Kiran kumar government

international news, business news, breaking news, world news, news, current news,sports news, entertainment news

international news, business news, breaking news, world news, news, current news,sports news, entertainment news

Kiran kumar Government.GIF

Posted: 12/28/2011 10:38 AM IST
Kiran kumar government

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు మింగలేక – కక్కలేని పరిస్థితి ఎదుర్కుంటుదని చెప్పవచ్చు. అసలే అనే సమస్యలతో సతమతమౌవుతున్న కిరణ్ ప్రభుత్వం కంరెంట్ ఛార్జీలు పెంచడానికి ఆమోదం తెలపడానికి సిద్దపడింది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదన కాంగ్రెస్ నేతలకు వణుకు పుట్టిస్తోంది. ఉప ఎన్నికలకు ముందు ఈ ప్రతిపాదన రావడం, దానికి విస్తృతంగా ప్రచారం రావడం,ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థిరపడుతున్నారని భావిస్తున్న తరుణంలో విద్యుత్ ఛార్జీల ప్రబావం ఎలా ఉంటుందోనన్న ఆందోళనను ముఖ్యమంత్రి సన్నిహితులు, కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో అదికారుల మాటకే ప్రాముఖ్యత ఇస్తున్నారని, ఆచరణలో ఏమి జరుగుతుందో ఆలోచించడం లేదని ఒక ఎమ్మెల్సీ అన్నారు.ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన వివిధ పదకాలు కిరణ్ కు పాజిటివ్ వాతావరణం తెచ్చిపెట్టాయని, ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచినా ప్రజలు పరిస్థితిని అర్ధం చేసుకుంటారని అదికారులు కిరణ్ కు చెబుతున్నారని, ఆయన కూడా ఇదే అభిప్రాయానికి వస్తున్నారన్న భావన కలుగుతోందని కాంగ్రెస్ నేతలు కొందరు చెబుతున్నారు.

అయితే ఇది ప్రమాదకరమని, కరెంటు ఛార్జీలు పెరిగితే ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత వస్తుందని , చంద్రబాబునాయుడు కూడా విద్యుత్ ఛార్జీలను పెంచే దెబ్బతిన్నారని వారు గుర్తు చేస్తున్నారు. అసలే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటే కరెంటు ఛార్జీలు ఈ స్థాయిలో పెరిగితే ఇక ఆశలు వదులుకోవలసి వస్తుందని కాంగ్రెస్ నేతలు కొందరు హెచ్చరిస్తున్నారు. అయితే ఛార్జీలు పెంచకుండా, ప్రభుత్వం నిదులు సమకూర్చకుండా , విద్యుత్ కోతలు యధావిధిగా కొనసాగిస్తే అది మొత్తం వ్యవస్థకే డేంజర్ అవుతుందని,అప్పుడు రాజకీయంగా ఏమి చేసినా ప్రయోజనం ఉండదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చివరికి కరెంటు ఛార్జీల వ్యవహారం ఏమవుతుందో కాని, కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పటినుంచే భయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sri lanka illegal mining case
Deeksha in bodhan complete two years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles