Tdp dmk fight for room no 5 in ls

The Telugu Desam and the DMK party members are fighting for Room No. 5 in the Parliament building’s ground floor.

The Telugu Desam and the DMK party members are fighting for Room No. 5 in the Parliament building’s ground floor.

TDP, DMK fight for Room No. 5 in LS.GIF

Posted: 11/23/2011 11:09 AM IST
Tdp dmk fight for room no 5 in ls

loksabhaపార్లమెంట్ శీతాకాల సమావేశాలు వేసవి కాలం లాగా వేడి వేడిగా మొదలయ్యాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు టీడీపీ నేతలు పార్లమెంటు భవనానికి వెళ్ళారు. అయితే అక్కడ వారికి ఘోర అవమానం జరిగింది. ఆ అవమానం ఎంపీలకి జరిగితే అది వేరే మాట. కానీ ఏకంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పార్టీకే జరిగింది.
ఎంతో కాలంగా పార్లమెంటులో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకలాపాలు జరిపేందుకు నెం.5 గదిని కేటాయించారు. దీనిలో ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా కార్యకలాపాలు నిర్వహించేవాడు. అయితే లోక్ సభ సెక్రటరియేట్ అధికారులు ఎంపీ పేరుతో ఉన్న బోర్డునే కాకుండా టీడీపీ పార్టీ బోర్డును కూడా పీకేశారు.

దీంతో ఖంగుతిన్న టీడీపీ నేతలు స్పీకర్ ని కలవగా మీకు 3వ అంతస్తులోని 125 నెంబర్ గదిని కేటాయించామని, దీనిని పార్లమెంటులో 25 మంది ఎంపీలు ఉన్న డీఎంకే పార్టీకి కేటాయించామని చెప్పారు. అయితే టీడీపీ నేతలు మాత్రం 20 సంవత్సరాలుగా ఈ గది నుండే కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని స్పీకర్తో అన్నారు. అయితే స్పీకర్ మాత్రం ఈ గదిని డీఎంకేకి రెండు సంవత్సరాల క్రితమే అప్పగించామని, అప్పటి నుండి దీన్ని ఖాళీ చేయాల్సింది కోరినా మీరు చేయక పోవడం వలనే పీకేయాల్సి వచ్చందని స్సీకర్ అన్నారు. దీంతో స్పీకర్ తో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

 
 
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles