Corona particles found in air can spread infection గాలి ద్వారా కూడా సోకుతున్న కరోనా వైరస్: తాజా అధ్యయనం

Coronavirus particles found in air can spread infection confirms study

Coronavirus, corona particles, corona particles in air, corona particles in air can spread infection, New study, covid omicron, Hyderabad CSIR-CCMB, Chandigarh CSIR-IMTech, Journal of Aerosol Science, airborne transmission, SARS-CoV-2, Covid-19

A collaborative study by a group of scientists from CSIR-CCMB, Hyderabad and CSIR-IMTech, Chandigarh, with hospitals in Hyderabad and Mohali, confirmed the airborne transmission of SARS-CoV-2. The study is now published in the Journal of Aerosol Science.

గాలి ద్వారా కూడా సోకుతున్న కరోనా వైరస్: తాజా పరిశోధనలో వెల్లడి

Posted: 05/04/2022 04:43 PM IST
Coronavirus particles found in air can spread infection confirms study

కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందన్నది ఇప్పటివరకు జరిపిన పరిశోధనలతో వైద్య నిపుణులు మనకు చెప్పిన విషయం. నోటి తుంపర్ల నుంచి వచ్చిన వైరస్ ఏదైనా ఉపరితలం, వస్తువులపైకి చేరి, అక్కడి నుంచి మనుషులకు వ్యాపించొచ్చని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకనే ఏదేని వస్తువును ముట్టుకున్నా వెంటనే చేతులు శానిటైజ్ చేసుకోవాలని చెప్పారు. తద్వారా కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చేనని సూచనలు చేశారు. ఇక దీనికి తోడు ముఖానిక మాస్క్ కూడా తప్పనిసరిగా ధరించాలని హెచ్చరికలు జారీ చేశారు.

కానీ, తాజాగా జరిపిన అధ్యయనాలతో గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని పరిశోధకులు తెలుసుకున్నారు. గాలి ద్వారా వ్యాప్తి చెందడం ద్వారానే ఇది అత్యంత తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టివచ్చిందని కూడా పరిశోధకలు చెబుతున్నారు. ఈ మేరకు వార్తలు గతంలోనూ వచ్చినా వాటిని అప్పట్లో థృవీకరించలేదు. ఈ క్రమంలో గాలిలో కరోనా పార్టికల్స్ ఎక్కువ సమయం ఉండవని చెప్పారు, కేవలం వెంటిలేషన్ లేని గదుల్లోనే కరోనా పార్టికల్స్ ఉంటాయని కూడా అద్యయనాలు తెలిపాయి. కానీ గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకే అవకాశాలు అధికంగానే వున్నాయని తాజా అద్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే హైదరాబాద్ కు చెందిన సీఎస్ఐఆర్-సీసీఎంబీ, చండీగఢ్ కు చెందిన సీఎస్ఐఆర్-ఐఎంటెక్, హైదరాబాద్, మొహాలీలోని ఆసుపత్రుల సహకారంతో ఒక అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం వివరాలు ఎయిరోసాల్ సైన్స్ అనే జర్నల్ లో ప్రచురితమయ్యాయి. నిజానికి కరోనా వైరస్ ఏ రూపంలో వ్యాప్తి చెందుతుందన్న దానికి ఇతమిద్దమైన ఆధారాల్లేవు. ఉపరితలం, నీటి తుంపర్ల రూపంలో వైరస్ ఉన్న వ్యక్తి నుంచి ఇతరులకు వ్యాపిస్తున్నట్టు గత పరిశోధనల్లో గుర్తించారు. కానీ, కరోనా వైరస్ సూక్ష్మ కణాల రూపంలో గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందన్న దానికి లోగడ ఆధారాలు లభించలేదు.

కానీ, తాజా అధ్యయనం గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని గుర్తించింది. హైదరాబాద్, మొహాలీలోని ఆసుపత్రుల (కరోనా బాధితులున్న) ప్రాంతాల నుంచి గాలి నమూనాలను సేకరించి, జీనోమ్ కంటెంట్ ను పరీక్షించారు.  ఆయా ప్రాంతాల్లోని గాలిలో కరోనా వైరస్ బయటపడింది. కరోనా బాధితులు ఉన్న ఆసుపత్రుల్లోని ఐసీయూ, నాన్ ఐసీయూ ప్రాంతాల్లోని గాలిలోనూ కరోనా వైరస్ కణాలను గుర్తించారు. రోగులు విడిచిన వైరస్ ఇదని వారు పేర్కొన్నారు. తగినంత వెంటిలేషన్ లేకపోతే గాలిలో కరోనా వైరస్ నిలిచి ఉంటుందని తమ అధ్యయనం ఫలితాలు చెబుతున్నట్టు సైంటిస్ట్ శివరంజని మనోహన్ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles