Rahul Gandhi attacks PM Modi on ‘2 India’, Pegasus, China పార్లమెంటులో మోడీ ప్రభుత్వాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

From two indias to unemployment rahul gandhi flays centre in lok sabha

Rahul Gandhi, Congress, Lok Sabha, Modi govt, unemployment, India, two indias, pegasus, Election Commission, china india, bjp, Presidential Address, Rajiv Gandhi, Indira Gandhi, King, China, Pakistan, AA industialists, poverty, UPA, NDA, BJP, Congress, Lok Sabha, Modi Govt, Unemployment, India, National Politics

Congress MP Rahul Gandhi slammed the Central government over various issues ranging from China to unemployment. Speaking in the Lok Sabha during the debate on the Motion of Thanks on the President's address, Rahul Gandhi made several allegations against the Centre and also criticised the Presidential Address.

పేదరికం నుంచి నిరుద్యోగం వరకు.. మోడీ ప్రభుత్వాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

Posted: 02/02/2022 07:41 PM IST
From two indias to unemployment rahul gandhi flays centre in lok sabha

పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి చేసిన ప్ర‌సంగం స‌త్యానికి ఎంతో దూరంగా వుంద‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంలో నిరుద్యోగం గురించి ఏమాత్రం మాట్లాడ‌క‌పోవ‌డం విడ్డూర‌మ‌న్నారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌స‌భ‌లో ప్ర‌సంగించారు. తన ముత్తాత దేశ ప్రథమ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ నుంచి తన నాయినమ్మ ఇందిరాగాంధీ సహా తన తండ్రి రాజీవ్ గాంధీల విషయాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో దేశంలోని నిరుద్యోగం, చైనాతో పోంచివున్న ప్రమాదం, పెగసెస్ స్పైవేర్ తో దేశంలోని రాజీకీయ నేతలపై రహస్యంగా నిఘా పెట్టడం వంటి చర్యలపై ఆయన సుదీర్ఘంగా ప్రస్తావించారు. దేశం అంటే రాజ్యం, రాష్ట్రాలు సామంత రాజులు కాదని.. రాచరికపాలనకు దేశస్వతంత్ర్యంతోనే పోయిందని అన్నారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో పదేళ్ల పాలనలో దేశంలోని 27 కోట్ల మందిని పేద‌లను పేదరికం నుంచి బ‌య‌ట ప‌డేశామ‌ని, కానీ ఎన్డీయే హ‌యాంలో ఈ ఏడేళ్ల కాలంలో 23 కోట్ల మందిని తిరిగి పేద‌రికంలోకి నెట్టేశార‌ని తీవ్రంగా మండిప‌డ్డారు. గ‌తేడాది మూడు కోట్ల మంది యువ‌కులు దేశంలో ఉద్యోగాల‌ను కోల్పోయారని, గ‌త 50 ఏళ్ల‌తో పోలిస్తే, నిరుద్యోగ స‌మ‌స్య ప్ర‌స్తుత కాలంలోనే అధిక‌మైంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. దేశం ఎదుర్కొంటున్న స‌వాళ్లు రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంలో లేనేలేవ‌ని ఎద్దేవా చేశారు. ఆ ప్ర‌సంగానికి ఓ దృక్ప‌థ‌మంటూ లేద‌ని రాహుల్ ఎద్దేవా చేశారు.

సూక్ష్మ‌, చిన్న‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు అభివృద్ధి ప‌థంలో సాగ‌క‌పోతే.. మేడిన్ ఇండియా అనేది కుదిరే ప‌ని కాద‌ని రాహుల్ స్ప‌ష్టం చేశారు. కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం సూక్ష్మ‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌ను విధ్వంసం చేసింద‌ని, జీఎస్టీ, నోట్ల ర‌ద్దు ద్వారా వీటి ప‌రిస్థితి దుర్భ‌ర‌మైంద‌ని విమ‌ర్శించారు. వీటికి చేయూత ఇవ్వ‌డంలో మోదీ స‌ర్కార్ విఫ‌ల‌మైంద‌ని రాహుల్ ఆరోపించారు. మోదీ హ‌యాంలో భార‌తీయులు రెండు ర‌కాలు విభ‌జింప‌బ‌డ్డార‌ని, ఒక‌రు ధ‌న‌వంతులు కాగా, మ‌రొక‌రు పేద‌ల‌ని రాహుల్ అభివ‌ర్ణించారు. ఈ పేద‌ల‌కు స‌రైన ఉద్యోగాలు కూడా లేవ‌ని అన్నారు. దేశానికి సంబంధించిన ధ‌న‌మంతా ఒక‌రిద్ద‌రి చేతుల్లోనే బందీ అయిపోయింద‌ని, సంప‌న్నుల ఇండియా, పేద‌ల ఇండియాగా మార్చేశార‌ని రాహుల్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. .
భార‌త్ రాష్ట్రాల స‌ముదాయం.. రాజ్యం కాదు…

భార‌త్ అనేది ప‌లు రాష్ట్రాల స‌ముదాయ‌మ‌ని, రాజ్యం మాత్రం కాద‌ని రాహుల్ గాంధీ స్ప‌ష్టం చేశారు. ఆయా రాష్ట్రాల‌పై కేంద్రం ఎన్న‌టికీ పెత్త‌నం చెలాయించ‌లేద‌ని తేల్చి చెప్పారు. ఆయా రాష్ట్రాల ప్ర‌జ‌లు త‌మ దృక్ప‌థంతోనే ఆలోచిస్తార‌ని, ఇదే భార‌త దేశ బ‌ల‌మ‌ని పేర్కొన్నారు. అస‌లు ఎంత మంది ఉద్యోగాలిచ్చార‌న్న విష‌య‌మే కేంద్రం మాట్లాడ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. ఎందుకంటే మీరు మాట్లాడితే అవి జోకుల‌ని ప్ర‌జ‌లు భావిస్తార‌ని రాహుల్ సెటైర్ వేశారు. అత్య‌ధిక ఉద్యోగులు అసంఘ‌టిత రంగంలోనే ఉన్నాయ‌ని, ఆ రంగం నుంచే ధ‌నికుల‌కు కేంద్రం డ‌బ్బులిచ్చింద‌ని విమ‌ర్శించారు. ఇలా చేయ‌డం ద్వారా అసంఘ‌టిత రంగాన్ని కుదేలు చేసేశార‌ని, పైగా.. జీఎస్టీ, నోట్ల ర‌ద్దు ద్వారా వారి గొంతు నొక్కేశార‌ని రాహుల్ విమ‌ర్శించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై కూడా ఆయన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ‘కొన్ని రోజుల క్రితం న‌న్ను కల‌వ‌డానికి మ‌ణిపూర్ నుంచి ఓ నేత వ‌చ్చారు. చాలా కోపంతో ఊగిపోయారు. నా ప‌రువు ఎన్న‌డూ ఇంత‌లా పోలేద‌ని ఆయ‌న అన్నారు. ఏం జరిగిందని అడిగితే.. తాను కొన్ని రోజుల క్రితం అమిత్‌షా ఇంటికి వెళ్లారు. అయితే అక్క‌డి సిబ్బంది బూట్లు తీయ‌మ‌ని త‌న‌ను ఆదేశించారు. లోప‌లికి వెళితే మాత్రం అమిత్‌షా చెప్పుల‌తోనే ఉన్నారు. చెప్పుల‌తోనే తిరుగుతున్నారు. అమిత్‌షా మాత్రం ఇంటి లోప‌ల చెప్పుల‌తో తిర‌గ‌వ‌చ్చు… బ‌య‌టి వ్య‌క్తులు మాత్రం బూట్లు తీసేసి లోప‌లికి వెళ్లాలా? ఇంత‌లా భేద‌భావం ఎందుకు చూపిస్తున్నారు? ఇదేం ప‌ద్ధ‌తి?’ అంటూ రాహుల్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై తీవ్రంగా విరుచుకుప‌డ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles