68 feared dead as lightning strikes in North India ఉత్తరభారతంలో పిడుగుల వర్షం.. 68 మంది మృతి

68 killed 47 hurt in incidents of lightning strike in north india

Lightning, Lightning strike, Lighting strike Uttar Pradesh, Lighting strike Madya Pradesh, Lighting strike Rajasthan, Jaipur, Rajasthan, India, Jaipur bombings, Hemant Shesh, Pharmaceuticals (NEC), Public Finance Activities, Baran, state-run Sawai Man Singh Hospital, Chief Minister, SAWAI, Prime Minister, Ashok Gehlot, Governor, Amber Fort, Anand

Sixty-eight people were killed and 47 injured in incidents of lightning strikes in North India. In Uttar pradesh nearly 41 people dies by the lighting strike, officials said on Monday. Besides Uttar Pradesh, the deaths were reported from other two states Rajasthan and Madhya Pradesh. In Rajasthan besides Jaipur deaths were reported from six other districts.

ఉత్తరభారతంలో పిడుగుల వర్షం.. 68 మంది మృతి

Posted: 07/12/2021 03:53 PM IST
68 killed 47 hurt in incidents of lightning strike in north india

ఉత్త‌ర భార‌తంపై పిడుగుల వర్షం కురిసింది. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలపై పిడుగులు పడుతూ ఏకంగా 68 మందిని బలితీసుకున్నాయి. క్రితం రోజు రాత్రి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్యప్ర‌దేశ్, రాజ‌స్థాన్‌ రాష్ర్టాల్లో పిడుగులు ప‌డి 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు భారీ పిడుగులు ప‌డ్డాయి. దీంతో యూపీలోనే ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోగా, రాజ‌స్థాన్ లో పిడుగుపాటుకు 20 మంది బ‌ల‌య్యారు. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఏడుగురు చ‌నిపోయారు. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మ‌రో 10 మంది తీవ్ర గాయాల‌తో ఆస్ప‌త్రి పాల‌య్యారు.

పిడుగుపాటుకు మహిళలు, పిల్లలతో సహా దాదాపు 41 మంది చనిపోయినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఆదివారం కురిసిన వర్షంతో పాటు పలు చోట్ల పిడుగులు పడి చాలా మంది మృత్యువాతకు గురయ్యారు. ఈ ఘటనలో నష్టపోయిన వారి కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.5లక్షల చొప్పన నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వర్షం కారణంగా ఇళ్లు లేకుండాపోయిన వారికి ఆర్థిక సాయం కూడా అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నారని అన్నారు.

అలహాబాద్ (ప్రయాగ్ రాజ్)లో 14మృతులు సంభవించగా, కాన్పూర్, ఫతేపూర్ లలో ఐదుగురు చొప్పున చనిపోయారు. కౌశంబిలో పిడుగు కారణంగా నలుగురు.. ఫిరోజాబాద్, ఉన్నావో, రాయ్ బరేలీలో ఇద్దరు చొప్పన చనిపోగా, హర్దోయ్, ఝాన్సీ జిల్లాల్లో ఒకరు చొప్పున చనిపోయారు. జరిగిన ప్రాణ నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దీనిపై పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు నిధులు విడుదల చేశారు. బాధిత కుటుంబాల‌కు త‌క్ష‌ణ‌మే సాయం అందించాల‌ని అధికారుల‌ను సీఎం యోగీ అధిత్యనాథ్ ఆదేశించారు.

రాజ‌స్థాన్ లో పిడుగులు ప‌డి 20 మంది చ‌నిపోవ‌డంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. ఇది బాధాక‌ర‌మైన విష‌య‌మ‌న్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్న‌ట్లు మోదీ ట్వీట్ చేశారు. కాగా, రాజ‌స్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించారు. మధ్యప్రదేశ్ లో పిడుగుపాటుకు ఏడుగురు బ‌ల‌య్యారు. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఏడుగురు చ‌నిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lighting  Lighting strike  Uttar Pradesh  Rajasthan  Madhya Pradesh  Jaipur  Hemant shesh  Natural disaster  

Other Articles