పార్టీ ఎన్నికల గుర్తుకి అర్థమైముంటుంది, అది ఒక గుర్తు అంతే. ఒక త్రిభుజాన్ని గీసి వాటి కోణాలకు ఎబిసి అని పెర్లు పెట్టినా, ఎక్స్ వై జడ్ అని పెట్టినా కోణాల్లోనూ ఆ త్రిభుజిలోనూ తేడా రాదు. ప్రచారాల్లోనూ ఎదుటి పార్టీని విమర్శించటంలోనూ ఎన్నికల గుర్తుని ఉపయోగించటమనేది చాలా తక్కువ స్థాయి రాజనీతి. హస్తగతం చేసుకుందని, సైకిలెక్కారని, సైకిల్ దిగి కారెక్కారని, ఇలా మీడియా వార్తలు పాఠకులను ఆకర్షించేలా వచ్చాయంటే వాటిని అర్థం చేసుకోవచ్చు. కానీ నాయకులు కూడా ఎదుటి పార్టీ వ్యవహారాలను విమర్శించటానికో లేక తమ పార్టీ గురించి గొప్పగా చెప్పుకోవటానికో ఎన్నికల గుర్తులను సమ ప్రసంగాల్లోకి తీసుకుని రావటమనేది సరైనది కాదు. ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తూ పార్టీ బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్న రాహల్ గాంధీ అమేతీలో, ప్రజల సొమ్ముని ఏనుగే మేసేస్తోందని, ఏనుగులకు విగ్రహాలకు స్థానముందేమో కాని, ఉత్తరప్రదేశ్ లో అభివృద్ధికి మాత్రం చోటు లేదంటూ చేసిన వ్యాఖ్యానాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి తిప్పికొట్టారు.
బిఎస్పి పార్టీ చిహ్నమైన ఏనుగు అంటే రాహుల్ కి భయమని అందుకే కలలో కూడా అతన్ని వెంటాడుతూనే ఉంటుందని మాయావతి అన్నారు. లక్నోలో జరిగిన దళిత సభలో మాయావతి మాట్లాడుతూ పార్లమెంటు జరుగుతుండగా యువరాజు ఇక్కడేం చేస్తున్నాడని రాహుల్ గాంధీని ఉద్దేశించి అంటూ, సమావేశాలను ఎగ్గొట్టి వచ్చినా యుపిలో మరోసారి బిఎసిపి యే అధికారంలో ఉంటుందన్నది ఖాయమని తెలుసుకుంటే మంచిదని ఆమె అన్నారు. బిఎస్ పి ఏనుగంటే భయం కాబట్టే మాటిమాటికీ దాని ఊసెత్తుతున్నారని మాయావతి అన్నారు.
శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more