Chain link money distribution

chain-link money distribution,Collectorate and SP’s office at Nellore, gullible people,Rs 16 crores,

chain-link money distribution

chain-link money distribution.GIF

Posted: 11/19/2011 11:46 AM IST
Chain link money distribution

chainగొలుసుకట్టు వ్యవహారంలో అరెస్టయిన నిందితులను తమకు అప్పగించాలని బాధితులు నెల్లూరు మూడ నగర పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. చెల్లించిన డబ్బులు ఇప్పించాలని పట్టుబట్టారు. బాధితులు స్టేషన్‌లోపలకు జొరబడే యత్నం చేస్తుండగా వారిమధ్య తోపులాటలు జరిగాయి. టాగ్రోఫార్మ, ఆగ్రోస్ సొసైటీలకు నాగాలాండ్‌లో ప్రధాన కార్యాలయం ఉంది. హైదరాబాదుతోపాటు కోవూరు మండలం పడుగుపాడులో ఉపకార్యాలయాలు ఉన్నాయి. పడుగుపాడు శాఖ పరిధిలో 'గొలుసుకట్టు' పేరిట సుమారు రూ.16 కోట్లు ప్రజలనుంచి వసూలు చేసినట్టు సమాచారం. ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. ఈ వ్యవహారంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నెల రోజుల క్రితం బి.శ్యామ్‌సన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో విజయకుమార్ ఈయన భార్య ప్రవీణలు సొసైటీలకు డైరెక్టర్లుగా ఉన్నారని శ్యామసన్ చెప్పడంతో గురువారం రాత్రి వారిని అరెస్టు చేశారు. తరలివచ్చిన బాధితులు టాగ్రోఫార్మ, ఆగ్రోస్ సొసైటీ డైరెక్టర్లు అరెస్టు చేశారని తెలియడంతో భారీ సంఖ్యలో బాధితులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కేసులేమీ వద్దని.. డైరెక్టర్లను తమకు అప్పగించాలని పట్టుబట్టారు. గొలుసుకట్ట వ్యవహారం సీఐడీ పరిధిలో ఉన్నందున నిందితులను వారికి అప్పగిస్తామని రూరల్ డీఎస్పీ బాల వెంకటేశ్వరరావు, ఎస్ఐ పెంచలరెడ్డి బాధితులతో అన్నారు. ఒకానొక దశలో స్టేషన్‌లోకి జొరబడేందుకు బాధితులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. సీఐడీకి అప్పగింత పోలీస్ అదుపులో ఉన్న సొసైటీ డైరెక్టర్లు మీడయా కంట పడకుండా పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించారు. సీఐడీ డీఎస్సీ విజయ్‌కుమార్‌ను స్టేషన్ వద్దకు పిలిపించి చాటున నిందితులను వారికి అప్పగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad global image will be protected says madhu yashki
Gas refill racket doing swift business in guntur dist  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles