దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారు. క్రితం రోజు వరకు ఈ పదవిలో కొనసాగిన జస్టిస్ ఎన్వీ రమణ నుంచి 49వ సీజేఐగా యుయు లలిత్ బాధ్యతలను అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. జస్టిల్ లలిత్తో ప్రమాణం చేయించారు. ఈ ఏడాది నవంబర్ 8 వరకు ఆయన సీజేఐగా కొనసాగనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్, కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.
జస్టిస్ యూయూ లలిత్ 1957 నవంబరు 9న జన్మించారు. 1983 జూన్లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 1985 డిసెంబర్ వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. 1986 నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతున్నారు. అయన తన న్యాయవాది వృత్తిలో అధికంగా పేదలు, ప్రజావసరాలకు సంబంధించిన కేసులను వాదించి వారికి న్యాయాన్ని దక్కేలా చేశారు. 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. త్రిపుల్ తలాక్ సహా, అనేక కీలక కేసుల తీర్పుల్లోనూ జస్టిస్ లలిత్ భాగస్వామిగా ఉన్నారు.
#WATCH | President Droupadi Murmu administers the oath of Office of the Chief Justice of India to Justice Uday Umesh Lalit at Rashtrapati Bhavan pic.twitter.com/HqayMJDwBB
— ANI (@ANI) August 27, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more