Killer ajmal kasab

Ajmal Kasab, killer Ajmal Kasab , Supreme Court, Kasab was from Pakistan,

Earlier this year, Kasab filed an appeal in the Supreme Court challenging ... CST is owned by the railway ministry — an instrument of the Union government

killer Ajmal Kasab.gif

Posted: 11/29/2011 01:48 PM IST
Killer ajmal kasab

killer Ajmal Kasab

అతను రక్తపిశాచి. ఏకె47 కనిపిస్తేచాలు ఎదురుగాఉన్నవారెవరైనా కాల్చిపారేస్తాడు. అతనో ఉగ్రవాది. పాకిస్తాన్ నుంచి మనదేశానికి అత్యంత రహస్యంగా వచ్చిన పదిమంది ఉగ్రవాదుల్లో ఒకడు. ముంబయి మారణహోమానికి నిలువెత్తు సాక్షి. 166 మంది నిండుప్రాణాలు తీసిన పదిమంది ముష్కరుల ముఠాలో ఒకడు.  

ముంబయి టెర్రర్ ఎటాక్ లో  సజీవంగా పట్టుబడ్డ ఏకైక ఉగ్రవాది 2008 నుంచి ముంబయి ఆర్థర్ రోడ్ జైల్లోని ప్రత్యేక గదిలో ఖైదీగా ఉంటూనే రాచమర్యాదలు అందుకంటున్న అతిధి అతను. టెర్రరిస్టుల కేసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన కోర్టు అతగాడ్ని నిలువునా చంపేయాల్సిందేనంటూ తీర్పు చెప్పినా, మరణశిక్ష విధించినా తానింకా అమయాకుడ్నేనంటూ నమ్మించాలని చూస్తున్నాడు. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకుని కాలక్షేపం చేస్తున్నాడు. మరి సుప్రీంకోర్టు ఎప్పుడు విచారణ మొదలుపెడు తుంది? అసలెప్పుడు అంతిమతీర్పు చెప్పబోతుంది? నరరూప రాక్షసుడ్ని ఇంకా ఎంతకాలం భరించాలి?

 పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ మనదేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేసుకున్న అప్పీల్ పై జనవరిలో విచారణ ప్రారంభంకాబోతోంది. ప్రత్యేక కోర్టు ఇప్పటికే మరణదండన విధించిన కసబ్ కేసు ఏ మలుపు తిరగబోతోందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.  ఉగ్రవాద దాడులు జరిగి మూడేళ్లు అయినప్పటికీ, సజీవంగా పట్టుబడిన పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ కి ఎప్పుడు మరణదండన అమలుపరుస్తారని యావత్ దేశం ఎదురుచూస్తుండగా, మరోపక్క కసబ్ మాత్రం సుంప్రీకోర్టు వెలవరించబోయే తీర్పుకోసం ఆశగా ఎదురుచూస్తుండటం విడ్డూరమే అయినా ఇది నిజం.  

.2008నాటి ఉగ్రవాద దాడుల్లో విచక్షణారహితంగా 166 మంది ప్రాణాలు తీసిన పది మంది ఉగ్రవాదుల్లో కసబ్ కూడా ఒకడు. అలాంటి రక్తపిశాచికి, సాక్షాత్తు భారత్ దేశంపైనే యుద్ధం ప్రకటించిన ముష్కరమూకలకు మరణదండనే సరైనదన్న అభిప్రాయం సర్వత్రా పాతుకుపోయింది. ఇది నిజమే కావచ్చు. కానీ, మనదేశ చట్టాల ప్రకారం కసబ్ కేసు సాగుతోంది.

ఐదు నేరాలపై ప్రత్యేక కోర్టు కసబ్ కు మరణదండన విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే, కసబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో శిక్ష ఇప్పటికీ అమలుకాలేదు. మరి, సుప్రీంకోర్టు కసబ్ కేసుపై విచారణ ఎప్పుడు చేపడతుంది ? సుప్రీంకోర్టు కేసుల క్యాలెండర్ ప్రకారం అంతా అనుకున్నట్టు జరిగితే, దేశ సర్వోన్నత న్యాయస్థానం కసబ్ అప్పీల్ పై వచ్చే ఏడాది ఏప్రిల్ లో తీర్పువెలువడొచ్చు. ఈ అంతిమ తీర్పు కోసమే దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.

 తాను టీనేజర్ననీ తను విదేశీయుడ్ననీ, ఇక్కడి చట్టాలు తనకు తెలియవనీ ఒక ఉగ్రవాద సంస్థ ప్రేరేపించడంతో ఉన్మాదచర్యలకు పాల్పడ్డాననీ కసబ్ ఒక లేఖలో సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తికి తెలియజేశాడు. తెలియకచేసిన నేరంగా భావిస్తూ తనకు విధించిన మరణదండనను తప్పించాలంటూ కసబ్ విజ్ఞప్తి చేసుకున్నాడు.

దీంతో సుప్రీంకోర్టు ఈ కేసులో డిఫెన్స్ లాయర్ గా వ్యవహరించాల్సిందిగా రామచంద్రన్ ను కోరింది.  ఇప్పటికే కసబ్ పైన ప్రభుత్వం 16కోట్లు ఖర్చుపెట్టింది. ముంబయి ఆర్థర్ రోడ్ జైల్లో కసబ్ భారత అతిధిగా ఉంటున్నాడన్న విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఎంతత్వరగా ఈకేసు పరిష్కారమైతే అంత మంచిదని అంతా భావిస్తున్నారు. మరి తాజా పరిస్థితుల్లో డిఫెన్స్ లాయర్ ఎలా వాదించబోతున్నారు? సుప్రీంకోర్టు ఏరకమైన అంతిమ తీర్పు ఇవ్వబోతున్నదన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Parliament winter sessions without transacting
Memorable arrangements for the engagement  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles