What next for Jharkhand CM Hemant Soren జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై సీఈసీ అనర్హత వేటు..

Jharkhand cm hemant soren meets legislators as he faces disqualification

hemant soren, hemant soren news, hemant soren wife, hemant soren party, jharkhand, jharkhand news, cm hemant soren, Jharkhand cm hemant soren, jharkhand cm, hemant soren latest news, jharkhand cm, hemant soren, cm hemant soren, hemant soren wife, hemant soren party, jharkhand Mukti Morcha, jharkhand news, Jharkhand poltics

The Election Commission of India (ECI) recommending Jharkhand Chief Minister Hemant Soren disqualification as an MLA spread like wildfire. Political circles both in Jharkhand and Delhi were abuzz with the news of ECI's sending its recommendation to Governor Ramesh Bais. Sources in ECI have confirmed that their recommendation has reached the Governor. The ball now lies in the Governor's court.

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై సీఈసీ అనర్హత వేటు.. గవర్నర్ కు సిఫార్సు..

Posted: 08/26/2022 07:33 PM IST
Jharkhand cm hemant soren meets legislators as he faces disqualification

జార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్‌పై నమోదైన అభియోగాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అతనిపై చర్యలకు ఉపక్రమిస్తూ.. అన‌ర్హ‌త వేటు వేసింది. అయితే అనర్హత వేటు వేయడానికి గాను రాష్ట్ర గవర్నర్ రమేష్ బయాస్ కు సీఈసీ సిఫార్సు లేఖను పంపింది. అక్ర‌మ మైనింగ్ కేసులో సోరెన్‌పై వ‌చ్చిన‌ ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని నిర్ధార‌ణించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ నేపథ్యంలో ఆయ‌న శాస‌న‌స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ ర‌మేశ్ బ‌యాస్‌కు సిఫార‌సు చేసింది. ఈ పరిణామాలు ఒక్కసారిగా జార్ఖండ్ రాజకీయాల్లో వేడి రాజేశాయి.

దాంతో గ‌వ‌ర్నర్ రమేష్ బయాస్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద హేమంత్ సోరెన్‌పై అన‌ర్హ‌త వేటు వేశారు. దాంతో జార్ఖండ్‌లో రాజ‌కీయ సంక్షోభం ఏర్ప‌డింది. ప్రస్తుతం తలెత్తిన్న రాజకీయ అనిశ్చిత పరిస్థుతులను జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడైన హేమంత్ సోరెన్ తన చేయిదాటి పోనీయకుండా చర్యలను చేపట్టే పనిలో పడ్డారు. తన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయనున్న క్రమంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బీహార్ మార్కు తరహా రాజకీయానికి తెరలేపనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ పై అరోపణలతో పదవీచ్యుతుడైన క్రమంలో ఆయన భార్య రబ్రీదేవి ఆ పదవిని చేపట్టిన విషయం తెలిసిందే.

ఇలాగే హేమంత్ సోరన్ కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా తన సతీమణినిన బరిలోకి దింపనున్నారని.. అమెకే సీఎం ప‌ద‌వి క‌ట్ట‌బెట్టే అవ‌కాశాలున్నట్లు చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. ఈ ఉద‌యం సంకీర్ణ ప్ర‌భుత్వ ఎమ్మెల్యేల‌తో సోరెన్ స‌మావేశ‌మై సుధీర్ఘంగా చ‌ర్చించారు. ఆ చ‌ర్చ‌ల్లో ఏం జ‌రిగింద‌న్న‌ది బ‌య‌ట‌కు వెల్ల‌డి కాలేదు. ఇదిలావుంటే, హేమంత్ సోరెన్‌పై అన‌ర్హ‌త వేటు ప‌డినా ఆయ‌న మ‌రో ఆరు నెల‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచి, మిత్ర‌ప‌క్ష కూట‌మి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే తిరిగి సీఎం అయ్యే అవ‌కాశం ఉన్న‌ది. అయితే సోరెన్ ఏం చేస్తార‌న్న‌దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొని ఉన్న‌ది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles