ఎక్కువమందికి ఉన్న ఒక అలవాటు, ఆరోపణలను ఎదుర్కుంటున్నవారి మీద మరో రెండు వెయ్యటం, లేదా వారికి జరిగే పరాభవాన్ని ఊహించుకుని బాగా జరిగింది అని అనుకోవటం. సామాన్య జీవితాన్ని గడుపుతూ కుటుంబాన్ని పోషించుకోవటంలోనే తలమునకలయ్యే సాధారణ జనజీవన స్రవంతిలో ఎక్కడో దొరికిన బంగారం, బయటపడ్డ నిధులు, ఇలాంటివి ఆసక్తి కలిగిస్తాయి. అది హైద్రాబాద్ మారేడుపల్లిలో జయలలిత ఇంటి బాత్ రూంలో దాచిన డబ్బూ బంగారమే కావొచ్చు, లేదా తిరువనంతపురం నేల మాడిగలో లభించిన నిధే కావొచ్చు, పుట్టపర్తిలో బయటపడుతున్న సంపదలే కావొచ్చు, ఈ వార్తలు సామాన్య మానవుడికి ఎంతో ఆసక్తి కలిగిస్తాయి.
డబ్బు సంపాదించటం తప్పు కాదు కానీ అక్రమార్జితం తప్పు. అక్రమార్జితమంటే ఏమిటి అని అంటే చట్టం ప్రకారం అపరాధం చెయ్యటం, లేదా చట్టాన్ని వక్రీకరించి పబ్బం గడుపుకోవటం, అమాయకులను మోసగించి ధనం కూడాబెట్టటం ఇలాంటివి. మనవాడు అయితే మాట్లాడం, చూసీ చూడనట్టు ఊరుకుంటాం అదే పరాయి వాడయితే అక్రమం, అవినీతి అంటూ ఎలుగెత్తి చాటుతాం.
వైయస్ జగన్ మీద అవినీతి అక్రమార్జనల గురించి మాట్లడం కూడా చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా జరిగింది. భార్య అందంగా ఉండాలి, అందరూ మెచ్చుకునే విధంగా ఉండాలి, కానీ ఎవరూ ఆమె వైపు తేరిపార చూడగూడదు అని అనుకునే భర్త స్వభావం మొదట్లో ఈ విధానంలో కనపడుతుంది. వైయస్ రాజశేఖరరెడ్డి గొప్ప నాయకుడు అనే పేరూ కావాలి, రాష్ట్రానికి మంచి చేసాడు అనీ మెచ్చుకోవాలి, కానీ జగన్ అతని వారసుడు అని అనగూడదు, వైయస్ ఆర్ అవినీతితో కూడగట్టిన డబ్బు జగన్ కి సంక్రమించింది అనీ మాట్లాడగూడదు, కానీ జగన్ అవినీతితో డబ్బు కూడగట్టాడని చెప్పాలి. నిజంగా ఇదో పెద్ద పరీక్షే. అలా మాట్లాడటం చాలా కష్టం. కానీ రాజకీయాల్లో అన్నిటికీ మార్గాంతరాలుంటాయి.
జగన్ అక్రమాలకుపాల్పడుతుంటే వైయస్ ఆర్ కి తెలియలేదా. తెలిసీ ఊరుకుంటే అది తప్పు కదూ. ఒక వేళ వైయస్ ఆర్ అక్రమాలకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ ఆ విషయం అర్థం కాలేదా లేక ముడుపులు అందాయా. గాలి జనార్దన రెడ్డి ద్వారా కానీ మరితర వ్యవహారాల్లో అక్రమార్జనకు పూనుకున్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగమంతా ఏం చేస్తోంది. అధికారులంతా పెదవి విప్పకుండా ఊరుకుంటే వారిదీ తప్పే. ప్రభుత్వ శాఖలకూ, స్థానిక రక్షక భట సిబ్బందికీ, నిఘా సంస్థలకూ, సాటి మంత్రులకూ, స్థానిక నేతలకూ, ప్రతిపక్షాలకూ ఎవరికీ తెలియకుండా అవినీతి జరగటమేమిటి, ఉన్నట్టుండి అంతా ఒకేసారి బయటపడి జగన్ మీద పిడుగులా పడటం ఏమిటి
ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వలేరెవరూ. అందుకే ఈ ప్రశ్నలు బయటకు రాకుండా, జగన్ విషయంలో కానీ గాలి జనార్దన రెడ్డి విషయంలోకానీ పుట్టపర్తిలోని ఖాతాల్లోకి రాని సంపదలు గురించి ఎవరూ ఏమీ అడగకుండా వారికి ఆసక్తి కరమైన విషయాలతో మరిపించాలంటే ఒకటే మార్గం. వారి వైభవాలను ఏకరువు పెట్టటం. అంత పెద్ద ఇల్లుంది, అంత బంగారం దొరికింది, అన్నన్ని వైభవాల్లో తులతూగారు అని చెప్పేటప్పటికి రెక్కాడినా డొక్కాడని స్థితిలో ఉన్న వారే కాకుండా, ఆశయాలు తీరక పోయినా ఎదుగుతున్నామన్న ఆశతో జీవించే మధ్యతరగతి కుటుంబీకులు కూడా అబ్బా అని నోరు వెళ్ళబెట్టే స్తారు. అలాంటి వారిలో చనిపోయిన వారి గురించి అనుకోవటానికి ఏమీ ఉండదు కానీ, ఇప్పటికే జైల్లో పడి ఉన్నవారి మీద వారు తినే తిండి, ఉంటున్నస్థితిని వివరించటం వలన, మంచి పనైంది లేకపోతే బంగారు పళ్ళేల్లో తింటారా, బంగారు సింహాసనమా అని కాసేపు ఆడిపోసుకుంటారు కానీ అటువంటి అవినీతిని అరికట్టటంలో విఫలమైన యంత్రాంగాన్నేమీ అనరు. ఇక దర్యాప్తునెదుర్కుంటున్నవారి పక్కన కూర్చోవటానికే సంశయిస్తారు. వారితో పరిచయం ఉందని అనటానికే భయపడతారు.
డబ్బు ఉన్నప్పుడు వాటిని వినియోగించుకోవటంలో ఎవరి అభిరుచులు వారికుంటాయి. వాళ్ళు ఎక్కడ దాచుకున్నారు, లేకపోతే ఎందులో పెట్టుబడులు పెట్టారు, లేదా ఎటువంటి వస్తువులు, ఆస్తులు పోగుచేసుకున్నారన్న వివరాలు ప్రయోజనం లేనివి. అసలు అంతంత డబ్బుని ఆరోపించినట్టుగా అక్రమంగానే వెనకేసుకుంటుంటే ఊరకుండటమేమిటి, రాజకీయాల్లో ఎదురుతిరిగినప్పుడు బయటపెట్టటమేమిటి అన్నది ఆలోచించని ప్రజానీకం, కేవలం వార్తలలో వచ్చిన ఆస్తుల వివరాలు, అనుభవించిన వైభోగల గురించి మాత్రమే తెలుసుకుని మొటికలు విరిచి ఊరుకుంటారు. అదే జరుగుతోంది వైయస్ జగన్, గాలి జనార్దన రెడ్డి కేసుల్లో.
కాస్త మంచి డ్రస్ వేసుకుని మంచి హోదాలో ఉన్నవాడు బస్సుకోసం ఎదురు చూస్తున్నాడు. బస్సు వచ్చింది. కానీ అక్కడ ఆగకుండా కొద్దిగా ముందుకెళ్ళి ఆగింది. బస్సు అందుకోవటం కోసం అతను పరిగెత్తుకుంటూ రావలసి వచ్చింది. ఇదంతా అద్దంలో గమనిస్తున్న బస్సు డ్రైవరుకి మనసులో ఆనందం. అటువంటి వాడిని పరిగెత్తించాను కదా అని సంతోషం. ఇదే మనస్తత్వం చాలా మందిలో కనిపిస్తుంది జైల్లో పడ్డ పెద్దవాళ్ళ గురించిన వార్తలు వింటే. ఈ మానసిక మైన తృప్తే అక్రమాల మీద ఆరాలు తియ్యకుండా చేస్తుంది, అసలు నిజల్లోకి పోకుండా చేస్తుంది. అంతకు ముందు జగన్ మాటలు విన్నవాళ్ళు కూడా ఈ వివాదాలు వచ్చిన తర్వాత, వైభోగాల గురించి విన్న తర్వాత వైయస్ఆర్ మృతి వలన జగన్ మీద కలిగిన సానుభూతి కాస్తా పోతుందని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే తాత్కాలికంగా విషయం మరుగునపడ్డా, అసలు మూలాలోకి వెళ్ళి ఆలోచించి అర్థం చేసుకోగలిగే చిత్తం అంతరంగంలో ఎప్పుడో ఒకప్పుడు మేలుకుంటుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more