Mystery on dinosaur disappearance resolved

The Krishna-Godavari basin near Rajahmundry has now helped scientists solve the age-old mystery of disappearance of dinosaurs and other animals, 65 million years ago.

The Krishna-Godavari basin near Rajahmundry has now helped scientists solve the age-old mystery of disappearance of dinosaurs and other animals, 65 million years ago.

Dinosaurs of Rajamandri Section.GIF

Posted: 12/26/2011 06:02 PM IST
Mystery on dinosaur disappearance resolved

dynosarజురాసిక్ పార్కు సినిమా చూశారా! అందులోని రాకాసి బల్లులను (డైనోసార్లు) ఒకసారి తలచుకుంటేనే గుండె ఝల్లుమంటుంది కదూ.. కేవలం సినిమాలోనే మనల్ని అంతగా భయపెట్టిన ఆ రాకాసి బల్లులు ఎక్కడో కాదు.. మన తెలుగునేలపైనే సంచరించాయంటే, అది కూడా కనుచూపుమేర ప్రకృతి పరిచిన అందాలకు నెలవైన కోనసీమలో.. ఇవి ఒకనాడు కొలువు తీరాయంటే ఏమనిపిస్తుంది? అసలా ఊహే భయం గొలుపుతుంది కదూ.. కానీ ఇది నిజ్జంగా నిజం. కోట్ల సంవత్సరాల కిందట ఇక్కడ డైనోసార్లు ఉండేవట. మానవజాతి ఆవిర్భావానికి ముందే ఈ సీమలో జీవరాశులు మనుగడ సాగించాయని ఢంకా బజాయిస్తున్నారు యూఎస్ శాస్త్రవేత్త జెర్టా కెల్లర్. ఆమె మాటల్లో చెప్పాలంటే ప్రస్తుత కోనసీమే ఒకప్పుడు జురాసిక్ పార్కు. అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జెర్టా కెల్లర్ బృందం సాగించిన పరిశోధనల్లో ఈ వాస్తవం వెల్లడైంది.

పరిశోధనలు సాగిందిలా..

డైనోసార్ల సంచారం.. ఆ జాతి అంతరించిపోవడంపై అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జెర్టా కెల్లర్ నేతృత్వంలోని బృందం కొన్నేళ్లుగా పరిశోధనలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఈ బృందం మన దేశంలోని డెక్కన్ రీజియన్‌లో పరిశోధనలు కొనసాగించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు పరిశోధనలకు అంత వీలుగా ఉండకపోవడంతో.. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో ఈ బృందం పరిశోధనలు జరిపింది. ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాలను వెలికితీస్తున్న ఓఎన్‌జీసీ భూగర్భంలో ఐదు కిలోమీటర్ల లోతు వరకూ డ్రిల్లింగ్ చేస్తున్నది. దీంతో ఈ బృందం ఓఎన్‌జీసీ సహకారాన్ని తీసుకుంది.కేజీ బేసిన్ పరిధిలోని కాకినాడ, రాజోలు, ఏనుగువానిలంక, చింతలపల్లి, యలమంచిలి, పాలకొల్లు, నరసాపురం, పెనుమదం, వశిష్ట గోదావరి పాయకు తూర్పు వైపున రెండు కలిపి.. మొత్తం 11 బావుల నుంచి భూగర్భ నమూనాలను సేకరించింది. దీంతోపాటు కొవ్వూరు సమీపంలోని గౌరీపట్నం, రాజమండ్రి సమీపంలోని కాతేరు క్వారీల నుంచి కూడా భూగర్భ నమూనాలు తీసుకుంది. ఈ శాంపిల్స్‌లో లభించిన బేసాల్ట్ రాక్‌ను పరిశీలించిన అనంతరం రాకాసి బల్లులు ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో సంచరించేవని ఈ బృందం గుర్తించింది. వాస్తవానికి గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే కెల్లార్ పరిశోధనలు పూర్తయ్యాయి. శాంపిల్స్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి విశ్లేషించుకున్న ఏడాదిన్నర తర్వాత కెల్లార్ బృందం తమ నివేదికను రూపొందించింది. పొడి వాతావరణంలో జీవించే రాకాసి బల్లుల జాతి కోనసీమ ప్రాంతంలో సంచరించేదని ఆమె నిర్ధారించారు.

డైనోసార్లు అంతమైందిలా..


67 మిలియన్ సంవత్సరాల క్రితం డెక్కన్ రీజియన్‌లో మధ్యప్రదేశ్ కేంద్రంగా మూడు అతి పెద్ద అగ్నిపర్వతాలు బద్దలయ్యాయని, వాటి నుంచి వెలువడిన లావా, బూడిద ప్రభావంతో ఈ ప్రాంతంలో వాతావరణ మార్పులు వచ్చి, డైనోసార్ల జాతి అంతరించిపోయిందని నిర్ధారణకొచ్చారు. ఈ లావా సుమారు 1,500 కిలోమీటర్ల దూరం ప్రవహించినట్టు తేల్చారు. లావా దాదాపు 3,500 మీటర్ల మందంతో పెల్లుబికినట్టు ఈ పరిశోధనల్లో వెల్లడైంది. ప్రపంచంలోనే అతిపెద్దవైన లావా ప్రవాహాలు డెక్కన్ రీజియన్‌లో సంభవించాయని కెల్లర్ బృందం చెబుతోంది.ఆ ధాటికే కోనసీమ ప్రాంతంలో సంచరించిన డైనోసార్లు పూర్తిగా అంతరించాయని కెల్లర్ నివేదిక పేర్కొంది. రాకాసి బల్లుల జాతి అంతరించిపోవడానికి ఆస్టరాయిడ్‌లు, పిడుగులు కారణమని ఇప్పటిదాకా భావిస్తున్నారు. దీనికి లావా కూడా మరో కారణమని తాజా పరిశోధనలతో స్పష్టమైంది. 290 మిలియన్ సంవత్సరాల నుంచి.. 67 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు గల కాలాన్ని జురాసిక్ ిపీరియడ్‌గా భావిస్తారు. ఆ కాలంలోనే రాకాసి బల్లుల సంతతి ఎక్కువగా ఉండేదట. దీనినిబట్టి మనిషి పుట్టుకకు ముందే డైనోసార్లు కోనసీమ ప్రాంతంలో సంచరించాయని కెల్లర్ చెబుతున్నారు. కెల్లర్ బృందానికి ఓఎన్‌జీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పి.కె.భోమిక్, పరిశోధకులు హెచ్.ఉపాధ్యాయ్, ఎ.దేవ్, జయప్రకాష్, ఆదిత్య, ఎ.ఎన్.రెడ్డి తదితరులు సహకారం అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police suggest new year precautions
Mukkoti celebrations started at bhadrachalam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles