Thought of deferring polls but decided against it: EC Rajiv Kumar మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలతో మనస్తాపం.. ఈసీ రాజానామా.?

Dissenting ec rajiv kumar says thought of deferring polls but decided against it

coronavirus, covid-19, EC, election commission, elections, madras high court, Rajiv Kumar, west bengal assembly elections 2021, Tamil Nadu, Politics

The Election Commission had considered deferring some phases of the recently-held assembly polls due to the coronavirus pandemic, but decided against it as it could have led to a situation where holding the remaining phases under President’s rule would have triggered sharper criticism about the poll panel favouring one party against another, EC Rajiv Kumar said in a draft affidavit which he planned to file in the Madras High Court and later in the Supreme Court.

మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలతో మనస్తాపం.. ఈసీ రాజానామా.?

Posted: 05/08/2021 07:21 PM IST
Dissenting ec rajiv kumar says thought of deferring polls but decided against it

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విజృంభన కొనసాగడానికి ఎన్నికల కమిషనే కారణమంటూ మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఓ ఎన్నికల కమీషనర్ తమ పరువును పోయిందంటూ దేశసర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టేందుకు ప్రయత్నించగా, కేంద్ర ఎన్నికలసంఘం అదేశాల మేరకు చివరిక్షణంలో విరమించుకున్నారు. దీంతో ఆయన రాష్ట్రోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలతో మనస్తాపం చెంది తన పదవికే రాజీనామా చేశారన్న వార్తలు వినబడుతున్నాయి. ఇంతటి ప్రకంపనలు రాజేసేలా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఏందుకు చేసిందీ అన్న విషయంలోకి ఎంట్రీ ఇస్తే..

తమిళనాడులో కరోనా మహమ్మారి రెండో దశ విజృంభిస్తున్నా.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించి కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగిపోవడానికి ఈసీ కారణమైందని, కాబట్టి కమిషన్‌పై హత్యా నేరం మోపాలని కోర్టు అంతర్గతంగా వ్యాఖ్యానించింది. ఇవి మీడియాలో రావడంతో ఎన్నికల కమిషన్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టులో రికార్డు కాని వ్యాఖ్యలను ప్రచురించకుండా మీడియాను నియంత్రించాలని కోరింది. విచారించిన కోర్టు.. ఈ విషయంలో మీడియాపై తాము ఆంక్షలు విధించలేమని, ఇలాంటి ఫిర్యాదులు చేయడానికి బదులు మరింత మెరుగ్గా పనిచేయవచ్చని చురకలు అంటించింది.

మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెందిన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం. అంతేకాదు, కోర్టు వ్యాఖ్యలకు నిరసనగా అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే, ఇందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ అంగీకరించలేదని సమాచారం. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలతో కమిషన్ తరపున పనిచేస్తున్న 11 లక్షల మంది సిబ్బంది నైతిక స్థైర్యం దెబ్బతిన్నదని రాజీవ్ కుమార్ ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ తరపున వాదిస్తున్న ప్యానల్ న్యాయవాది మోహిత్ డి. రామ్ ఆ విధుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ప్రస్తుత విధానాలతో తనకు సరిపడడం లేదని రాజీనామా సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  election commission  elections  madras high court  Tamil Nadu  Politics  

Other Articles