Indian security officials seize drugs, arrest 9 Pakistani citizens గుజరాత్‌ తీరంలో రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

9 pakistani nationals arrested while trying to smuggle over 250 kg heroin off gujarat coast

heroin smuggling, heroin smuggling along Gujarat coast, Pakistani drug smugglers, Gujarat Anti-terrorism squad, Indian Coast Guard, pakistani boat apprehended off Gujarat, Jakhao fishing harbour, Gujarat, Arabian sea, Pakisthan, Nine Pakistan nationals, Indian Coast Guard, narcotics, Afghanistan, NIA, Pakistani nationals arrested, Al Haj

Nine Pakistani nationals have been apprehended while trying to smuggle more than 250 kg of heroin worth ₹280 crore into India off the Gujarat coast, officials said. The operation was jointly carried out by Gujarat’s ATS (Anti-Terrorism Squad) and the Indian Coast Guard (ICG).

పాక్ కుట్ర భగ్నం: గుజరాత్‌ తీరంలో రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత

Posted: 04/25/2022 04:03 PM IST
9 pakistani nationals arrested while trying to smuggle over 250 kg heroin off gujarat coast

భారతదేశాన్ని అతలాకుతలం చేసేందుకు సాధ్యమైనంత అన్ని మార్గాలను అన్వేషిస్తోంది దాయాధి పాకిస్తాన్. ఒక వైపు పాకిస్థాన్ నుంచి అక్రమ చోరబాట్లకు పాల్పడుతూ.. మరోవైపు ఐఎస్ఐ చోరబాటు దారులకు పూర్తిగా సహకరిస్తూ.. ఇంకో వైపు నుంచి భారత్ పై కాల్పుల విరమణకు తూటాలను వదులుతూ.. ఇక ఈ మధ్యకాలంలో డ్రోన్ లతో మందుగుండు సామాగ్రిని తరలించి కాల్పులకు పాల్పడుతూ.. సాధ్యమైన అన్ని కోణాల్లో భారత్ పై దాడులకు పాల్పుడుతూనే వుంది పాకిస్తాన్.

భారత్ ను నేరుగా ఎదుర్కోనే ధైర్యం లేని పాకిస్థాన్.. దొంగ దెబ్బలను తీయడంలో మాత్రం అరితేరింది. అయితే క్రమంగా పాకిస్తాన్ చర్యలను ఎండగట్టడం, ఎదుర్కోవడంతో పాటు అంతర్జాతీయంగా ఆదేశం దొంగబుద్దులను బహిర్గతం చేయడం చేసిన భారత్ ఎక్కడికక్కడ అడ్డకట్టలు వేస్తూనే వచ్చింది. దీంతో తాజాగా పాకిస్థాన్ దేశాన్ని కాకుండా దేశంలోని అమూల్యమైన మాననవనురుల సంపదను దెబ్బతీసే కుట్రకు తెరలేపింది. దేశంలోకి మాదక ద్రవ్యాలను తరలించేందుకు శత్రుదేశం పాక కుట్రలు పన్నుతున్నది.

విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన పక్కా సమాచారం మేరకు అరేబియా సముద్రం మార్గంలో తరలించేందుకు యత్నిస్తుండగా.. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ కుట్రను భగ్నం చేసింది. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌, గుజరాత్‌ ఏటీఎస్‌ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి పాక్‌ బోటులో నుంచి భారీగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ సందర్భంగా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని జకావూకు తరలించారు. బోట్‌లో 55 హెరాయిన్‌ ప్యాకెట్లలో 56 కిలోల వరకు హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోగా.. బహిరంగ మార్కెట్‌లో దాని విలువ రూ.280కోట్ల వరకు ఉంటుందని అంచనా.

అయితే, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌, గుజరాత్‌ ఏటీఎస్‌ను చూసిన స్మగ్లర్లు తప్పించుకొని పాక్‌ వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. కాల్పులు జరిపి పారిపోకుండా అడ్డుకున్నారు. ఇదిలా ఉండగా.. నిన్న అట్టారీ సరిహద్దులో ఆదివారం కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ రూ.700కోట్ల విలువైన 102 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి తరలించగా.. అమృత్‌సర్‌ కస్టమ్స్‌ (పీ) కమిషనరేట్‌ పరిధిలోని ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ (ఐసీపీ)లో 102కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles