పంచవర్ష ప్రణాళికల ద్వారా ప్రగతిని సాధించాలని స్వతంత్ర భారతంలో నాయకులు ఆశించారు. జాతీయాభివృద్ధిలో కావలసిన కార్యాచరణను తక్కువకాలంలో అమలు చెయ్యటం కష్టం కాబట్టి ఐదు సంవత్సరాల కాలాన్ని నిర్ణయించారు. ఈ ప్రణాళికలను ప్లానింగ్ కమిషన్ నియంత్రిస్తుంది. ఎన్నుకున్న నాయకులు పాలించే కాల పరిమితి కూడా ఐదు సంవత్సరాలే. దేశం లేక రాష్ట్రాభివృద్ధికో ప్రణాళికను సిద్ధం చేసుకుని, దానికనుగుణంగా ప్రభుత్వ ఖజనాలోంచి దానికవసరమైన మొత్తాన్ని కేటాయిస్తూ, నిర్వహించి ఫలితాలను పొందటం కోసం తయారు చేసిందే పంచవర్ష ప్రణాళిక.
మొట్టమొదటి పంచ వర్ష ప్రణాళిక భారత్ ప్రధమ ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ 1951లో డిసెంబర్ 8న పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. దేశ విభజనలో పూర్తిగా అడుగంటిపోయిన వ్యవసాయాభివృద్ధికే ఇందులో ప్రాధాన్యతనిస్తూ, 1951 నుంచి 1956 వరకు అమలులో ఉండే ఈ మొదటి పంచవర్ష ప్రణాళికలో 206.8 బిలియన్ల రూపాయలను కేటాయించారు. ఇందులో 27 శాతం సాగునీటికి, శక్తి ఉత్పాదనలకు, 17 న్నర శాతం వ్యవసాయం, సామాజికాభివృద్ధికి, 24 శాతం రవాణా సమాచార వ్యవస్థకి, 8 న్నర శాతం పరిశ్రమలకు, 16న్నర శాతం సంఘసేవలకు, 4 శాతం పునరావాసయోజనలకు, ఇతరత్రా కార్యక్రమాలకు 2 న్నర శాతం కేటాయించటం జరిగింది.
దీనివలన సాధించవలసిన లక్ష్యం, జాతీయోత్పాదనలో 2.1 శాతం. దీనికి ప్రతిగా 3.6 శాతం అభివృద్ధి జరిగింది. వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాయి. తలసరి ఆదాయం పెరిగింది. అయితే తలసరి ఆదాయం కంటే జాతీయాదాయం మించిపోవటానికి పెరిగిన జనాభాయే కారణం. ఈ ప్రణాళికలోనే భాక్రా, హిరాకుడ్ డ్యాంల నిర్మాణం చేపట్టటం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వంతో కలిసి శిశుసంరక్షణా కార్యక్రమాలను చేపట్టి శిశు మరణాలను అరికట్టటంతో అది పరోక్షంగా జనాభా పెరుగుదలకు ఇంకా దోహదం చేసింది. ప్రణాళికా కాలాంతంలో, ఉన్నత విద్యను పెంపొందించే దిశగా ఐదు చోట్ల ఐఐటిలు, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ని స్థాపించటం జరిగింది. ఐదు ఉక్కు కర్మాగారాలకు ఒప్పందాలు జరిగాయి. అయితే అవి రెండవ పంచవర్ష ప్రణాళికాలం మధ్యలో రూపుదిద్దుకున్నాయి.
రెండవ పంచవర్ష ప్రణాళిక(1956 నుంచి 1961) లో భారీ పరిశ్రమలకు పెద్దపీట వెయ్యటం జరిగింది. ఈ ప్రణాళికా కాలంలోనే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఉత్పత్తి, ఐదు ఉక్కు కర్మాగారాలు భిలాయ్, దుర్గాపూర్, రౌర్కెలాల్లో స్థాపించబడ్డాయి. బొగ్గు ఉత్పత్తి, రైల్వే లైన్ల పొడిగింపు జరిగింది. 4800 కోట్ల రూపాయలు కేటాయించిన ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం 4.5 శాతం వృద్ధి కాగా, 4 శాతం వృద్ధిని సాధించటం జరిగింది.
మూడవ పంచ వర్ష ప్రణాళిక (1961 నుంచి 1966)లో నిజనికి వ్యవసాయాభివృద్ధిలో గోధుమ ఉత్పత్తిని పెంచే దిశగా లక్ష్యం ఏర్పరచుకున్నా, 1962లో జరిగిన చైనా యుద్ధంలో భారతదేశానికున్న బలహీనత అర్థమై, దేశరక్షణకు నిధులను కేటాయించటం జరిగింది. 1965 66లో పాకిస్తాన్ తో యుద్దం జరిగింది. దాని ఫలితంగా ధరలు పెరిగిపోవటంతో దృష్టంతా ధరల నియంత్రణ మీద పెట్టవలసి వచ్చింది. ఆనకట్టల నిర్మాణాలు మాత్రం కొనసాగాయి. పంజాబ్లో గోధుమ ఉత్పత్తి బాగా పెరిగింది. మారు మూల గ్రామాల్లో కూడా విద్యాభివృద్ధి జరగటం కోసం ప్రాథమిక పాఠశాలల నిర్మాణం జరిగింది. ప్రజాస్వామ్య యంత్రాంగం పల్లెల నుంచే వ్యాపించటం కోసం పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
రాష్ట్రాల బాధ్యతను పెంచుతూ, సెకండరీ, ఉన్నత విద్యలను అభివృద్ధి పరచటం అప్పగించటం జరిగింది. అలాగే రోడ్డు రవాణా బాధ్యతలను కూడా ఇస్తూ, రాష్ట్రంలోని రహదారుల నిర్మాణ బాధ్యత కూడా అప్పగించటం జరిగింది.
జాతీయోత్పాదన లక్ష్యం 5.6 శాతం కాగా, లక్ష్య సాధన 2.4 శాతానికి పరిమితమైంది.
ప్రధానమంత్రి జవాహార్ లాల్ నెహ్రూ, ఆ తర్వాత లాల్ బహాదూర్ శాస్త్రి మరణంతో రాజకీయ అనిశ్చితిలో పంచవర్ష ప్రణాళికలో కొంతకాలం విరామం ఏర్పడింది.
నాల్గవ పంచవర్ష ప్రణాళిక (1969 నుంచి 1974). ఈ కాలంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తూ, 14 ప్రముఖ బ్యాంకుల జాతీయకరణ చేసారు. వ్యవసాయ విప్లవంతో ధాన్యం ఉత్పత్తి పెరిగింది. 1971లో తూర్పు పాకిస్తాన్లో సంక్షోభం తొలగించటానికి పాకిస్తాన్తో యుద్ధం జరిగి బంగ్లాదేశ్ అవతరణ జరిగింది. దానివలన పరిశ్రమలకు కేటాయించిన నిధులు యుద్ధంలో ఖర్చుకి మళ్ళించటం జరిగింది. 1974లో భూతలం కింద న్యూక్లియర్ పరీక్షలు విజయవంతంగా జరిగాయి. అమెరికా యుద్ధ నౌకలు బంగాళా ఖాతంలోకి రావటం, పశ్చిమ పాకిస్తాన్ తో యుద్ధాన్ని కొనసాగించటం మీద హెచ్చరికలు చేసాయి.
ఈ కాలంలో జాతీయోత్పత్తి 5.7 శాతం లక్ష్యంగా పెట్టుకోగా, 3.3 శాతం వృద్ధిని సాధించటం జరిగింది.
ఐదవ పంచవర్ష ప్రణాళిక (1974 నుంచి 1979). నిరుద్యోగ సమస్య, పేదరిక నిర్మూలనం మీద దృష్టి పెట్టటం జరిగింది. వ్యవసాయం, దేశరక్షణలో స్వయం సమృద్ధి లక్ష్యంగా ప్రణాళిక సాగింది. 1975లో ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ చట్టం అమలులోకి వచ్చి, విద్యుదుత్పత్తి, సరఫరాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 1978లో ప్రధానమంత్రిగా ఎన్నికైన మోరార్జీ దేశాయ్ ఈ కాలంలో చేసిన ప్రణాళికలను నిరాకరించారు.
జాతీయ రహదారులను వెడల్పు చెయ్యటం, పర్యటనలను అభివృద్థి పరచటం జరిగింది. 4.4 శాతం వృద్థి రేటుని లక్ష్యంగా పెట్టుకోగా, 5 శాతం సాధించటం జరిగింది.
ఆరవ పంచవర్ష ప్రణాళిక (1980 నుంచి 1985). పెట్టుబడి రంగంలో ఆర్థిక స్వాతంత్ర్యం, నియంత్రణలు ఎత్తివేయటం జరిగింది. రేషన్ దుకాణాలను మూసివేసారు. దానితో అన్ని వస్తువుల ధరలూ పెరిగిపోయి జీవనం భారమవుతూ వచ్చింది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టారు. కుటుంబ నియంత్రణ అమలులోకి వచ్చింది.
లక్ష్యసాధన 5.2 శాతమైతే 5.4 శాతం సాధించటం జరిగింది.
ఏడవ పంచవర్ష ప్రణాళిక (1985 నుంచి 1990). పరిశ్రమల్లో ఉత్పాదన పెరగటం, సాంకేతిక నైపుణ్యం పెరగటం మీద ప్రభుత్వం దృష్టి సారించింది. దానితోపాటు వ్యవసాయాభివృద్ధి, ఉద్యోగావకాశాల్లో పెరుగుదల లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక మాంద్యం తగ్గి, వ్యవసాయోత్పత్తులు పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటపడింది. దానితో కొత్త ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంది. అందులో ముఖ్యంగా, సామాజిక న్యాయం, దళిత సంరక్షణలాంటి సమాజాభివృద్ధి, ఆదునిక సాంకేతిక నైపుణ్యాల ఉపయోగం, వ్యవసాయాభివృద్ధి, పేదరిక నిర్మూలన, చిన్నకారు పెద్ద రైతులకు సహాయం, దేశంలో ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్నాయి.
5 శాతం వృద్ధి రేటుని లక్ష్యంగా పెట్టుకోగా, 5.7 శాతం సాధించటం జరిగింది
బారత దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న కారణంగా 1990 నుంచి 1992 వరకు ఎటువంటి ప్రణాళికా లేదు.
ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక (1992 నుంచి 1997). ఈ కాలంలో పివి నరసింహారావు భారతదేశపు పన్నెండవ ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పడు అర్థిక మంత్రిగా ప్రస్తుతపు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పనిచేసారు. ఆ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు జరిగాయి. భారత్ ని ఆంక్షలు లేని ఫ్రీ మార్కెట్ గా మలిచి, కొన్ని రంగాలను ప్రైవటీకరించారు. పరిశ్రమల ఆధునీకరణ మీద దృష్టి పెట్టటం జరిగింది. 1995 లో భారత్ ప్రపంచ వ్యాపార సంస్థలో సభ్యత్వాన్ని పొందింది.
ఈ రావు మన్మోహన్ కాలంలో, జనాభా వృద్ధిని అరికట్టటం, పేదరికాన్ని తగ్గించటం, ఉద్యోగావకాశాలను పెంచటం, పెద్ద పెద్ద నిర్మాణాలు, పర్యాటకాభివృద్ధి, మానవ ప్రతిభలో అభివృద్ది, పంచాయతీరాజ్ ల, నగరపాలికల కార్యకలాపాలలో వృద్ధి చోటుచేసుకున్నాయి. విద్యుదుత్పదనకు పెద్దపీట వెయ్యటం జరిగింది.
లక్ష్యం 5.6 శాతం అభివృద్ధి అయితే, 6.78 శాతం సాధించటం జరిగింది.
తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక (1997 నుంచి 2002). ఈ పంచవర్ష ప్రణాళికలో లక్ష్యం, పరిశ్రమల అభివృద్ధి, మానవ ప్రతిభలో అభివృద్ధి, అందరికీ ఉద్యోగావకాశం, పేదరిక నిర్మూలన, దేశంలో స్వయం సమృద్ధి. వీటితో పాటు ధరల నియంత్రణ, ఆహార పోషక విలువల రక్షణ, అందరికీ త్రాగు నీరు, ప్రాథమిక చికిత్స, రవాణా, విద్యుత్తుని అఁదుబాటులోకి తేవటం, జనాభా పెరుగుదలను అరికట్టటం, స్త్రీ జనోద్ధరణ, అణిగిపోయిన వర్గాల అభ్యుదయం లాంటి సామాజిక అంశాలు, ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించటానికి అనుకూలమైన ఆర్థిక సూత్రాలు ఇత్యాదులు చోటు చేసుకున్నాయి.
అభివృద్ధి రేటు 5.35 శాతం లక్ష్యమైతే 6.5 శాతం సాధించటం జరిగింది.
పదవ పంచవర్ష ప్రణాళిక (2002 నుంచి 2007). ఈ ప్రణాళికా లక్ష్యాలు, జాతీయోత్పత్తి లో 8 శాతం పెరుగుదల, పేదరికంలో 5 శాతం తగ్గుదల, దేశంలోని బాలలందిరికీ 2003 కల్లా విద్యాభ్యాసానికి పూనుకోవటం, 2007 కల్లా బాలలందరి ప్రాథమిక విద్య పూర్తవటం, విద్యలో పురుషలు స్త్రీలకున్న తేడా 2007 కల్లా సగానికి తగ్గటం, విద్యాభివృద్ధి 75 శాతానికి పెరగటం.
పదకొండవ పంచవర్ష ప్రణాళిక (2007 నుంచి 2012) ప్రస్తుతం భారత్ చివరకు చేరుకుంటున్న ప్రణాలికా కాలమిది. ఈ ప్రణాళికలో లక్ష్యాలు, దేశఆర్థికాభివృద్ది 10 శాతానికి పెంచటం, ఏడు కోట్ల మందికి ఉద్యోగావకాశాలు, చదువుకున్న నిరుద్యోగుల శాతం 5 శాతం తగ్గించటం, ప్రాథమిక విద్యనభ్యసించే బాల విద్యార్థలు విద్యాభ్యసాన్ని మధ్యలోనే నిలిపివేయటాన్ని ప్రస్తుతమున్న 52.2. శాతం నుంచి 20 శాతానికి తగ్గించటం, శిశువుల మరణాలను అరికట్టటం, త్రాగునీరు సరఫరా, పోషకపదార్థాల విలువలను పెంచటం, స్త్రీ శిశువుల సంరక్షణ, బాల కార్మికుల నిర్మూలన, గ్రామగ్రామాల్లో ప్రతి ఇంటికీ 24 గంటల విద్యుత్తు, 1000 గడవనున్న ప్రాంతాలకు అన్ని వాతారణాల్లోనూ పనికివచ్చే రోడ్డు, రవాణా వ్యవస్థ, అన్ని గ్రామాలకూ టెలిఫోన్ వ్యవస్థ, అరణ్యాలు, వృక్షసంపద పెంపుకి కృషి, కాలుష్యరహిత వాతావరణానికి కృషి, నదుల్లోకి కలిసే నగర వాడుక నీటి పారిశుద్ధ్యం, విద్యదుత్పత్తిలో పెంపుకి కృషి.
ప్రస్తుత పంచవర్ష ప్రణాళికలోని అంశాల్లో ఎంత వరకూ సాధిస్తామన్నది 2012 కల్లా తేలిపోతుంది కానీ ఇప్పటికే అఁచనాలు వేసుకోవచ్చు. అంతకు ముందు బయటి దేశాలతో యుద్ధాల వలన ఆర్థికంగా చితికిపోతే ఈ కాలంలో రాజకీయ సంక్షోభాలు దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దెబ్బతీస్తున్నాయని అర్థమౌతూనేవుంది. ఇదీ స్వాతంత్రం వచ్చిన దగ్గర్నుంచీ ప్రగతి పథంలో భారత్ చేసిన ప్రస్తానం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more