాట్లాడటం రాజకీయవేత్తలకున్న హక్కా ఏమిటి?" అంటూ రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. ఉత్తర ప్రదేశ్ లో రానున్న ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని ఏనుగు బొమ్మల మీద ముసుగు వేయమని ఆదేశించింది. ఏనుగు బొమ్మల మీద వేయమన్నారు కానీ ఏనుగుల మీద కాదు. ఏనుగు బొమ్మలైనా ఏ ఆలయంలోనో పార్కులోనో ఎక్కడో ఉంటే అభ్యంతరం ఉండకపోవును కానీ, ప్రత్యేకంగా తమ ఎన్నికల గుర్తైన ఏనుగుకి పెద్ద పీట వేసి రాష్ట్రమంతటా ఎక్కడబడితే అక్కడ భారీ ఏనుగు విగ్రహాలను ప్రతిష్టించటంలో అంతర్యమేమిటో ఎవరికైనా అర్థమౌతూనే వుంది. ముసుగులు వేసినంత మాత్రాన అవి ఏనుగులని తెలియకా పోదు, ఒకవేళ్ అంతకు ముందు చూడని వాళ్ళు ఆ ముసుగులను చూసి మరింత ఆసక్తితో అవి ఏమిటో తెలుసుకోకాపోరు. కానీ తమ పరిధిలో ఓటర్లను ప్రలోభపెట్టే వాటిని నియంత్రించాలి కాబట్టి ఎన్నికల కమిషన్ వాటి మీద ముసుగులు వెయ్యమని ఆదేశించింది. వాటితో పాటు ముఖ్యమంత్రి భారీ విగ్రహాలకు కూడా ముసుగులు వెయ్యమంది కానీ మాయావతికి కాదు కదా!
ఈ అంశాన్ని పట్టుకుని ఛలోక్తులు అనుకుని విసురుతున్న ప్రతిపక్షాల మాటలు ఎంత అవివేకంగా ఉన్నాయో వారికి అర్థమైనా వారికవేం పట్టవనుకుంటా. ఢిల్లీలో ఉన్న ఏనుగు బొమ్మల మాటేమిటి అని నిన్న మాయావతి అంటే, ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి, గణతంత్ర దినోత్సవంలో ఏనుగులను కనిపించనీయరా అంటూ వ్యంగ్య వ్యాఖ్యానం చేసారు. మరి సైకిళ్ళు, లాంతర్ల మాటేమిటి అని కూడా అడిగినవారున్నారు. ఏనుగుకి ఏమంత ప్రాముఖ్యతుందని మహా నాయకులతో పాటు సమానంగా అన్నన్ని విగ్రహాలు చేయించటం. ఎన్నికలలో పనికివచ్చే ఒక చిహ్నానికి అంత ప్రాముఖ్యతనిచ్చినవారిని వదిలిపెట్టి, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగటానికి పాటుపడుతున్న ఎన్నికల కమిషన్ ని తప్పుపట్టటం ఏమి విఙతని రాజకీయ రంగంలో పలువురు ప్రశ్నిస్తున్నారు.
సరే ముసుగులేం వద్దులే అంటూ ఈ సమయంలో ఏనుగు గుర్తుని ఫ్రీజ్ చేసి ఎన్నికల చిహ్నాన్నే మార్చివేస్తే ఏం చేస్తారు?
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more