బ్యాంకుల్లో ఉద్యోగాలను చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఔత్సాహికులకు రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు స్వాగతం పలుకుతున్నాయి. ఆయా బ్యాంకుల్లోని ఖాళీలకు అర్హులైన యువకులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చేనెల 7 వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 145 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 145
ఇందులో మేనేజర్ (రిస్క్) 40, మేనేజర్ (క్రెడిట్) 100, సీనియర్ మేనేజర్ 5 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సీఏ, సీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏ, ఫైనాన్స్‌లో పీజీడీఎం ఏదోఒకటి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి. మేనేజర్ పోస్టులకు 25 నుంచి 35, సీనియర్ మేనేజర్ పోస్టులు 25 నుంచి 27 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.50
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 22
అప్లికేషన్లకు చివరితేదీ: మే 7
రాతపరీక్ష: జూన్ 12
వెబ్‌సైట్: www.pnbindia.in
బ్యాంక్ ఆఫ్ ఇండియాలొ ఆఫీసర్ పోస్టుల భర్తీ...
ఇటు బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఓఐ) కూడా తమ బ్యాంకులోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ పోస్టలు భర్తీకి శ్రీకారం చుడుతూ.. నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 10 వరకు అప్లికేషన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 696 పోస్టులను భర్తీ చేస్తున్నది. 594 పోస్టులు రెగ్యులర్ బేసిస్ కాగా, 102 పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఇందులో ఎకనమిస్ట్, స్టాటిస్టీషియన్, రిస్క్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్, క్రెడిట్ ఆఫీసర్, ఐటీ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 696
ఇందులో ఎకనమిస్ట్ 2, స్టాటిస్టీషియన్ 2, రిస్క్ మేనేజర్ 2, క్రెడిట్ అనలిస్ట్ 53, క్రెడిట్ ఆఫీసర్ 484, టెక్ అప్రైజల్ 9, ఐటీ ఆఫీసర్ 42, ఐటీ మేనేర్ 27, ఐటీ సీనియర్ మేనేజర్ 11, సీనియర్ మేనేజర్ 10, మేనేజర్ 34 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో ఎంబీఏ, పీజీ, బీఈ, బీటెక్, సీఏ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, గ్రూప్‌డిస్కషన్, ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 26
దరఖాస్తులకు చివరితేదీ: మే 10
వెబ్‌సైట్: www.bankofindia.co.in
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more