బాక్సైట్ నిక్షేపాల తవ్వకాల మీద కేంద్ర నిపుణల కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించటంతో విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది. కమిటీని గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేసిన కొందరు సిపిఐ సిపిఎమ్ జనసత్తా కార్యకర్తలను అరెస్ట్ చేసారు. ఫ్లెక్సీలతో నినాదాలతో ఆందోళన చేస్తుంటే అరెస్ట్ ల పర్వం ఇంకా కొనసాగుతూనేవుంది. కమిటీ సభ్యులను రెండు రోజులుగా మన్యం ప్రాంతంలో అడ్డుకోవటంతో వారు ఏరియల్ సర్వేకి పూనుకున్నారు.
అరకు వ్యాలీలోని సీతాపురం గ్రామస్తులను మహిళలతో సహా 60 మందిని అరెస్ట్ చేసారు. వారి అరెస్ట్ అన్యాయమని, వారిని వెంటనే విడుదల చెయ్యాలని కార్యకర్తలు గిరిజిన సంఘాలు డిమాండ్ చెస్తున్నాయి. వేలాది గిరజన కుటుంబాలు నిరాశ్రయులవుతారని, తవ్వకాల వలన అక్కడి పంటభూములు, జలాశయాలు కలుషితమైపోతాయని, కాఫీ తోటలు పూర్తిగా నాశనమైపోతాయని స్థానికుల ప్రతిఘటనకు వామపక్షాలు, గిరిజన సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. 247 గ్రామాలు, 9312 కుటుంబాలు, 44000 మంది గిరిజనులకు నీడ లేకుండా చెయ్యటమే కాకుండా కాఫీ తోటల మీద ఆధారపడే 60000 కుటుంబాలకు నష్టం చేకూరుస్తుందని, 8000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తుందని వామపక్షాలు నిరసన గళాలు ఎత్తాయి. ఓపెన్ కాస్ట్ పద్ధతిలో తవ్వకాలు జరగటం వలన ధూళి వ్యాపించి, గిరిజనులకు శ్వాసకోస వ్యాధులు తలెత్తే అవకాశముందని సంఘాలు, పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
చింతపల్లి అడవుల్లో బాక్సైట్ నిక్షేపాలను తవ్వి తీయటంతో పాటు, ప్రభుత్వం అందరి స్థానికుల అభిప్రాయానికి వ్యతిరేకంగా ముందుకెళ్ళటానికి మరో కారణం, అరకు నుంచి మొదలై అడవులన్నీ మావోయిస్ట్ లకు స్థావరాలుగా ఉండటం. తవ్వకాల కార్యకలాపాలు మొదలైతే మావోయిస్ట్ ల బెడద కూడా పోతుందని ప్రభుత్వం యోజన అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more