SC admits writ petition to increase Assembly seats in Telugu states అసెంబ్లీ స్థానాల పెంపుపై పిటీషన్.. విచారణకు స్వీకరించిన ‘సుప్రీం’

Supreme court admits writ petition to increase assembly seats in telangana ap

Assembly seats, Supreme Court, Andhra Pradesh Reorganisation Act, writ petition, Professor K Purushotham Reddy, Election commission, Andhra Govt, Telangana Govt, Vijayawada, Hyderabad, Marri Shashidhar Reddy, former Vice-Chairman, National Disaster Management Authority (NDMA), Politics

The Supreme Court has admitted a writ petition filed by Professor K Purushotham Reddy, seeking a direction to the Central government to implement the provision in the Andhra Pradesh Reorganisation Act (APRA) 2014 to increase the number of Assembly seats in Telangana from 119 to 153 and in Andhra Pradesh from 175 to 225.

అసెంబ్లీ స్థానాల పెంపుపై పిటీషన్.. విచారణకు స్వీకరించిన ‘సుప్రీం’

Posted: 09/19/2022 07:49 PM IST
Supreme court admits writ petition to increase assembly seats in telangana ap

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఉమ్మడి రాష్ట్రాన్ని పునర్విభజిస్తూ జారీ చేసిన చట్టం పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరగాల్సిన అసెంబ్లీ స్థానాలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెంచకపోవడంపై ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ పిటీషన్ ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరచింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు అసెంబ్లీ స్థానాలను పెంచాలని పిటిషన్‌ దాఖలైంది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జారీ చేసిన జీవో అధారంగా రెండు తెలుగురాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలను పెంచడంలో కేంద్రప్రభుత్వం ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తూ.. 2026లో దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాల పెంపు జరిగే క్రమంలోనే చేపడతామని చెబుతూవస్తోంది. కాగా, ఈ మధ్య జమ్మూ, కశ్మీర్‌లకు సంబంధించిన అసెంబ్లీ సీట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఒక డీలిమిటేషన్‌ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలోనే జమ్మూలోనూ, కశ్మీర్‌లోనూ అసెంబ్లీ సీట్లను పెంచారు. ఈ నేపథ్యంలోనే ఏపీ, తెలంగాణలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ మేరకు పర్యావరణ నిపుణుడు, ఫ్రోఫెసర్ పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోర్టును కోరారు. ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్‌ జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్‌ 29న సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన కేసు విచారణ జరిగే అవకాశం ఉంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles