Can we purchase freedom fighters ex military persons land

Freedom fighters, Ex Army man, land, purchase, 10 years, district collector, sub registrar office, tahasildar office, verify, actual owner, no objection certificate

can we purchase Freedom fighters, ex military persons land.? or is it a gift to their service from government for them only..?

మాజీ సైనిక ఉద్యోగుల స్థలాలను కొనుగోలు చేయవచ్చా..

Posted: 12/03/2014 03:33 PM IST
Can we purchase freedom fighters ex military persons land

స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికోద్యోగులకు చెందిన భూములను కొనుగోలు చేయవచ్చా..? అన్న దర్మసందేశం ప్రతీ ఒక్కరిలోనూ కలుగుతుంది. అయితే నిజానికి వారి సేవలకు మెచ్చి ప్రభుత్వం ఇచ్చిన భూములపై వారికి అనుభవించే హక్కు మాత్రమే ఉంటుందని, దానిని విక్రయించే అధికారం వుండదని కూడా చాలా మంది అంటుంటారు. ఇందులో ఏది నిజం..? నిజంగా వారికిచ్చిన భూములు కొనచ్చా..? లేదా..? అన్న ప్రశ్నలు తలెత్తుతుంది. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికోద్యోగులకు చెందిన భూములను నిరభ్యంతరంగా కొనుగోలు చేసుకోవచ్చు. అయితే అంతకు ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది.

మొదటగా వారికి ప్రభుత్వం భూములు ఇచ్చి సుమారు 10 సంవత్సరాలు దాటి వుండాలి. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వం పదేళ్ల కిందట మంజూరు చేసిన భూములను ఎవరైనా కోనుగోలు చేసుకోవచ్చు. వారు భూములు తీసుకుని పదేళ్లు కాని పక్షంలో వాటిని కొనుగోలు చేయరాదు. ఒక వేళ కొనుగోలు చేసినా.. సదరు భూమికి మీరు యజమాని కారు. తప్పనిసరిగా పదేళ్ల తరువాత మాత్రమే వాటిని విక్రయించే అవకాశం వారికి, కొనుగోలు చేసే అధికారం మీకు వుంటుంది.

ఇక్కడ మరో విషయాన్ని కూడా క్షుణంగా పరిశీలించాలి. భూములను విక్రయించే స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికోద్యోగులు జిల్లా కలెక్టర్ దృష్టికి తమ భూములను అమ్మదలచుకున్నట్లు తీసుకెళ్లాలి. భూమిని అమ్ముకోవడానికి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం కావాలంటూ దరఖాస్తు చేసుకోవాలి. దానిని కలెక్టర్ క్షుణ్నంగా పరిశీలించాక నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) జారీ చేస్తారు. అది వచ్చాకే సంబంధిత భూమిని విక్రయించాల్సి ఉంటుంది. ఈ నిబంధన పెట్టడానికో కారణముంది. గత కొంతకాలం నుంచి స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికోద్యోగులకు సంబంధించి బోగస్ సర్టిఫికెట్లను సృష్టించి.. అక్రమ పద్ధతుల్లో భూములను విక్రయించిన సంఘటనలు అనేకం రావడంతోనే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది.

కలెక్టర్ జారీ చేసిన ఎన్వోసీ సర్టిఫికెట్‌ను రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కమిషనర్‌కు పంపిస్తారు. అక్కడ్నుంచి సంబంధిత సబ్‌రిజిస్ట్రార్ వద్దకు వెళ్లాకే.. ఆయా ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలవుతుంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లడం కంటే ముందు స్థానిక తహసీల్దారు ఆఫీసుకు వెళ్లి.. మనం కొనాలనుకున్న భూమికి సంబంధించిన అసలైన యజమాని.. మనకు భూమిని అమ్ముతున్న వ్యక్తి ఒక్కరేనా అని కనుక్కోవాలి. ఇలా చేస్తే ఏక్కడా ఏ ఇబ్బందులు వుండవు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles