Telangana CEO issues guidelines to Huzurabad bypolls హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి 26నే తెర..

Telangana chief election officer issues guidelines to huzurabad bypolls

Central Election Commission, by-election, Huzurabad by election, By-Elections, Huzurabad, Chief Electoral Officer, Covid rules, election campaign, Shashank Goyal, By-polls, Telangana, Politics

Telangana State Chief Election Officer (CEO) issued the Guidelines to the By-Elections of Huzurabad Assembly constituency, states no rallies, road show are entertained due to Covid Protocol.

కోవిడ్ నిబంధనల మధ్యే హుజూరాబాద్ ఉప ఎన్నికలు ప్రచారానికి 26నే తెర..

Posted: 09/28/2021 04:58 PM IST
Telangana chief election officer issues guidelines to huzurabad bypolls

తెలంగాణ ప్రాంత ప్రజలందరీ దృష్టి ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికలపైనే కేంద్రీకృతమైంది. బిసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పదవులలో కొనసాగడం ఇష్టం లేదని అందుకే తాను పార్టీ సభ్యత్వానికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన నేపథ్యంలో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ తమ మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా కొనసాగుతున్న ఈటెల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డాంటూ కొందరు రైతులు అరోపించారని, అందకని ఆయనను మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ ఏడాది జూన్ 12న తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అప్పటినుంచి రాష్ట్రంలో హాటు రాజకీయాలకు హుజూరాబాద్ వేదికగా మారింది. ఒకవైపు ఈటెల.. మద్దుతుగా బీజేపి పార్టీ నేతలు, మరోవైపు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్ లో తిష్టవేసుకుని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఎన్నికలు ఎప్పుడా అని వేచిచూస్తున్న తరుణంలో కేంద్రఎన్నికల కమీషన్ ఇవాళ షెడ్యూల్డును విడుదల చేసింది. పార్లమెంటులోని లోక్ సభలో ఖాళీగా వున్న మూడు స్థానాలతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా వున్న 30 అసెంబ్లీ స్థానాలకు నగరాను మ్రోగించారు.

అక్టోబర్ 30న జరగనున్న హుజూరాబాద్ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నట్లు ప్రకటించింది. అయితే ఇక్కడే ఎన్నికల కమీషన్ ప్రచారపర్వంలో పలు అంక్షలను కూడా పెట్టింది. ఎన్నికల ప్రక్రియలో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ.. ఎన్నికల కమీషన్ విడుదల చేసిన నిబంధనలు పాటించాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఎన్నికల కమీషన్ కోవిడ్ నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టరిత్యా చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. ఎన్నికల నామినేషన్ పర్వానికి ముందుకానీ, తర్వాతకానీ ఎలాంటి ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. కోవిడ్ నిబంధనల్లో భాగంగా నియోజకవర్గంలో రోడ్ షోలు, బైక్, సైకిల్ ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఇక అక్టోబర్ 30న ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో నియోజకవర్గంలో మూడు రోజుల ముందే (అంటే పోలింగ్ కు 72 గంటల ముందే) ఎన్నికల ప్రచారాన్ని పార్టీలు ముగించాలని అన్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ సహా హన్మకొండ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల ఉందని తెలిపారు. ఈవీఎంల తొలి దశ తనిఖీ పూర్తైందన్నారు. 305 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. హుజూరాబాద్ లో అందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అమల్లో ఉన్న పథకాలు, కార్యక్రమాలకు ఇబ్బంది ఉండదని తెలిపారు. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే ఈసీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles