NHRC seeks reports from Centre over farmers' stir ఢిల్లీ రైతు దీక్షలు: మదింపు చేయాలని కేంద్రానికి హెచ్ఆర్సీ నోటీసులు

Nhrc issues notice to four states over adverse impact of farmer protest at delhi

nhrc on farmers protest, farmers protest today, farmers protest impact on india, impact of famers protest on indian economy, farmers protest at border , delhi border farmers protest, singhu border farmers protest, delhi haryana border, delhi haryana border farmers protest, haryana assembly elections, up assembly elections, NHRC, Farmers protest, New Farm Laws, Rajasthan, Delhi, Haryana, Uttarpradesh, Union Government, PM Modi, Politics

The National Human Rights Commission (NHRC) on Tuesday said it had issued notices to the Delhi, Uttar Pradesh, Haryana and Rajasthan governments over complaints of industrial units and transportation being affected by the ongoing farmers’ protest at the Delhi border.

ఢిల్లీ రైతు దీక్షలు: మదింపు చేయాలని కేంద్రానికి హెచ్ఆర్సీ నోటీసులు

Posted: 09/14/2021 06:10 PM IST
Nhrc issues notice to four states over adverse impact of farmer protest at delhi

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు తీసుకోచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా గత తొమ్మిది నెలలుగా రైతుల నిరసనదీక్ష చేపట్టినా కేంద్రం స్పందించకపోవడంపై కేంద్ర మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. గత తొమ్మిది నెలలుగా రైతులు తమ ఇళ్లను వదిలి హస్తినకు చేరి నిరసనలు చేపడుతున్నా వారి సమస్యలను పరిష్కరించడంలో ఎందుకంత జాప్యం జరుగుతుందని కేంద్రాన్ని ప్రశ్నించింది. రైతుల నిరసనలు ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించింది. ఈ క్రమంలో కేంద్రానికి నోటీసులను కూడా మానవహక్కుల సంఘం జారీ చేసింది.

గత జనవరి 26న తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన తరువాత కషాయ కండువా పార్టీ నేతలు నిరసన చేపట్టిన రైతులపై దాడులకు దిగిన ఘటనలు.. మోడీ సర్కార్ కు అనుకూల వర్గంగా వారు ర్యాలీలు చేపట్టడం కూడా చోటుచేసుకుంది. ఇక ఇదే అంశంపై హర్యానాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేపై రైతులు విరుచుకుపడిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. రాజస్థాన్‌, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ సహా కేంద్ర ప్రభుత్వానికి తాజాగా నోటిసులు జారీచేసింది.  ఈ ఆందోళనలు మానవ హక్కులకు విఘాతం కల్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

అందుకే కమిషన్‌ ఈ ఆందోళన ప్రభావాన్ని ముదింపు చేయాలని ఆదేశిస్తోందని తెలిపింది. శాంతియుత పద్ధతుల్లో ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసే ఆందోళనలు కమిషన్‌ గౌరవిస్తుందని తెలిపింది. అయితే రైతు అందోళనల ప్రభావం పారిశ్రామిక రంగంపై తీవ్రంగా పడుతోందని మానవహక్కుల సంఘం పేర్కోంది. దీంతో రైతు ఆందోళనల ప్రభావాన్ని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ గ్రోత్‌’ లెక్కించి అక్టోబర్‌ 10 లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అదే విధంగా, కోవిడ్‌-19 ప్రోటోకాల్‌ ఉల్లంఘనల ప్రభావాన్ని‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ’ కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక రూపంలో అందించాలని తెలిపింది.

గతంలో ఆందోళన జరిగే ప్రదేశం వద్ద మానవ హక్కుల కార్యకర్త గ్యాంగ్‌ రేప్‌కు గురైన ఘటనపై ఝజ్జర్‌ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రైతుల ఆందోళనల కారణంగా సాధారణ ప్రజా జీవనానికి, జీవనోపాధికి కల్గిన విఘాతంపై ‘ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌’(యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ) అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని కూడా ఆదేశాలను జారీచేసింది. అయితే తొమ్మిది నెలలుగా అందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలు మాత్రం తమ అందోళనలను బలవంతంగా ఎత్తివేసేందుకు కేంద్రంలోని పెద్దలు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే హెచ్చార్సీ నుంచి ఇలాంటి అదేశాలను పంపారని వ్యాఖ్యానిస్తున్నారు. అయినా తమ నిరసనలు కోనసాగుతాయని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NHRC  Farmers protest  New Farm Laws  Rajasthan  Delhi  Haryana  Uttarpradesh  Union Government  PM Modi  Politics  

Other Articles