One accused arrested in gangrape incident పోలీసుల అదుపులో సీతానగరం అత్యాచార కేసు నిందితుడు

Seethanagaram case ap police arrest accused near ongole lookout for another

Sithanagaram Case Accused Caught Near Ongole,,AP Police On Lookout For Second accused , seethanagaram rape case, Seethanagaram Rape Case, guntur, guntur news, guntur news today, guntur latest news, guntur crime news today, crime news today, Ongole News,Seethanagaram, Ongole, prakasam barrage, Andhra Pradesh, ap police, Andrha Pradesh, Crime

Extensive search operations by the Guntur and Krishna District Police on the search for the two persons accused in the recent rape of a woman at Seethanagaram Ghat on the banks of Krishna river in Guntur district in June proved successful. Police have caught one person near Ongole in Prakasam district and the hunt is on to nab the second one who is hiding in a nearby place.

పోలీసుల అదుపులో సీతానగరం అత్యాచార కేసు నిందితుడు

Posted: 08/07/2021 01:44 PM IST
Seethanagaram case ap police arrest accused near ongole lookout for another

కృష్ణా జిల్లాలోని విజయవాడలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరువలోని ప్రకాశం బ్యారేజీ కింది ఇసుక దిబ్బల్లో ఓ ప్రేమ జంటపై దాడి చేసి.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడని కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గత 35 రోజులుగా పోలీసుల బృందాలకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న నిందుతులలో ఒకడు చిక్కడంతో ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతిపై అఘాయిత్యానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితుల్లో ఒకడిని పోలీసులు మారువేషాల్లో గాలించి పట్టుకున్నారు. ప్రస్తుతం అతడిని గుంటూరులోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో సాయంత్రం వేళ గుంటూరు జిల్లా సీతానగరం ఇసుక దిబ్బల వద్దకు సేద దీరేందుకు ఓ యువ జంట వెళ్లింది. వీరిని చూసిన నిందితులు యువకుడిపై దాడి చేసి అతని షర్టుతోనే చేతులు కట్టేసి.. అతని కళ్లెదుటే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

నిందితులను వెంకటరెడ్డి, షేర్ కృష్ణగా గుర్తించిన పోలీసులు అప్పటి నుంచి వారి కోసం గాలిస్తూనే ఉన్నారు. వీరు ఫోన్ ఉపయోగించకపోవడంతో వారిని పట్టుకోవడం కష్టంగా మారింది. దీంతో పోలీసులు మారువేషాల్లో రంగంలోకి దిగారు. సమోసాలు అమ్మేవారిలా, ఫుడ్ డెలివరీ బాయ్స్ లా మారి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులకు గంజాయి తాగే అలవాటు ఉండడంతో అది తాగే ప్రదేశాల్లోనూ కాపుకాశారు. ఈ క్రమంలో నిందితుల్లో ఒకరు హైదరాబాదులో క్యాటరింగ్ పనులు చేస్తూ రైల్వేబ్రిడ్జి కింద ఉంటున్నాడని గుర్తించారు.

గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న పోలీసు ప్రత్యేక బృందాలు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నాయి. అయితే అరెస్ట్ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు అతడిని గుంటూరులోని ఓ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. మరో నిందితుడు చెన్నైలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసు బృందాలు అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులకు చిక్కింది షేర్ కృష్ణనా.. లేక వెంకట్ రెడ్డి అన్నదానిపిై కూడా ఇంకా స్పష్టత వెలువడలేదు. కాగా, విచారణ అనంతరం నిందితుడి అరెస్ట్ ను అధికారికంగా వెల్లడించనున్నట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : seethanagaram gang rape  Accused  Ongole  Prakasam barrage  Krishna  Guntur  Andrha Pradesh  Crime  

Other Articles