Delhi liquor scam: ED digging deep into TRS links.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 35 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు

Delhi liquor scam ed conducting raids in 35 places throughout the country

Delhi Liquor Scam, liquor policy, Enforcement Directorate, raids, 35 locations, Gurugram, Haryana, Lucknow, Chandigarh, Hyderabad, Mumbai, Uttar Pradesh, CBI FIR, Arun Ramachandra Pillai, Boinpalli Abhishek Rao, Sudini Srujan Reddy, Gandra Premsagar Rao, Kokapet, Delhi Deputy CM, Manish Sisodia, TRS leaders, Aam Admi Party leaders, Delhi, Crime

The Enforcement Directorate, which has been closely probing the alleged liquor policy scam in Delhi, has started digging deeply into the suspected links of the Telangana Rashtra Samithi leaders with Aam Admi Party leaders in the national capital. As part of its ongoing probe into the scam, the ED resumed raids at multiple locations across the country.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దేశవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు

Posted: 09/06/2022 01:22 PM IST
Delhi liquor scam ed conducting raids in 35 places throughout the country

ఢిల్లీ కొత్త ఎక్సైజ్ విధానంలో అవ‌క‌త‌వ‌క‌లపై ఇదివరకే సీబిఐ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిపోడియా ఇంటిపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కేసుతో టీఆర్ఎస్ నాయకులకు సంబంధాలు ఉన్నాయన్న విషయంలో లోటుపాట్లను చూసుకునేందుకు సీబిఐ తరువాత ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా బరిలోకి దిగింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం స్కాము విషయంలో క్షుణ్ణంగా పరిశీలనలు, పర్యవేక్షణలు జరపుతున్నారు. డానికి  లింకు ఉన్న 35 ప్ర‌దేశాల్లో ఇవాళ ఈడీ త‌నిఖీలు నిర్వ‌హిస్తోంది.

ఇప్ప‌టికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను ఈడీ విచారించిన విష‌యం తెలిసిందే. నిందితుడు స‌మీర్ మ‌హేంద్రు ఇంట్లోనూ సోదాలు జ‌రుగుతున్నాయి. గురుగ్రామ్‌, ల‌క్నో, హైద‌రాబాద్‌, ముంబై, బెంగుళూరులోనూ ఈడీ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఢిల్లీ మాజీ ఎక్సైజ్ క‌మీష‌న‌ర్ అర‌వ గోపీ కృష్ణ ఇంట్లోనూ ఇటీవ‌ల ఈడీ సోదాలు చేప‌ట్టింది. కొత్త అబ్కారీ విధానం అమ‌లు జ‌ర‌గ‌కుండా లిక్క‌ర్ మాఫియా అడ్డుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక ఇటు తెలంగాణలోని కోకాపేటకు చెందిన అరుణ్ రామచంద్రన్ పిళ్లై ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి.

వీరితో పాటు టీఆర్ఎస్ పార్టీ నేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న బోయినపల్లి అభిషేక్ రావు, సుదిని సృజన్ రెడ్డి, గండ్రా ప్రేమ్ సాగర్ రావు ఇళ్లు కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసం కాకుండా హర్యానాలోని గురుగ్రామ్, ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో, పంజాబ్ రాజధాని చండీగడ్ సహా ముంబైలలోనూ కలసి ఏకకాలంలో 35 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. నిధుల దారిమళ్లింపు విషయంలో దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తోంది. అయితే ఈ కేసులో సీబీఐ ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మ‌నీ ల్యాండ‌రింగ్ కేసును బుక్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles