హైద్రాబాద్ నగరవాసుల సౌకర్యార్థం నిర్మించదలచుకున్న మెట్రో ప్రోజెక్ట్ అడుగడుగునా అవాంతరాలను ఎదుర్కుంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని ఎలాగైనా పూర్త చెయ్యాలనే సంకల్పం చేసుకున్నట్టుగా కనపడుతోంది. మెట్రో నిర్మాణానికి కావలసిన భూమిని సేకరించటానికి ఒకపక్క నోటీసులు ఇస్తూ, మరో పక్క స్పష్టంగా ఉన్న చోట్లలో పనులు చేపడుతూ, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరుపుతూ, మియాపూర్ నుంచి అమీర్ పేట, నాగోల్ నుంచి మెట్టుగూడా వరకు జరగవలసిన మెట్రో ప్రోజెక్ట్ మొదటి విడత లో భాగంగా జనవరి నెలలో మొదటి మెట్రో స్తంభాన్ని నిలబెట్టాలని కాంట్రాక్టర్లు తొందరపడుతున్నారు. ఈ దిశలో హైద్రాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, (హెచ్ ఎమ్మార్), ఎల్ అండ్ టి ఇంజినీర్లు కష్టపడి పనిచేస్తున్నారు.
ఢిల్లీలో మెట్రో విజయవంతమైంది. అదే దారిలో మొదలుపెట్టిన బెంగళూరు సిటీ కూడా సౌకర్యంతో పాటు అందాన్నీపెంచుకుంది. అలాగే మొదలుపెట్టిన ఆంధ్రప్రదేశ్ విషయంలోనే న్యాయపరమైన అడ్డంకులు వస్తూవచ్చాయి.
అంతా క్లియర్ అయిన తర్వాతనే పని మొదలు పెట్టాలంటే ఆలస్యం జరిగే అవకాశం ఉన్నందువలన, ఎక్కడైతే నిర్మాణం చేపట్టటానికి సమస్యలు ఎదురవటంలేదో ఆ ప్రాంతాల్లో చేసుకుంటూ పోతే సులభమవుతుందని అధికారులు భావిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఏది ఏమైనా 2014 కల్లా రాష్ట్రంలో ప్రగతిని చూపించుకోవలసిన అవసరం ప్రస్తుత ప్రభుత్వానికెంతైనా ఉంది. రాజకీయరంగంలో ఎదురైన సమస్యలతోనే ఇంతకాలం కొట్టుమిట్టాడుతూ వస్తున్న ప్రభుత్వానికి, కాస్త అలజడులు తగ్గి, ప్రభుత్వానికి పక్కలోబల్లెంలా ఉన్న వారందరూ ఆత్మరక్షణలో పడిన సందర్భంగా, ఎన్నికలలో చెప్పుకోవటానికి ప్రగతి కనిపించాలి, నిజంగా కూడా ఏదో ఒక దిశగా అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టాలి కాబట్టి, వివిధ పథకాలు అమలులోకి వచ్చినట్టే మెట్రో రైలు కూడా వేగం పుంజుకుంటోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more