సాధారణంగా అడవి జంతువుల్లో చాలా వరకు మనుషులను చూస్తే భయపడతాయి, లేదంటే భయపెడతాయి. ఇక ఏనుగులు నిజానికి ప్రశాంతంగా ఉండే జీవులే అయినా వాటి భారీ ఆకారాన్ని చూస్తే కొంత భయమేయడం మాత్రం ఖాయమే. అయితే ఎంత వన్యమృగమైన ఏనుగు మాత్రం కేవలం శాఖహారమైన బోజనాన్నే చేస్తూ.. ఆలయ ఉత్సవ ఊరేగింపుల్లోనూ ప్రత్యేకంగా దేవతా విగ్రహాలను ఏనుల అంభారీ మధ్యే తీసుకువెళ్లడం పరిపాటి. దీంతో ఏనుగు భారీ ఆకారంతో ఉన్నా.. అవి మనుషులతో ఎంతో కలుపుగోలుగా ఉంటాయి. అయితే కోపం వస్తే మాత్రం వాటి రౌద్రం భయానకంగా ఉంటుందన్న విషయం ఇప్పటికే అనేక వీడియోల్లో మనం చూశాం.
కానీ ఇక్కడ ఓ ఏనుగు ఇటీవల చేసిన ఓ పని మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. నెటిజనులు నుంచి ప్రశంసలను అందుకుంటోంది. చిన్నారుతో పాటు అందరికీ హత్తుకునేలా ఉన్న ఈ వీడియోలో ఓ చిన్నారి పడేసుకున్న షూను ఏనుగు తొండంతో తీసి చేతికి అందించిన ఈ వీడియో వైరల్ గా మారింది. చైనాలోని షాంగ్ డోంగ్ ప్రావిన్స్ లోని ఓ జూలో ఇది జరిగింది. చైనాకు చెందిన ఓ ఫ్యామిలీ అంతా కలిసి జూకు వెళ్లారు. అలా జంతువులను చూస్తూ చూస్తూ ఏనుగులు ఉన్న ఎన్ క్లోజర్ వద్దకు వెళ్లారు. నేలకు దిగువన కాస్త లోతుగా తవ్విన గుంతలాంటి ఎన్ క్లోజర్ లో ఏనుగులు ఉన్నాయి. అంతా నిలబడి వాటిని చూస్తుండగా.. ఓ చిన్నారి షూ ఆ ఎన్ క్లోజర్ లో పడిపోయింది.
అది గమనించిన ఏనుగు.. మెల్లగా తన తొండంతో షూను పట్టుకుని తీసి.. పైన నిలబడి చూస్తున్న వారికి అందజేసింది. ఆ షూను తీసుకున్న పిల్లలు.. కొంత గడ్డిని ఆ ఏనుగుకు ఇచ్చారు. ఏనుగు ఆ గడ్డిని తినేస్తూ వెనుదిరిగింది. దీనంతటినీ అక్కడున్న కొందరు వీడియో తీశారు. ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు. ఏనుగు చిన్నారి షూను తీసిచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేల కొద్దీ వ్యూస్, లైకులు వస్తున్నాయి. ‘ఎవరో ఆ ఏనుగును సరిగా చూసుకుంటున్నారు, అందుకే పద్ధతిగా వ్యవహరిస్తోంది’ అని కొందరు కామెంట్ చేస్తే.. ‘ఈ ప్రపంచానికి ఏనుగులను ఇన్ చార్జులుగా పెడితే బాగుపడుతుంది..’ అని మరికొందరు ప్రశంసిస్తున్నారు.
This elephant was up to the... tusk The animal returned a child’s shoe after it fell into its zoo enclosure in eastern China pic.twitter.com/5ZijYDjAY9
— NowThis (@nowthisnews) August 15, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more