Messalina ring marshall in london

messalina ring marshall in london, Tungsten Rings

messalina ring marshall in london

messalina.gif

Posted: 12/07/2011 01:15 PM IST
Messalina ring marshall in london

     హిందూ మతంలో తాళిబొట్టుకి చాలా విలువుంది. ఒకసారి కట్టినట్టయితే దాన్ని తీసివెయ్యటానికి మన సాంప్రదాయం ఒప్పుకోదు. ఈ సెంటిమెంటు చాలా సినిమాల్లో ఎన్నో సన్నివేశాలలో కూడా మనం చూడవచ్చు. విలన్ తాళి కట్టబోతుంటే అడ్డుకోవటం, లేదా పెళ్ళికి అడ్డు పెట్టేవారు వస్తుంటే గబగబా తాళి కట్టెయ్యటం లాంటి దృశ్యాలు ఎన్నో తెరకెక్కాయి. పురాణాల్లో కూడా పతివ్రతలను వారి మెడలోని తాళి బొట్టు కాపాడిన ఉదంతాలు కనిపిస్తాయి. అలాగే పాశ్చాత్య దేశాల్లో పెళ్ళికి ముందు తొడిగే ఉంగరానికి కూడా విలువుంది. కానీ దాన్ని సెంటుమెంటుగానో లేకపోతే వారిని కాపాడే శక్తి ఉన్నదన్నట్టుగానో వారెప్పుడూ భావించలేదు. అయితే అలా జరిగిన సంఘటన ఒకటి లండన్ లో వెలుగు చూసింది.

     పెళ్ళి చేసుకుంటానని ఉంగరం తొడిగి బాసలు చేసిన ప్రియుడు మనసు మార్చుకోవటమే కాకుండా ప్రియురాలిని ఏమార్చే ప్రయత్నం కూడా చేసాడు. ఆమె కాళ్ళూ చేతులూ టేపుతో బంధించి అట్టపెట్టెలో ప్యాక్ చేసి ఆమెను గొయి తీసి పాతి పెట్టాడు కూడా. అయితే ఆమె వేలికి అతను తొడిగిన ఉంగరమే ఆమెను కాపాడింది. దానితో టేపుని కోసి బంధవిముక్తురాలై తిన్నగా వెళ్ళి పోలీసులకు జరిగిందంతా చెప్పేటప్పటికి ఆమె ప్రియుడు అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలయ్యాడు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  625l recovered from beggar coupl
Kuldip nayar opposes telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles