ఈసారి సంక్రాంతి సందర్భంగా తమిళనాడు మధురై సమీపంలోని పలమేడులో జరిగిన జల్లికట్టులో 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. జంతువుల సంక్షేమాన్ని కోరే సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అడ్డు చెప్పినా, మధురై హైకోర్టు ఈసారి సంక్రాంతికి జల్లికట్టుకి అనుమతించింది. తెలుగులో తలపడటం, ఇంగ్లీషులో లాకింగ్ హార్న్స్ అనే పదాలకు అసలు అర్థమైమిటో ఈ జల్లికట్టు చూస్తే తెలుస్తుంది. ఎన్ని నిరసనలు వచ్చినా, ఎంత ప్రాణ నష్టం జరిగినా, ఈ ఆట ప్రతి సంవత్సరం కొనసాగుతూనే వుంది. ఇందులో మనుషులకే నష్టం జరగుతుంది కానీ జంతువులకు కాదు. ఎందుకంటే వాటితో పోరాడేవారు ఆయుధాలను ధరించరు, పైగా ఆ పోట్ల గిత్తల కొమ్ములను వాడిగా చెక్కి మరీ ఆటలో వదులుతారు. తమిళయన్లు తమ ప్రాచీనమైన సాంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తారనటానికి జల్లికట్టే నిదర్శనం. లేకపోతే ఈ కాలం లో కూడా జంతువులతో ఆటలెందుకు ఆడుతారు. ప్రాణాలమీదికి ఎందుకు తెచ్చుకుంటారు. సల్లికాసు అంటే డబ్బు. కట్టు అంటే మనకు తెలిసిందే కట్టినది. ఎద్దుల కొమ్ములకు పారితోషికాన్ని కట్టి ఆడించేవారు. కాలక్రమేణా అది కాస్తా జల్లి కట్టు అయింది.
స్పెయిన్ లో జరిగే బుల్ ఫైట్ తో మన దేశంలో సంక్రాంతి పండుగ సందర్భంగ జరిగే జల్లికట్టుతో పోల్చగూడదు. అక్కడ జరిగే క్రీడలో ప్రేక్షకలు లక్షలాది మంది ఉంటారు, ఆటగాళ్ళు కొందరే ఉంటారు. మైదానానికో సరిహద్దుంది. భద్రతా చర్యలు చేపట్టి ఆట నడుపుతారు. బుల్ ని చంపటం లక్ష్యంగా ఆడతారు. దానికోసం ఆయుధాన్ని చేపడతారు. బుల్ ని రెచ్చగొట్టి మరీ దాన్ని చంపుతారు.
కానీ దక్షిణభారతంలో ముఖ్యంగా తమిళనాడులో జరిగే జల్లికట్టు పూర్తిగా దేశవాళీ క్రీడ. ఇందులో ఎద్దులను నియంత్రించే ఆటగాళ్ళు వాటిని చంపరు. నిరాయుధులుగానే ఆటలోకి పోతారు. పులులు సింహాల్లాంటి వేటాడే అడవి జంతువులు కూడా వాటి జోలికి పోవటానికి భయపడే జాతి ఎద్దులున్నాయి. పోరాడటానికే పుట్టిన జాతులు కొన్ని ఉన్నాయి. వాటిని రెచ్చగొట్టాల్సిన పనే లేదు. భయంతో ప్రాణాలు కాపాడుకోవటానికి చేసే పోరాటం కాదది. అవి ఉన్నవే పోరాడటానికి. అటువంటి జాతుల్లో పులికులం జాతి ఎద్దులనే ఎక్కువగా జల్లికట్టులో ఉపయోగిస్తారు. ఈ క్రీడ కోసం ప్రత్యేకంగా పెంచిన మేలుజాతి ఎద్దుల పోషణను ఎవరు బడితేవారు చెయ్యలేరు కూడా. పూర్వకాలంలో తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ఎద్దులతో పోటీ చేసి గెలిచిన వారినే కన్యలు వరించేవారట. అక్కడి నుంచీ ఈ క్రీడ ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఈ జల్లికట్టు ఆట మూడు విధాలుగా ఆడుతారు. మధురై, పుదుక్కోటై, తేని, తంజావూర్, సేలమ్ ప్రాంతాల్లో ఆడే జల్లికట్టు ఆటలో, ఒకచోట నిర్బంధించివుంచిన ఎద్దుని బయటకు వదులుతారు. అది బయటకు రాగానే ఆటగాడు దాని మూపురాన్ని పట్టుకుని ఎంతసేపు ఉండగలిగితే అంత గొప్ప. మూపురాన్ని పట్టుకుని వేలాడుతున్న మనిషిని విదిలించటానికే చూస్తుందా ఎద్దు. అయినా గట్టిగా పట్టుకుని దానితోపాటుగా పోవటం క్రీడ. ఒక మనిషికే ఆ అవకాశం ఉంటుంది.
శివగంగై, మధురై ప్రాంతాల్లో ఆడే మరో విధానంలో, ఎద్దుని బయట వదిలిపెడతారు. దానికి తాడుకాని, తిరగటానికి సరిహద్దులు కానీ ఉండవు. ఆ ఎద్దు దాని ఇష్టం ఎటువైపైనా పరిగెడుతుంది. చాలా ఎద్దులు మనుషులున్న వైపు పోవు కూడా. కానీ వాటిలో కొన్ని ఎద్దులు కదలకుండా నిలబడే ఉంటాయి. వాటి దగ్గరకు ఎవరైనా పోతే వారితో తలపడతాయి. ఇలాంటి ఎద్దులు కాస్సేపు అలా నిలబడి పోరు సలిపి ప్రేక్షకులకు వినోదాన్ని కలిగిస్తాయి.
మరోరకం క్రీడలో ఎద్దుని 50 అడుగుల తాడుతో కట్టి వుంచుతారు. ఆ ఎద్దు అప్పుడు ఆ తాడు ఉన్నంతమేర వరకే తిరగగలుగుతుంది. గివ్ మి ఎ లాంగ్ రోప్ అని అనదు. 7 నుంచి 9 మంది వరకూ ఉండే జట్టు ఈ ఎద్దుని లొంగదీసుకోవాలి. దానికి 30 నిమిషాల గరిష్ట సమయాన్ని కేటాయిస్తారు. ఈ క్రీడ కాస్త సురక్షితమైనది. తాడు కట్టటం వలన ఎద్దు ఎక్కువ దూరం పోలేదు, చుట్టూ సురక్షితమైన కంచె వెనక ఉన్న ప్రేక్షకులు ఈ క్రీడను ఎటువంటి భయం లేకుండా చూడగలుగుతారు.
మధురై దిండిగల్ మధ్య మధురై కి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గుహలో కనుగొన్న పెయింటింగ్ లో ఒక వ్యక్తి ఒంటరిగా ఎద్దు కొమ్ములు పట్టుకుని పోరాడటం కనిపిస్తుంది. ఇది 1500 సంవత్సరాల పాత పెయింటింగ్ గా కనుగొన్నారు.
తమిళనాడులో జల్లికట్టు అంశంగా తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. మురట్టు కలాయ్ అనే తమిళ చిత్రంలో రజనీకాంత్ జల్లికట్టు ఎద్దులను పెంచటంలో వృత్తిపరంగా సఫలమైన గ్రామవాసిగా నటించారు. విరుమాండి అనే సినిమాలో కమల హాసన్ కూడా అటువంటి పాత్రనే వేసారు. అయితే ఆయన డూప్ లేకుండా తనే స్వయంగా చేసారట. ఏమైనా ఎంత సాంప్రదాయమైనా ప్రాణాలకు నష్టం కలిగించే ఈ ఆటను ఎలాగైనా నిలిపివేయాలని కొన్ని సంఘాలు పట్టుబడుతున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more