ప్రభుత్వరంగ కార్యకలాపాలు, రాజకీయ క్షేత్రం
3.1.2011 - ప్రధమ రాష్టపతి బాబూ రాజేంద్రప్రసాద్ 125 వ జయంతి సందర్భంగా ఆయన ప్రతిమతో ఐదు రూపాయల నాణెం విడుదల.
25.2.2011 – రైల్వే మంత్రి మమతా బెనర్జీ లోక్ సభలో 106239 కోట్ల రూపాయల రైల్వే బడ్జెట్ ని ప్రవేశపెట్టారు.
28.2.2011 – ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ లోక్ సభలో 1257729 కోట్ల రూపాయల వ్యయంతో 2011-12 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
5.3.2011 – డిఎమ్ కే పార్టీ యుపిఏ ప్రభుత్వం నుంచి వైదొలగినట్టుగా ప్రకటించింది.
9.3.2011 – భారతీయ తపాలా శాఖ ఇ-పోస్టాఫీస్ పోర్టల్ ని ప్రారంభించింది. దీనిద్వారా తపాలా సమాచారాన్నే కాకుండా తపాలా సేవలను కూడా పొందవచ్చు.
31.3.2011 – ఢిల్లీలో విడుదలైన 2010 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో మొత్తం జనాభా 121,01,93,422. అందులో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో 19,95,81,477 గానూ అత్యల్పంగా సిక్కింలో 607688 మంది జనాభాతో నమోదయింది.
1.4.2011 – 1911లో కడప, హోసూర్, చెంగల్ పట్టుల నుండి కొన్ని ప్రాంతాలు చిత్తూరు జిల్లాగా ఆవిర్భవించింది. అందువలన పది సంవత్సరాలు నిండిని సందర్భంగా, చిత్తూరు శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. అందులో ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. జిల్లా మౌలిక సదుపాయాల కోసం 6000 కోట్ల ప్యాకేజ్ ని కూడా ప్రకటించారు.
7.4.2011 – లాహోర్ సెంట్రల్ జైల్లో 27 సంవత్సరాలు మగ్గిన గోపాల్ దాస్ అనే భారతీయుడిని పాక్ విడుదల చేసింది.
8.4.2011 – దేశంలో ప్రబలిపోతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించిన అన్నా హజారే కోరిక మేరకు లోక్ పాల్ ముసాయిదా తయారీకి ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకోసం ఏర్పాటైన కమిటీలో ప్రభుత్వం తరఫునుంచి ఐదుగురు, పౌరసమాజం నుంచి ఐదుగురు కలిసి ముసాయిదాను రూపొందిస్తారు. ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, కపిల్ సిబాల్, చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్లు ప్రభుత్వం తరఫునుంచి, అన్నాహజారే, శాంతి భూషణ్, ప్రశాంతిభూషణ్, సంతోష్ హెగ్డే, అరవింద్ కేజ్రీవాల్ లు పౌరసమాజం తరఫునుంచి కూడిని ఈ కమిటీకి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షడిగానూ, శాంతి భూషణ్ సహాధ్యక్షుడిగానూ వ్యవహరిస్తారు.
21.4.2011 – న్యూఢిల్లీలో జరిగిన ప్రణాళికా సంఘ సమావేశాల్లో 12 వ పంచవర్ష ప్రణాళికలో అర్ధిక వృద్ధి 9 నుండి 9.5 గా లక్ష్యనిర్దేశం చేసారు.
30.4.2011 – 2 జి స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించిన నివేదికను ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ మురళీ మనోహర్ జోషి లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ కి సమర్పించారు.
2.5.2011 – రాజీవ్ ఆవాస్ యోజన కార్యక్రమంలో మురికివాడల్లో గృహనిర్మాణాలు చేపట్టే ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది. ఈ ప్రణాళిక 12 వ పంచవర్ష ప్రణాళికలో అమలుజరుగుతుంది.
1.6.2011 - జనని-శిశు సురక్షా యోజన కింద గర్భిణీ స్త్రీలకు ఉచిత పౌష్టికాహారం మందులను సరఫరా చేసే పథకాన్నికాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ హర్యానాలో మెవాత్ లో ప్రారంభించారు.
2.6.2011 – తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలో ఉచిత బియ్యం పథకాన్ని ప్రారంభించారు.
22.6.2011 – ఆహార భద్రత బిల్లు ముసాయిదాను యుపిఏ చైర్పర్సన్ సోనియాగాంధీ నేతృత్వంలో జాతీయ సలహా మండలి ఆమోదించింది.
6.7.2011 – మైక్రోఫైనాన్స్ కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ లో రిజిస్టర్ చేసుకోవాలనే బిల్లు ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
18.7.2011 – డార్జిలింగ్ లో గూర్ఖాలాండ్ కి స్వయం ప్రతిపత్తి మీద కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, జార్ఖండ్ ముక్తి మోర్చాల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.
2.8.2011 – కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా, ఆయన సూచించిన సదానంద గౌడ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకరణ.
22.8.2011 – సల్వా జుడుం పేర గిరిజనులను ప్రత్యేకాధికారులుగా నియమించిన ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నియామకాలు రద్దయ్యాయి.
6.9.2011 – ఇక నుంచీ ఒరిస్సా రాష్ట్రం పేరుని ఒడిశా గానూ, ఒరియా భాషను ఒడియాగానూ పిలవటానికి చేసిన బిల్లును లోక్ సభ ఆమెదించింది.
27.12.2011 – రాజ్యాంగ బద్దత లేని లోక్ పాల్ బిల్లు పార్లమెంటులో పాసయింది.
29.12.2011 – లోక్పాల్ బిల్లు రాజ్య సభలో వీగిపోయింది.
విదేశ సంబంధాలు
2.1.2011 - ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి రెండు సంవత్సరాల కాలానికి తాత్కాలిక సభ్యత్వం
9.7.2011 - దక్షిణ ఆసియా దేశాల (సార్క్) స్పీకర్లు, పార్లమెంటేరియన్ల సదస్సు న్యూఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ఇది 5 వ సదస్సు.
20.7.2011 – చెన్నైలో, అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తో భేటీ అయ్యారు.
28.7.2011 – ఐక్యరాజ్య భద్రతా మండలి అధ్యక్షత పదవి భారత దేశానికి లభించింది.
27.10.2011 – భారత ఎన్నికల ప్రధానాధికారి డా.వైయస్.ఖురేషీ ఆసియా ఎన్నికల అధికారిక సంఘానికి వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
24.11.2011 – యునిసెఫ్ కి భారత ప్రతినిధిగా హిందీ నటుడు అమీర్ ఖాన్ ఎంపికయ్యారు. అమితాబ్ బచ్చన్, ప్రియాంకా చోప్రాలు గతంలో ఈ బాధ్యతలను వహించారు.
3.12.2011 – 6 వ రష్యా పార్లమెంటు ఎన్నికలకు పరిశీలకునిగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ వై ఖురేషి ఎంపికయ్యారు.
పదవీస్వీకారాలు, పదవీ విరమణలు
1.1.2011 - ఎయిర్ మార్షల్ ఎన్ కే బ్రౌనీ వైమానిక దళ ఉపాధిపతిగా పదవీ స్వీకారం
20.1.2011 – నౌకా దళంలో తొలి మహిళా సిఎమ్ఓ గా అడ్మిరల్ ర్యాంక్ లో డా.నిర్మలా కణ్ణన్ పదవీస్వీకారం చేసారు.
3.2.2011 – 2011వ సంవత్సరానికి జనగణన ప్రచార కర్తలుగా సచిన్ టెండూల్కర్, ప్రియాంకా చోప్రా నియమితులయ్యారు.
3.2.2011 – సెబి చైర్మన్ గా యు.కె. సిన్హా నియమితులయ్యారు.
4.2.2011 – జాతీయ మైనారిటీ కమిషన్ ఛైర్మన్ గా వజహత్ హబిబుల్లా బాధ్యతలను స్వీకరించారు.
4.3.2011 – 2జి స్పెక్ట్రమ్ కేసులో ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ సంఘ చైర్మన్ గా కాంగ్రెస్ నేత పిసి చాకో నియమితులయ్యారు.
12.3.2011 –ఐక్యరాజ్య సమితి మహిళా విభాగంలో భారతదేశానికి చెందిన లక్ష్మీ పూరి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ గా నియమితులయ్యారు.
19.4.2011 – ఢిల్లీ మేయర్ గా భాజపాకి చెందిన రజ్నీ అబ్బీ ఎన్నికయ్యారు.
23.4.2011 – ఐక్యరాజ్య సమితి తమిళ నటుడు విక్రమ్ ను నీటి వనరుల సద్వినియోగం, మురికి వాడల సుందరీకరణ మొదలైన అంశాలలో ప్రచారం చెయ్యటానికి ప్రతినిధిగా ఎంపికచేసింది.
25.4.2011 – భారత ఒలింపిక్ సంఘ అధ్యక్షునిగా 15 సంవత్సరాలుగా వ్యవహరిస్తున్న సురేష్ కల్మాడీ ఆర్థిక నేర ఆరోపణలతో పదవీచ్యుతులయ్యారు.
2.5.2011 మురళీ మనోహర్ జోషీ పార్లమెంటు ప్రజా పద్దుల సంఘం అధ్యక్షుడిగా పునర్నియామకమయ్యారు.
16.5.2011 – అన్నా డిఎమ్ కే అధినేత్రి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ముఖ్యమంత్రిగా ఎన్నికవటం ఆమెకిది మూడోసారి.
22.6.2011 – విదేశాంగ కార్యదర్శిగా పనిచేస్తున్న నిరుపమ రావ్ ఐఎఫ్ఎస్ అమెరికా రాయబారిగా నియమితులయ్యారు.
2.7.2011 – రక్షణ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఛీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా నియమితులయ్యారు. ప్రధాన మన్మోహన్ సింగ్, ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్, కేంద్ర హోం మంత్రి చిదంబరం తో కూడిన త్రిసభ్య కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
2.7.2011 – దేశంలోని నల్లధనం మీద జరుగుతున్న దర్యాప్తుని సమీక్షించటానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.జీవన్ రెడ్డి నేతృత్వంలో ఒక బృందాన్ని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది.
24.7.2011 – రోహిట్టన్ నారిమన్ సొలిసిర్ జనరల్ గా నియమితులయ్యారు. రాజీనామా చేసిన గోపాల సుబ్రహ్మణ్యం స్థానంలో నారిమన్ నియమించబడ్డారు.
27.7.2011 - సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శివరాజ్ పాటిల్ కర్నాటక లోకాయుక్తగా నియమించబడ్డారు.
7.8.2011 – కామన్ వెల్త క్రీడలలో జరిగిని అవకతవకలమీద మంగ్లూ కమిటీ నివేదిక పై పరిశీలనకు రక్షణ మంత్రి ఆంటోనీ నేతృత్వంతో మంత్రులు బృందం ఏర్పాటు.
26.8.2011 – కేరళ, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మిజోరం, గోవా, తమిళనాడు ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది.
26.8.2011 – ఆర్ ఏ మెహతా గుజరాత్ లోకాయుక్త గా నియమితులయ్యారు.
10.9.2011 – ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రమేష్ పోఖ్రియాల్ రాజీనామా చేసారు. ఆయన మీద ఎన్నో కుంభకోణాల్లో భాగస్వామ్యం ఉన్న ఆరోపణలున్నాయి. బి.సి ఖండూరి ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు.
19.9.2011 – కర్నాటక లోకాయుక్త జస్టిస్ శివరాజ్ పాటిల్ పదవికి రాజీనామా చేసారు.
5.10.2011 – ప్రెస్ కౌన్సల్ ఆఫి ఇండియా కి అధ్యక్షునిగా సుప్రీం కోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ మార్కండేయ కట్జూ నియమితులయ్యారు.
1.11.2011 – అరుణాచల్ ప్రదేశ్ 7 వ ముఖ్యమంత్రిగా నబామ్ టుకి నియమితులయ్యారు.
ఉద్యమాలు, ఉత్సవాలు
18.8.2011 – అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారే జన్ లోక్ పాల్ బిల్లుని రూపొందించి, దాన్ని ఆమోదించాలని కోరికతో న్యూఢిల్లీ రామ్ లీలా మైదాన్ లో నిరాహార దీక్షను ప్రారంభించారు.
5.11.2011 – ఇంఫాల్ సమీపంలోని గ్రామంలో అస్సాం రైఫిల్స్ 10 మంది అమాయకులను వధించినందుకు నిరసనగా మణిపూర్ లో సాయుధ బలాల ప్రత్యేకాధికారాలను తొలగించాలంటూ 2000 లో ఈరోం చారూ షర్మిళ ప్రారంభించిన నిరాహార దీక్షకు 11 ఏళ్ళు నిండాయి.
27.12.2011 – బలహీనమైన లోక్ పాల్ ని ప్రవేశపెట్టినందుకు నిరసనగా అన్నా హజారే ముంబైలో దీక్షనారంభించారు.
కళారంగం
8.1.2011 - రియాల్టీ షో బిగ్ బాస్ -4 లో గెలుపొందిన శ్వేతా తివారీ కోటిరూపాయలను గెలుచుకుంది.
22.1.2011 – చిత్రకారుడు మిథూ సేన్ సమకాలీన చిత్రకళారంగంలో తొలి స్కోడా పురస్కారంలో 10 లక్షల రూపాయాల బహుమానాన్ని స్వీకరించారు.
క్రీడారంగం
16.1.2011 – బరోడాలో జరిగిన రాంజీ ట్రాఫీ క్రికెట్ టెస్ట్ లో రాజస్తాన్ ట్రాఫీని మొదటిసారిగా అందుకుంది.
19.12011 – మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్ లో జరిగిన 5 ఒన్ డేల క్రికెట్ సిరీస్ లో 3-2 తో గెలుపొందింది.
30.1.2011 – తొలిసారిగా ఆసియా జూనియర్ స్క్వాష్ టీమ్ ఛాంపియన్ షిప్ ని దక్కించుకుని భారత్ స్క్వాష్ జట్టు చరిత్రను సృష్టించింది.
12.2.2011 - 34వ జాతీయ జాతీయ క్రీడలు జార్ఘండ్ రాజధాని రాంచీలో ప్రారంభమయ్యాయి. ఇందులో జ్యోతినిపట్టుకుని పరిగెత్తుతున్న జింకను మస్కాట్ గా నిర్ణయించారు.
2.4.2011 – ముంబై వాంఖేడ్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 2011 ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ ని భారత్ గెలుచుకుంది. ప్రపంచ కప్ ని సొంత గడ్డ మీద గెలుచుకున్న మొదటి దేశం భారతదేశమై రికార్డ్ ని సృష్టించింది. మాన్ ఆఫ్ ది టోర్న్ మెంట్ గా యువరాజ్ సింగ్ ఎంపికయ్యారు.
27.4.2011 - భారత క్రికెట్ జట్టుకి కోచ్ గా జింబాబ్వే ఆల్ రౌండర్ ఫ్లెచర్ నియమితులయ్యారు.
12.6.2011 – న్యూఢిల్లీ లో ఆసియా జునియర్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ ఏడు పతకాలు సాధించుకుంది. అందులో మూడు స్వర్ణ పతకాలున్నాయి.
22.7.2011 – పిటి ఉష నేతృత్వంలో పురస్కారాల కమిటీ సిఫార్సులలో గగన్ నారంగ్ ఖేల్ రత్నకు, జహీర్ ఖాన్, గుత్తాజ్వాలా మరో 17 మందిని అర్జున్ అవార్డుకీ ఎంపికయ్యారు.
30.7.2011 – పంకజ్ అద్వానీ ఐదవసారి జాతీయ బిలియర్డ్స్ చాంపియన్ షిప్ టైటిల్ ను సంపాదించారు.
15.10.2011 – జాతీయ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో మణిపూర్ క్రీడాకారిణి మేరీ కోమ్ గెలుపొందారు.
25.10.2011 - భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ మీద సిరిస్ లో 5-0 తో గెల్చింది. మాన్ ఆఫ్ ది మ్యాచ్ గా జడేజా, మాన్ ఆఫ్ ది సిరీస్ గా థోనీ గుర్తింపు పొందారు.
8.11.2011 – ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదాన్ లో వెస్టిండీస్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో సచిన్ 28 పరుగులు తీసేటప్పటికే అతని పరుగుల సంఖ్య 15000 కి చేరుకుని ప్రపంచ రికార్డ్ ని సృష్టించింది.
17.11.2011 – కోలకతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన రెండవ టెస్టా మ్యాచ్ లో వెస్టిండీస్ పై భారత్ గెలిచింది. వివియస్ లక్షణ్ మాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు.
17.11.2011 – మహందర్ సింగ్ థోనీ పదివేల అంతర్జాతీయ పరుగుల తోనూ 200 క్యాచ్ లతోనూ తొలి భారతీయ క్రికెట్ వికెట్ కీపర్ గా రికార్డ్ సృష్టించారు.
20.11.2011 – పంజాబ్ లోని బటిండాలో జరిగిన ప్రపంచ కప్ కబడ్డీ పోటీలలో కెనడా పై భారత్ విజయం సాధించింది.
26.11.2011 – ముంబై లోన వాంఖేడ్ మైదానంలో జరిగిన మూడవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది. దానితో 2-0 తో భారత్ గెలుపొందింది. ఈ మ్యాచ్ లో ఆర్.అశ్విన్ మాన్ ఆఫ్ ది మ్యాచ్ గానూ, మాన్ ఆఫిది సిరీస్ గానూ గుర్తింపు పొందారు.
8.12.2011 – ఇందోర్ లో వెస్టిండీస్ తో జరిగిన నాల్గవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో 149 బంతుల్లో 219 పరుగులు తీసి ప్రపంచ రికార్డ్ ని సృష్టించారు.
విఙాన శాస్త్రం, సాంకేతిక రంగం
20.1.2011 - నంబరు మారకుండానే టెలిఫోన్ సంస్థలను మార్చుకునే వెసులుబాటుగల మొబైల్ నంబర్ పోర్టబిలిటీని ప్రధాని ప్రారంభించారు.
21.1.2011 - యుద్ధనౌక ఐఎన్ఎస్ దీపక్ భారత నౌకా దళంలో చేరింది. ఈ నౌకానిర్మాణాన్ని ఇటలీకి చెందిన ఫిన్ కాంటియర్ సంస్థ చేసింది.
6.3.2011 ఒరిస్సాలో జరిగిన క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఇది క్షిపణిని ఎదుర్కునే క్షిపణి ప్రయోగం. సంపూర్ణంగా దేశీయ పరిఙానంతో తయారైంది.
2.5.2011 - దేశంలో అత్యంత వేగవంతంగా పనిచేసే సూపర్ కంప్యూటర్ ని సాగా 220 గా తిరువనంతపురంలోని సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇస్రో రూపొందించిందని చైర్మన్ రాధాకృష్ణన్ ప్రకటించారు.
28.5.2011 – చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్-4 లో విజేతగా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ టోర్న్ మెంటుగా బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ కి చెందిన గేల్ కి లభించింది.
9.6.2011 – స్వదేశీ పరిఙానంతో తయారు చేసిన పృథ్వీ2 క్షిపణిని చాందీపూర్ నుండి విజయవంతంగా ప్రయోగించబడింది.
13.7.2011 – జిశాట్ 12 ఉపగ్రహం షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్ వి రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ ఉపగ్రహం బరువు 1410 కిలోలు.
20.8.2011 - దేశీయ పరిఙానంతో నిర్మించిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ సాత్పుర నౌకా విభాగంలో చేరింది. నౌకాదళ ఛీఫ్ అడ్మిరల్ నిర్మల వర్మ ఈ నౌకను జలప్రవేశం చేసారు.
5.10.2011 – కంప్యూటర్ రంగంలో జోధ్పూర్ ఐఐటి, కెనడాకి చెందిన డేటావింట్ లు సంయుక్తంగా రూపొందించిన టాబ్లెట్ ను కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ ఆవిష్కరించారు. దీని ఖరీదు 2276 కాగా, విద్యార్థులకు దీన్ని 50 శాతం రాయితీ లో ఇస్తారు.
19.10.2011 – దక్షిణాదిలో తొలి మెట్రో రైలు బెంగళూరులో 7 కిలోమీటర్ల నిడివిలోప్రారంభమైంది.
అబ్బురాలు, ఆవిష్కారాలు, పరిశోధనలు
10.2.2011 - తమిళనాడు అరికోడ్ ప్రాంతంలో కురుమత్తూర్ విష్ణు దేవాలయంలో లభించిన చేర వంశీయుల శాసనం ప్రకారం 871 వ సంవత్సరంలో మహోదయపురాన్ని రామరాజశేఖరుడు పరిపాలించాడు.
19.3.2011 – ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 20 ప్రధాన యురేనియమ్ నిల్వలలో కడప జిల్లా తుమ్మలపల్లి ఒకటని ఆటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ప్రకటించింది.
19.3.2011 – సూపర్ మూన్ దర్శనం. 18 సంవత్సరాలలో భూమికి అతి దగ్గరగా వచ్చే చంద్రడు మామూలుగా కనిపించే ఆకారానికి 14 శాతం పెద్దగానూ 30 శాతం అధిక ప్రకాశవంతంగానూ కనిపించటం విశేషం.
3.4.2011 – వేదాలలో నిక్షిప్తమైవున్న శాస్త్ర పరిఙానం మీద పరిశోధనలు చెయ్యటానికి అమెరికా, యూరప్ దేశాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు కేరళ రాష్ట్రంలో పంజల్ ప్రాంతంలో అతిరత్రం కార్యక్రమానికి విచ్చేసారు.
16.6.2011 – పుట్టపర్తి సత్యసాయి దేహం చాలించిన తర్వాత ఆయన ఎక్కువగా గడిపే యజుర్మందిరాన్ని తెరవగా అందులో అంతులేని సంపదలు బయటపడ్డాయి. అందులో బంగారు ఆభరణాలు, విగ్రహాలు, కరెన్సీ నోట్లు ఉన్నాయి.
20.6.2011 – కేరళ లో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో వెలలేని ధనసంవత్తి వెలుగు చూసింది. మొత్తం ఆరు నేల మాళిగలలో లభించిన నిధులలో బంగారు ఆభరణాలు, నాణేలు ఉన్నాయి. వాటి వెలను అంచనా కట్టటం కష్టమే కానీ, లక్ష కోట్ల వరకూ ఉండవచ్చునని అంచనా.
12.10.2011 – శ్రీహరికోట నుంచి 5 ఉపగ్రహాలను పిఎస్ఎల్ వి- సి18 అంతరిక్షనౌక ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టటం జరిగింది.
గుర్తింపులు, పురస్కారాలు
17.1.2011 – తమిళనాడు ప్రభుత్వం ప్రఖ్యాత గాయని ఎమ్ఎస్ సుబ్బలక్ష్మి పేరుమీద ఏర్పాటు చేసిన పురస్కారానికి సంగీత దర్శకుడు ఇళయరాజా ఎంపికయ్యారు.
26.1.2011 – సయ్యద్ సలీం రచించిన తెలుగు నవల కాలుతున్నపూలతోట కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
30.1.2011 – ముంబైలో జరిగిన 56 వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఉత్సవంలో దాదాసాహెబ్ పురస్కార గ్రహీత ప్రఖ్యాత గాయకుడు మన్నాడే కి జీవిత సాఫల్య పురస్కారం, మాధురీ దీక్షిత్ కి ప్రత్యేక పురస్కారం లభించాయి.
1.2.2011 – రామన్ మెగాసెసే అవార్డ్ గ్రహీత సందీప్ పాండే 2009లో ఆయనకు ప్రదానం చేసిన ఎన్ఆర్ఈజిఎస్ లైఫ్టైమ్ ఎఛీవ్మెంట్ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేసారు. అందుకు కారణం ఉత్తరప్రదేశ్ లో గ్రామ పంచాయితీల్లో పెరిగిపోతున్న అవినీతని ఆయన ప్రకటించారు.
11.2.2011 - ప్రఖ్యాత మలయాళ కవి కురూప్ కి ఙాన్ ఫీఠ్ పురస్కారాన్ని తిరువనంతపురంలో జరిగిన వేడుకలో ప్రధాన మంత్రి అందించారు.
19.2.2011 – చెన్నై లోని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్ పర్సన్ డా.వి.శాంతకు 2011 సంవత్సరానికి నాయుడమ్మ పురస్కారాన్ని ప్రదానం చేసారు.
19.2.2011 – నోబుల్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్ ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక రవీంద్ర పురస్కారానికి ఎంపికచేసింది.
24.2.2011 – సేనావిభాగంలో గ్యాలెంటరీ అవార్డ్ ని అందుకున్న తొలి మహిళ మేజర్ మిథాలి మధుమిత.
16.3.2011 – పీప్లీ లైవ్ హిందీ సినిమా దర్శకురాలు అనూషా రిజ్వికి గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పురస్కారం లభించింది.
22.3.2011 – ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 బ్రాండ్ ఉత్పత్తులలో టాటా కంపెనీ కి స్థానం దక్కింది.
5.4.2011 – ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ పురస్కారం కన్నడ రచయిత ఎస్ ఎల్ బైరప్పకు లభించింది.
6.4.2011 – 17వ శతాబ్దం నాటి మొగల్ చక్రవర్తి జహంగీర్ ఆరడుగుల వర్ణచిత్రం లండన్ లో జరిగిన వేలంలో 10 కోట్లకు అమ్ముడుపోయింది.
11.4.2011 – భారీ పరిశ్రమలలో కోల్ ఇండియా లిమిటెడ్ కి మహారత్న, నైవేలీ లిగ్నైట్ కి నవరత్న, పవన్ హాన్స్ హెలికాప్టర్ కి మినీ రత్న హోదాలను భారీ పరిశ్రమల శాఖా మంత్రి ప్రఫుల్ పటేల్ ప్రకటించారు.
13.4.2011 – విజ్డన్ క్రికెటర్ గా 2010 సంవత్సరానికి సచిన్ టెండూల్కర్ ఎంపకయ్యారు.
21.4.201 – టైమ్ టాప్ విడుదల చేసిన ప్రపంచంలోని 100 మంది అగ్రశ్రేణి వ్యక్తులలో క్రికెటర్ ధోనీ 22 వ స్థానాన్ని దక్కించుకున్నారు.
22.4.2011 – పౌర హక్కుల ఉద్యమాన్ని నడిపిన బినాయక్ సేన్ కు దక్షిణ కోరియా గాంగ్జూ పురస్కారానికి ఎంపిక చేసింది.
28.4.2011 – తానాలో జీవిత సాఫల్య పురస్కారానికి దర్శకుడు కె.విశ్వనాథ్ ఎంపికయ్యారు.
29.4. 2011 - ప్రముఖ దర్శకడు కె.బాలచందర్ కి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది.
12.5.2011 – ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సలహాదారుడు శ్యాం పిట్రోడా కి ఐక్యరాజ్యసమితి నుండి అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ పురస్కారం లభించింది.
19.5.2011 - జార్ఘండ్ కి చెందిన ప్రేమ్ లత ఎవరెస్ట్ అధిరోహించిన అతి పెద్ద మహిళగా రికార్డ్ ను సృష్టించారు.
13.6.2011 – 2012 నోబెల్ శాంతి పురస్కారానికి ఈశాన్య రాష్ట్రాల్లోని వివిధ తెగల మధ్య సామరస్యం, శాంతి నెలకొల్పటానికి కృషి చేస్తున్న అస్సోం కి చెందిన థామస్ మీనమ్ పంపిల్ నామినేట్ అయ్యారు.
27.7.2011 – భారత ఫుట్ బాల్ కంపెనీ మాజీ కెప్టెన్ షబ్బీర్ అలీ, ధ్యాన్ చంద్ లు లైఫ్ టైం ఎఛీవ్ మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు.
15.8.2011 – ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 8 వ సారి ఎర్రకోట మీద జెండా ఎగురవేసారు. అంతకు ముందు మాజీ ప్రధానులు నెహ్రూ 17 సార్లు, ఇందిరా గాంధీ 16 సార్లు జెండా ఎగురవేయగా, మన్మోహన్ సింగ్ మూడవ స్థానంలో ఉన్నారు.
19.8.2011 – కేంద్ర సాహిత్య అకాడమీ 19 మంది బాల సాహిత్యకారులను గుర్తించింది. ఉగ్గుపాలు అనే బాలల పుస్తక రచయిత ఎమ్ భూపాల రెడ్డికి సాహిత్య అకాడమి పురస్కారం లభించింది.
19.9.2011 – కన్నడ సాహితీవేత్త చంద్రశేఖర కంబారాకు ఙానపీఠ పురస్కారం లభించింది. ఙానపీఠ పురస్కారాన్ని పొందిన ఎనిమిదవ కవి ఆయన.
20.9.2011 - 2011 సంవత్సరానికి గ్లోబల్ ఇండియన్ మ్యూజికల్ పురస్కారం (గిమా) మంగళంపల్లి బాలమురళీ కృష్ణకు లభించింది.
23.9.2011 – జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన మళయాళ చిత్రం అదమంటే మకన్ అబు ఆస్కార్ ఎంట్రీకి ఎంపికైంది.
8.10.2011 – నాటక రంగానికి చేసిన సేవలకు గాను నటుడు అనుపమ్ ఖేర్ కాళిదాస్ సమ్మాన్ పురస్కారంతో గౌరవించబడ్డారు.
24.10.2011 – 127 అవర్స్ అనే ఆంగ్ల చిత్రానికి సంగీతాన్నందించిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ కి ప్రపంచస్థాయిలో ఆడియో అవార్డ్స్లో ఒకటైన పబ్లిక్ ఛాయిస్ పురస్కారం లభించింది.
25.10.2011 – కన్నడ రచయిత యు.ఆర్.అనంత మూర్తి, సౌత్ ఏసియా ప్రైజ్ కి నామినేట్ చెయ్యబడ్డ ఆరుగురిలో ఒకరు.
31.10.2011 – 700 కోట్లకి చేరిన ప్రపంచ జనాభాలో 7 వ బిలియన్ శిశువుగా ఉత్తర్ ప్రదేశ్ లో జన్మించిన నర్గీస్ నమోదయింది.
1.11.2011 – క్రికెటర్ మహేందర్ సింగ్ థోనీ, ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని సాధించిన అభినవ బింద్రాలకు ప్రాదేశిస సైన్యంలో లెఫ్ట్ నెంట్ హోదా లభించింది.
7.11.2011- ప్రముఖ తమిళ నవలా రచయిత డి. జయకాంతన్ కు రష్యా ఫెడరేషన్ ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్ షిప్ పురస్కారం ప్రకటించింది.
26.11.2011 - 4279 కిలో మీటర్లు ప్రయాణం చేసే అత్యంత దూర ప్రయాణం చేసే రైలు వివేక్ ఎక్స్ ప్రెస్. ఇది డిబ్రూ నగర్ నుంచి కన్యా కుమారి వరకు ప్రయాణిస్తుంది. కన్యా కుమారి, జమ్మూతావి ల మధ్య నడిచే హిమసాగర్ ఎక్స్ ప్రెస్ కూడా ఈ కోవకి చెందిందే.
28.11.2011 – అమెరికన్ రాజకీయ ఆర్థిక పత్రిక ఫారిన్ పాలసీ తయారు చేసిన వంద మంది మేధావుల జాబితాలో ఐదుగురు భారతీయులున్నారు. వారు, అన్నా హజారే, అజీం ప్రేమ్ జీ, అరుంధతీరాయ్, దీపా నారాయణ, అరవింద్ సుబ్రహ్మణ్యం.
2.12.2011 – 2011 సంవత్సరానికి ఆసియాలో అత్యంత శృంగార పురుషుడిగా హృతిక్ రోషణ్ ని ఈస్టర్న ఐ ఎంపికచేసింది.
10.12.2011 – ఢిల్లీ నగరానికి భారత దేశ రాజధానిగా 100 ఏళ్ళు పూర్తయ్యాయి.
వ్యతిరేక గుర్తింపులు
12.5.2011 – ప్రపంచ అవినీతికోరు దేశాల జాబితాలో భారతదేశానికి 77 వ స్థానం లభించింది.
13.8.2011 – ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కుష్టురోగులున్న దేశంగా భారతదేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశీలనలో తెలిసింది. అంతే కాదు ప్రతి ఏడాదీ లక్షా ఇరవై వేల కేసలు కొత్తగా నమోదవుతున్నాయని తేలింది.
1.9.2011- శిశు మరణాలలో భారత్ దేశం యావత్ప్రపంచంలోనే ప్రధమ స్థానంలో ఉన్నట్టుగానే కాకుండా మొత్తం శిశు మరణాలలో 28 శాతం భారత్ లోనే జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
చట్టాలు, ముఖ్య నిర్ణయాలు
19.1.2011 –ఒక వ్యక్తి రెండు కంటే ఎక్కువ మైక్రో ఫైనాన్స్ సంస్థల నుండి ఋణాలు పొందరాదని రిజర్వ్ బ్యాంక్ కి నియమించిన కమిటీ నుంచి అందిన సిఫారసుల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అనగా 1.4.2011 నుండి ఇది అమలులోకి వస్తుంది.
25.1.2011 – ఓటర్ల దినోత్సవం. ఈ సంవత్సరం అందుకు సూచించిన ఎన్నికల సంఘ ప్రతిపాదనను 20వ తేదీన కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది.
3.3.2011 – క్రిమినల్ కేసులలో ఆరోపణలను ఎదుర్కుంటున్న పిజే థామస్ ను ఛీప్ విజిలెన్స్ కమిషనర్ గా నియామకాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది.
13.3.2011 – పావలా నాణెం, అంతకంటే చిన్న నాణేలను జూన్ 29 కల్లా మార్చుకోమని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. అందుకు అందరికీ సహహకరించవలసిందిగా 41 బ్యాంక్ లను ఆదేశించింది.
15.3.2011 - 40 మైక్రాన్ల కంటే తక్కువ మందంగల ప్లాస్టిక్ సంచులను కేంద్ర పర్యావరణ శాఖ నిషేధించింది.
29.3.2011 - జోసెఫ్ లెలివెల్డ్ రచించిన గ్రేట్ సోల్ మహాత్మా గాంధీ.... పుస్తకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
14.4.2011 – స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ని మహరాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
9.5.2011 – అయోధ్య రామజన్మ భూమి వివాదంలో ఆ స్థలాన్ని మూడు భాగాలుగా విభజించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.
21.7.2011 – బినామీ లావాదేవీలను నిరోధించటానికి తయారైన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
22.7.2011 – స్థానికి సంస్థలలోమహిళలకున్న 33 శాతం రిజర్వేషన్ ని 50 శాతానికి పెంచటానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది.
11.8.2011 – 1991లో జరిగిన రాజీవ్ గాంధీ హత్య కేసులో మరణశిక్ష పడ్డ తీవ్రవాదుల క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించారు.
11.8.2011 – సిక్కిం మాజీ ముఖ్యమంత్రి సి.పి.నార్ బహదూర్ భండారీ అరెస్టయ్యారు.
11.8.2011 - వెయ్యి రూపాయల నాణేల ముద్రణకు రాజ్యసభ ఆమోదం తెలియజేసింది.
18.8.2011 – కోలకతా న్యాయమూర్తి సౌమిత్రీ సేన్ ను పదవి నుండి తొలగించాలని రాజ్యసభలో సిపిఎమ్ నేత సీతారాం ఏచూరి ప్రతిపాదించగా 189 అనుకూలంగానూ, 17 ప్రతికూలంగానూ ఓట్లు వేసారు.
19.8.2011 – పశ్చిమ బెంగాల్ ను బంగా గా పేరు మార్చటానికి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకగ్రీవింగా సమ్మతించాయి.
23.8.2011 – తమిళ సంవత్సరాదిని 14 జనవరి నుంచి ఏప్రిల్ 14 కి మార్చినట్టుగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
27.8.2011 – జనామోదమైన లోక్ పాల్ బిల్లుకి సూత్రప్రాయంగా ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది.
30.9.2011 – గనులు, ఖనిజాల అభివృద్ధి, క్రమబద్ధీకరణకు సంబంధించిన బిల్లు క్యాబినెట్ లో ఆమోదం పొందింది.
11.10.2011 – ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లల్లో 8 శాతం పొందిన పార్టీలకు గుర్తింపు లభిస్తుందని ఎన్నికల కమిషనర్ ఎస్.వై.ఖురేషీ ప్రకటించారు.
25.10.2011 – 2007 లో నియమించబడ్డ జిఆర్ మజీతియా కమిటీ పాత్రికేయుల వేతన సవరణల మీద చేసిన సిఫారసులను కేంద్రప్రభుత్వం ఆమోదించింది.
8.11.2011 – 5 వేల జనాభా దాటిన ప్రాంతాలన్నిటిలోనూ బ్యాంక్ శాఖలను ప్రారంభించవలసిందిగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేస్తూ అందుకు 2012 వరకు గడువిచ్చింది.
వేడుకలు, సదస్సులు
8.1.2011 – తొమ్మిదవ ప్రవాసీ భారతీయ దివస్ ను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించారు.
12.1.2011 – వైబ్రంట్ గుజరాత్ 5 వ ద్వైవార్షిక సంచికను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ విడుదల చెయ్యగా, 7936 వ్యాపార ఒప్పందాలు, 20.83 లక్షల కోట్ల పెట్టుబడులు గుజరాత్ కి ఒనగూడాయి.
26.1.2011 – 62 వ గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు సుసిలో బాంబాంగ్ విచ్చేసారు. తొలి గణతంత్ర వేడుకల్లో కూడా ఇండోనేషియన్ అధ్యక్షుడు సుకర్నో హాజరయ్యారు.
1.2.2011 – ప్రధానమంత్రి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో అఖిల భారత ముఖ్యమంత్రుల సదస్సు జరిగింది.
4.2.2011 – 6వ అఖిల భారత తెలుగు మహాసభలు బరంపురంలో ప్రారంభమయ్యాయి.
12.2.2011 – ప్రపంచ తపాలా బిళ్ళల ప్రదర్శనను రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఢిల్లీ ప్రగతి మైదాన్ లో ప్రారంభించారు. ఇందులో మహానటి సావిత్రి చిత్రంతో 5 రూపాయల తపాలా బిళ్ళను కేంద్ర సహాయ మంత్రి గురుదాస్ కామత్ విడుదల చేసారు.
సంతాపఘడియలు
23.1.2011 – ప్రముఖ తత్త్వవేత్త పద్మవిభూషణ గ్రహీత ప్రో.కొత్త సచ్చిదానందమూర్తి మరణం.
24.1.2011 – ప్రముఖ హిందూస్తానీ సంగీత విద్వాంసుడు, భారత రత్న గ్రహీత భీంసేన్ గురురాజ్ జోషి మరణం.
24.2.2011 – ప్రఖ్యాత తెలుగు రచయిత ముళ్ళపూడి వెంకటరమణ చెన్నైలో మరణించారు.
4.3.2011 – కాంగ్రెస్ సీనియర్ నేత అర్జున్ సింగ్ మరణం.
22.3.2011 – ప్రఖ్యాత హిందీ నటుడు బాబా క్రస్టో మరణం.
24.4.2011 – అపర దైవంగా, సాయిబాబా అంశగా భక్తులు పూజించే పుట్టపర్తి సత్యసాయి మరణం.
3.5.2011 – హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ హిస్సార్ లో మరణించారు.
4.5.2011 – అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
7.5.2011 – విశ్వవిఖ్యాత నాట్యాచారుడు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ హైదరాబాద్ లో మరణించారు.
15.5.2011 – భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు, రైతు ఉద్యమ నాయకుడు మహేంద్రసింగ్ తికాయత్ మరణించారు.
14.6.2011 – గంగానది ప్రక్షాళన కోసం 19.2.2011 నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న సాధువు స్వామి నిగమానంద్ మరణించారు.
15.6.2011 – రుద్రవీణ విధ్వాంసుడు పద్మభూషణ్ ఉస్తార్ అనద్ అలీఖాన్ మరణించారు.
21.6.2011 - గతంలో రిజర్వ్ బ్యాంక్ సంచాలకునిగాను, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అధ్యక్షునిగాను, ప్రధానమంత్రికి ఆర్థిక మండలి సలహాదారుడిగానూ పనిచేసిన ప్రముఖ అర్థశాస్త్రవేత్త సురేష్ టెండూల్కర్ మరణించారు.
17.7.2011 – తిరువనంతపురం ఆలయ సంపద గురించి సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేసిన న్యాయవాది, మాజీ ఐపిఎస్ టి.పి.సుందర రాజన్ మరణించారు.
10.8.2011 – తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పి.సి. అలెగ్జాండర్ మరణించారు.
6.9.2011 – ప్రముఖ వాస్తు శిల్పి, హైద్రాబాద్ హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి, తిరుమల తిరుపతి ఆస్తాన శిల్పి గజపతి స్థపతి మరణించారు.
22.9.2011 – భారత క్రికెట్ జట్టులో అతి చిన్న వయసులోనే (21 సంవత్సరాలు) కెప్టెన్ గా పేరుగాంచిన మన్సూర్ అలీఖాన్ పటౌడీ మరణించారు.
5.11.2011 – అసోంకి చెందిన ప్రముఖ గాయకుడు పద్మభూషణ్ భూపేన్ హజారికా ముంబైలో మరణించారు.
26.11.2011 – మావోయిస్ట్ నాయకుడు మల్లేజుల కోటేశ్వరరావు ఉరఫ్ కిషన్ జీ పశ్ఛిమ బెంగాల్ లోని మిడ్నాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారు.
29.11.2011 – ప్రముఖ అస్సామీ రచయిత్రి, ఙానపీఠ పురస్కార గ్రహీత ఇందిరా గోస్వామి మరణించారు.
4.12.2011 – ప్రముఖ హిందీ నటుడు దేవానంద్ మరణం.
11.12.2011 – ప్రఖ్యాత గోవన్ కార్టూనిస్ట్ మారియో మిరందా పానాజీలో మరణించారు.
కోర్టు కేసులు, అభియోగాలు
7.1.2011 - కేరళ హైకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.జి.భాస్కరన్ ఆదాయానికి మించిన ఆస్తులున్న ఆరోపణల దృష్ట్యా రాజీనామా చేసారు.
31.1.2011 – 2 జి స్పెక్ట్రమ్ కేసులో మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా, ఇతర ఉన్నతాధికారుల ప్రమేయమున్నదని జస్టిస్ శివరాజ్ పాటిల్ కమిటీ తన నివేదికను సమర్పించింది.
2.2.2011 – 2 జి స్పెక్ట్రమ్ కేసులో మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా అరెస్ట్. రాజాతో పాటు అతని సెక్రటరీ లు చండోలియా, సిద్ధార్ధ బెహురా కూడా అరెస్టయ్యారు.
20.5.2011 – మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి కుమార్తె, కలైంజర్ టివి మేనేజింగ్ డైరెక్టర్ శరద్ కుమార్ 2 జి స్పెక్ట్రమ్ కేసులో అరెస్టయ్యారు.
22.11.2011 – ఆదాయం కంటే ఆస్తులు ఎక్కువున్న అభియోగం మీద తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద నడుస్తున్న కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆమె బెంగళూరు కోర్టులో స్వయంగా హాజరుకావలసి వచ్చింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more