పార్లమెంటులో ఆమోదంకోసం చాలా కాలంగా వేచిచూస్తున్న బిల్లు జ్యడిషియల్ స్టాండర్డ్స్ అండ్ ఎకౌంటబిలిటీ బిల్లు. అక్టోబర్ 2010లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లుని పార్లమెంటు స్టాండింగ్ కమిషన్ కి పంపగా 2011 ఆగస్ట్ లో స్టాండింగ్ కమిటీ తనదైన కొన్ని సూచనలతో ముందుకొచ్చింది.
సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీల మీద అభియోగాలను విచారించి, అవసరమనుకుంటే వారిని తొలగించేందుకు అవసరమైన యంత్రాంగం చాలా అవసరమని లోక్ సభ సభ్యులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారని కేంద్ర న్యాయ శాఖా మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు.
తాజా బిల్లులో పాత జడ్జెస్ ఎన్కవైరీ యాక్ట 1968ని రద్దు చేస్తూ అందులోని హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జీలను తొలగించే అధికారాలను పార్లమెంటుకి ఉన్నటువంటి కొన్ని కీలకమైన అంశాలను మాత్రం తీసుకోవాలనే ప్రతిపాదన ఉంది.
కానీ ఈ కొత్త ప్రతిపాదనలు కూడా చాలవని, అందువలన మరోసారి దీన్ని పరిశీలించవలసిందని భాజపా నేత చంద్రెగౌడ అనగా, కాంగ్రెస్ పార్టీ నేత మనిష్ తివారీ దాన్ని సమర్థిస్తూ, సుప్రీం కోర్టు, 21 హైకోర్టుల జడ్జీల నియామకం, బదిలీల విషయంలో కూడా పునరాలోచన చెయ్యాలన్నారు. ఆమధ్య కోలకతా హైకోర్టు జడ్జ్ సౌమిత్ర సేన్ కేసులో అభియోగాలున్న ఆయన్ని తొలగించటానికి ప్రభుత్వం నానా పాట్లు పడాల్సి వచ్చింది. ఈ విషయంలో మాట్లాడుతూ, మనదేశ 64 సంవత్సరాల కాలంలో ఒకే ఒక్క ఇంపీచ్ మెంటు కేసు వచ్చింది అది కూడా సగమే జరిగిందని మనీష్ తివారీ అన్నారు.
ఈ మధ్య కాలంలో ప్రభుత్వ చర్యల మీద, రాజకీయ నాయకుల మీద కూడా జడ్జ్ లు రకరకాలుగా వ్యాఖ్యానాలు చెయ్యటం ప్రభుత్వంలో ఉన్న నాయకులకు, వారిని కోర్టులో ప్రాతినిధ్యం వహించే న్యాయశాఖలోని వారికి కూడా నచ్చటం లేదు. స్టాండింగ్ కమిటీ చేసిన సూచనలో ఈ ప్రస్తావన ఉంది. జడ్జ్ లు అనవసరమైన వ్యాఖ్యానాలు చెయ్యరాదని సూచించింది. జడ్జిలు గా వ్యవహరిస్తున్న కాలంలో అదే కోర్టులో పనిచేస్తున్న న్యాయవాదులతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు, స్నేహాలు, కలిసి తిరగటాలు పెట్టుకోగూడదని కూడా సూచన ఉంది. మరో ముఖ్యమైన సూచన ఏమిటంటే, కోర్టులో జరిగే విచారణలను వీడియో తియ్యటం వలన ఆ జడ్జ్ లమీద అభియోగమేదైనా ఉంటే దాన్ని పరిశీలించటానికి తోడ్పడుతుందని.
జడ్జీల నియామకంలో రిజర్వేషన్ ని పాటించాలని సమాజవాది పార్టీ, బహుజన సమాజవాది పార్టీ, జనతాదళ్ యు లు కోరుతున్నాయి. ఎస్ సి, ఎస్ టి, ఓబిసి, మైనార్టీ, మహిళలకు రిజర్వేషన్ ఉండాలని, చాలా కేసుల్లో ఇటువంటి వారి కేసులు అనవసరంగా జాప్యం చోటుచేసుకుంటున్నదని వారు అభిప్రాయపడుతున్నారు. అసలు వారి నియామక సమయంలో సరైన విచారణ జరగాలని, జడ్జ్ ల నియామకం కూడా ఐఏఎస్ లాగా గట్టి పరీక్షలతో జరగాలని బిఎస్ పి నేత విజయ బహదూర్ సింగ్ తన అభిప్రాయాన్ని తెలియజేసారు. జడ్జ్ ల పదవీ విరమణను సుప్రీం కోర్టుకీ హైకోర్టులకూ సమానంగా చెయ్యాలని కొందరు సూచించారు. పోయినసారి రిటైర్ మెంటు వయసుని 60 నుంచి 62 కి పెంచారు. ఇప్పుడు హైకోర్టు జడ్జ్ ల వయోపరిమితిని సుప్రీంకోర్టు జడ్జ్ లకు సమానంగా 65 కి పెంచాలని ప్రతిపాదన. ప్రస్తుతం 21 హైకోర్టులలో 604 మంది జడ్జిలు పనిచేస్తున్నారు. ఇంకా 291 ఖాళీలున్నాయి.
ఈ బిల్లులో ఇంకా ఎన్నో సవరణలు చేసి న్యాయశాఖలో సంపూర్ణమైన మరమ్మత్తులు అవసరమని, అందువలన ఈ బిల్లుని తిరిగి వెనక్కి పంపించమని బహదూర్ సింగ్ అనగా సభలో అన్నివైపుల నుంచీ హర్షధ్వనులు బెంచీలమీద చప్పుళ్ళ రూపంలో వినిపించాయి.
అయితే, జెడి యు కి చెందిన అర్జున్ రాయ్ మాత్రం, లోక్ పాల్ కి సిబిఐని కట్టబెట్టకుండా కాపాడుకున్న ప్రభుత్వం ఇప్పుడు న్యాయవిభాగాన్ని కూడా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. ఇదే జరిగితే ఇక మిగిలింది ఎన్నికల కమిషనే. దాన్ని కూడా తమ ఆధిపత్యం కిందికి తెచ్చుకుంటే ఇక రాజకీయ నాయకులు ఆడింది ఆట పాడింది పాట అని ప్రతిపక్ష నాయకులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more