Train collision in Gondia leaves over 50 people injured మహారాష్ట్రలో రెండు రైళ్లు ఢీ.. 53 మందికి గాయాలు..

Maharashtra over 50 injured in collision between passenger goods train in gondia

Maharashtra train accident, Maharashtra train accident news, Maharashtra train accident news today, Maharashtra train accident death toll, Gondia train accident, Maharashtra Gondia, Gondia goods train news, Gondia passenger train accident, Chhattisgarh to Rajasthan train accident, Maharashtra goods train accident news, Maharashtra passenger train accident news, Maharashtra train derailment, Crime

More than 50 passengers were injured after three bogies of a passenger train derailed in Maharashtra. The incident was reported from Gondia. There were no reports of any casualties in the incident. The accident occurred at nearly 2:30 am on Wednesday after the passenger train collided with a goods train. The passenger train was on its way from Chhattisgarh's Bilaspur to Jodhpur in Rajasthan. The incident took place due to signalling issues.

మహారాష్ట్రలో రెండు రైళ్లు ఢీ.. 53 మందికి గాయాలు.. తప్పిన పెను ప్రమాదం

Posted: 08/17/2022 01:35 PM IST
Maharashtra over 50 injured in collision between passenger goods train in gondia

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును.. అదే మార్గంలో వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్‌ రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 53 మందిపైగా గాయపడ్డారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా సిగ్నలింగ్ వ్యవస్థలో తప్పిదం కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ప్యాసింజర్ డ్రైవర్ రైలుకు ఎమర్జెన్సీ బ్రేకులు అప్లై చేసినా.. రైళ్లును ప్రమాదం నుంచి నివారించలేకపోయాడు.

భగత్‌ కి కోఠీ ప్యాసింజర్‌ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు వెళ్తున్నది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మహారాష్ట్రలోని గోండియా సిటీ సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ గూడ్స్​ ట్రైన్‌ను ఢీకొట్టింది. దీంతో మూడు బోగీలు పట్టాలు తప్పడంతో 53 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles