తన ఇంటి పేరు నే కలం పేరు గా మార్చుకుని, తెలుగు సినిమా చరిత్ర లోనే మరచిపోలేని రచయితగా, నిర్మాతగా, ముక్కుసూటి మనిషిగా గుర్తింపు పొందిన 'మల్లెమాల' ఈ వారం మన లెజెండ్స్ అఫ్ ఇండియన్ సినిమా.
తను తీసిన ప్రతి సినిమా లో సమాజానికి ఉపయోగపడి, సినిమా చూసిన వాళ్ళని ఆలోచింపచేసే అంశం ఖచ్చితంగా ఉండేలా తపన పడ్డ అతి తక్కువ నిర్మాతల్లో ఒకరు యమ. యస్. రెడ్డి. మూడు దశాబ్దాలకు పైగా తెలుగు చిత్రసీమలో కొనసాగుతూ ఎన్నో సినిమాలు నిర్మించిన ఈయన, తన సినిమా లాభాల్లో తీలినా, నష్టాలలో మునిగినా, సినిమా తీయడంలో తన పంధాని మాత్రం మార్చుకోలేదు.
తన సొంత ఊరు లో ధియేటర్ యజమానిగా సినీ ప్రస్థానాన్ని ఆరంభించిన 'మల్లెమాల', వ్యాపార లావాదేవీల నిమిత్తం మద్రాస్ కి వెళ్ళినప్పుడు, ఒకానొక ధియేటర్ లో అప్పటి హీరోయిన్ జయలలిత నటించిన సినిమా చూసినప్పుడు, ఆమె తేరా పై రాగానే ధియేటర్ లో ఉన్న జనాల కేరింతలు చూసి, ఆ తమిళ్ సినిమా ని తెలుగు లో అనువదించి విడుదల చెయ్యాలన్న ఆలోచన నే నిజం చేసుకుని, నిర్మాతగా తొలి అడుగులు వేసారు. అసలు రెడ్డిగారు అనువదించి విడుదల చెయ్యాలనుకున్న ఈ సినిమా హక్కుల కోసం, యన్.టీ.ఆర్ వంటి హీరోలు పోటీ పడ్డారట. కాని, ఇరవై వేలు విలువ చేసే ఈ సినిమా హక్కులని అరవై వేలకు కొనుక్కొని, సినిమాని తెలుగు లో అనువదించి, 'కన్నె పిల్ల' గా విడుదల చేసి, మూడు లక్షలకు పైగా లాభం సంపాదించారు, 'మల్లెమాల'.
నిర్మాతగా మారిన రెడ్డిగారికి ఎన్నో ఎదురుదెబ్బలు. నిర్మాతగా తొలి దశల్లో ఆయన తెలుగులో నిర్మించిన 'భార్య', 'శ్రీ కృష్ణ విజయం', 'ఊరికి ఉపకారి' వంటి ఎన్నో సినిమాలు మంచి కధాంశం ఉన్నవిగా గుర్తింపు పొందినా, కమర్షియల్ పరంగా విజయం సాధించలేక పోయాయి. 'నిర్మాత అనేవాడు, తను తీసే ప్రతి సినిమా సమాజానికి ఉపయోగ పడేవిధంగా ఉండాలి, సమాజంలో ఉన్న చెడుని, అది చేసే హానిని వీలెత్తి చుబించే విధంగా ఉండాలి, ఇది ప్రతీ నిర్మాత కనీస బాధ్యాత' అని నమ్మిన 'మల్లెమాల', ఎన్ని ఆటంకాలు ఎదురైనా తను నమ్మిన సూత్రాన్ని మాత్రం విడువలేదు. తన కుమారుడు, శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తూ తీసిన 'అంకుశం', 'అమ్మోరు', 'అరుంధతి', వంటి ఎన్నో సినిమాల విజయం, యమ.యస్. ఆర్ట్స్ బ్యానర్ని గుర్తిమ్పచేసేవె.
డిసెంబర్ పదకొండున కాలం చేసిన రెడ్డిగారు, తన చివ్వరి రోజుల్లో కూడా, చిత్ర నీమలో తనకి ఎదురైన అనుభవాలని 'ఇది నా కధ' పీరిట ఆవిష్కరించి, నిర్మొహమాటంగా ఎందరో దర్శకులు, నిర్మాతలు, హీరోల గురించి తనకి ఎదురైన అనుభవాలని రాసారు. ఒక విధంగా చిత్రసీమలో అభ్యంతరకరంగా మారిన ఈ పుస్తకాన్ని తరువాత విడుదల చెయ్యడం ఆపేశారు.
తన ఆలోచనని, భావాన్ని నిరభ్యంతరంగా చెప్పే ముక్కుసూటి మనిషిగా, నిర్మాతల శ్రేయస్సు కోసం స్లాబ్ విధానం నిర్మూలంకై తన వంతు పోరాటం చేసిన నిర్మాతగా, 'మల్లెమాల' ఎప్పటికీ సుపరిచితం.
క్రమశిక్షణకి మారుపేరైన 'మల్లెమాల' తను ధియేటర్ యజమానిగా ఉన్నప్పుడు ఎదుర్కున్న సంఘటన వివరించడంతో, ఈ వారం 'లెజెండ్స్ అఫ్ ఇండియన్ సినిమా' ని ముగిద్దాం.
ఆ రోజుల్లో ప్రభుత్వం వారు సినిమా ప్రదర్శించే ముందు, ప్రతీ ధియేటర్ లో వేయాలని 'నో స్మోకింగ్' స్లయిడ్స్ ని పంపేవారు. అవే రెడ్డిగారి ధియేటర్ లో కూడా వెయ్యడం జరిగింది. ఈ సమయంలో, ఆ ఊరి సుబ కలెక్టర్ టికెట్ లేకుండా సినిమా చూసేందుకు రావడమే కాకుండా, ధియేటర్లో ధూమపానం చేయసాగారు. అప్పుడా సుబ కలెక్టర్ తో రెడ్డిగారు 'అయ్యా, నీనైతే పెద్దగా చదువుకోలేదు. మీరు మీ తల్లి దండ్రుల సొమ్ము తో చదువుకుని, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. ప్రతీ నేలా మీరందుకునే జీతం ప్రజల సొమ్ములో భాగమే. ఇలాంటి మీరే, టికెట్ లేకుండా సినిమా చూడటమే కాకుండా, ఇలా ధియేటర్ లో ధూమపానం చెయ్యడం ఎంతవరకు సరి? ఇక నుండి మీకు సినిమా చూడాలనిపించినప్పుడల్లా నాకు చెప్పండి. నేనే వచ్చి, టికెట్ కొని మీకు సినిమా చూపిస్తాను', అని అన్నారు.
రెడ్డిగారి ఈ మాటలు, ఆ సబ్ కలెక్టర్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ఆయన రెడ్డి గారి తో 'సర్, ఇన్నేళ్ళ నా జీవితం లో నేను నీర్చుకున్నదంతా ఒక ఎత్తయితే, ఈ రోజు మీ వాళ్ళ నేను నేర్చుకున్నది ఎంతో. మీరే నా గురువు అని', ఆ తరువాతి నుండి తన పదవిని ఎప్పుడూ దుర్వినియోగం చెయ్యలేదట. అంతటి క్రమశిక్షణ గల వ్యక్తీ యమ్. యస్. రెడ్డి.
ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సినిమాలు, కవితలు, వ్యక్తిత్వం ఎప్పటికీ మరచిపూలేనివి.
-సునయన వినయ్ కుమార్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more