Cricket fans protest at Gymkhana ground for match tickets జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత.. హెచ్సీఏ మట్టడించిన క్రికెట్ ఫ్యాన్స్..

Hyderabad chaotic scenes at gymkhana for india australia t20 tickets

gymkhana grounds, Secundrabad Gymkhana grounds, Cricket Match Tickets, Paytm, HCA Booking Counters, Hyderabad cricket Academy, India vs Australia, Cricket Fans, Match Tickets, Hyderabad, Uppal Rajiv Gandhi Stadium, cricket news, sports news, Cricket. sports

After a three-year hiatus, Hyderabad will once again host an international cricket match on September 25 when India and Australia play their third T20. Fans are still worried about getting tickets for the T-20 encounter between India and Australia on the 25th of this month at Hyderabad's Uppal Stadium.

జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత.. హెచ్సీఏ మట్టడించిన క్రికెట్ ఫ్యాన్స్..

Posted: 09/21/2022 06:40 PM IST
Hyderabad chaotic scenes at gymkhana for india australia t20 tickets

హైదరాబాదులో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్దనున్న హైదరాబాద్ క్రికెట్ అకాడమీ గేట్లకు తాళాలు వేసి వున్నా వాటిని తోసుకుని, దూకి క్రికెట్ మైదానంలోకి చోచ్చుకొచ్చి కార్యాలయాన్ని ముట్టడించారు. హెచ్సీఏ నిర్లక్ష్యం కారణంగా అభిమానులకు టికెట్లు దక్కడం లేదని.. పక్కదారి పడుతున్నాయని అరోపిస్తూ హెచ్సీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాదులో మ్యాచు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాదీయులకు అవకాశం కల్పించకుండా ఇతర యాప్ ల అనుసంధానంతో ఇతర రాష్ట్రాల వారికీ వాటిని విక్రయించమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ టిక్కెట్ల కోసం అభిమానులు నాలుగైదు రోజులుగా హెచ్సీఏ కౌంటర్ల చుట్టై తిరుగుతున్నారు. అయితే టికెట్లను విక్రయించడం లేదని.. ప్రస్తుతం పలు యాప్ లలో టికెట్లు అందుబాటులో వున్నాయని.. టికెట్లు వాటి ద్వారానే కొనుగోలు చేసుకోవాలని చెప్పడంతో నాలుగైదు రోజులుగా ఎంతో ఆశతో తిరిగుతున్న అభిమానులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో వేల సంఖ్యలో ఇవాళ హెచ్సీఏ కార్యాలయానికి వచ్చిన అభిమానులు ఆందోళన దిగారు.

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ దగ్గరకు వచ్చి గేట్లకు తాళం వేసి ఉండటంతో వాళ్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పటికే గంటల కొద్దీ నిరీక్షించిన యువకులు గేట్లు తోసుకొని, గోడలు దూకి జింఖానా క్రికెట్ మైదానంలోకి వచ్చారు. అక్కడి హెచ్సీఏ కార్యాలయాన్ని చుట్టు ముట్టారు. నాలుగైదు రోజులుగా తిరుగుతున్నా టిక్కెట్లు అమ్మడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పేటీఎం’ యాప్లో  టిక్కెట్లు అందుబాటులో లేవని, ఉన్నా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా నేరుగా కౌంటర్లలో ఎందుకు అమ్మడం లేదని హైదరాబాద్ క్రికెట్ సంఘంను ప్రశ్నిస్తున్నారు.

టిక్కెట్లను బ్లాక్ చేస్తున్నారని తరలించారని ఆరోపించారు. వీ వాంట్ టిక్కెట్స్..   హెచ్ సీఏ, సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ  మైదానంలోకి వచ్చారు. హెచ్ సీఏ కార్యాలయం పైకి కూడా ఎక్కారు. వేలాది మంది అభిమానులు గ్రౌండ్ లోపలికి చొచ్చుకు రావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. కొంత మంది అభిమానులు జింఖానా క్రికెట్ గ్రౌండ్, ఔట్ ఫీల్డ్, పిచ్ పై కూర్చున్నారు. టిక్కెట్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్సీఏ అధికారులు మాత్రం ఆన్లైన్లోనే అందుబాటులో ఉన్నాయని, రేపు కౌంటర్లలో అమ్ముతామని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఫ్యాన్స్వినడం లేదు. వందలు, వేల సంఖ్యలో యువకులు ఒక్క చోటుకు చేరడంతో  జింఖానా, పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళన కరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles