TDP MLA Ganta Srinivas resigns ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా

Tdp mla ganta srinivas rao resigns in support of visakha steel plant

Ganta Srinivasa Rao, TDP MLA, Resignation, AP Assembly Speaker, ISPAT, Vishaka steel Plant, trade Union agitation, Visakhapatnam North Constituency, non-political JAC, Vishakapatnam, Andrha Pradesh, Politics

TDP MLA Ganta Srinivasa Rao has resigned his MLA post supporting his protest against the privatization of the Visakhapatnam Steel Plant. He has sent his resignation letter to the Speaker. His sudden resignation for the cause towards the Vishakapatnam Steel Plant has surprised people in the political circle.

విశాఖ స్టీల్ ప్లాంటుకు మద్దతుగా గంటా శ్రీనివాసరావు రాజీనామా..

Posted: 02/06/2021 03:16 PM IST
Tdp mla ganta srinivas rao resigns in support of visakha steel plant

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు, కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమానికి మద్దుతుగా.. విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలన్న కేంద్రం నిర్ణయానికి నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్టు గంటా ప్రకటించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవైటీకరణను కేంద్రం తక్షణం వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ మేరకు తాను స్వయంగా సొంత దస్తూరితో రాసిన లేఖను తన లెటర్ హెడ్ పై రాసి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారంకు పంపినట్టు వెల్లడించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ప్రజాప్రతినిధులందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన అసవసరం ఏర్పిడిందని అన్నారు. ఇక పదవులకు రాజీనామాలు చేసేందుకు కూడా వెనుకాడవద్దని పిలుపునిచ్చిన ఆయన తాను తన పదవికి రాజీనామా చేశానని.. ఆ లేఖను స్పీకరుకు పంపానని.. ప్రతిని చూపారు.

22వేల ఎకరాల సువిశాలమైన స్థలంలో ఏకంగా లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనాన్ని కల్పిస్తున్న ఈ కర్మాగారంపై కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా రాజకీయాలకు అతీతమైన ఒక సంయుక్ల కార్యచరణ కమిటీ ఏర్పాటు కావాలని, దాని ఆధ్వర్యంలోనే ఇక్కడి కార్మికులు, కార్మిక సంఘాలు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ ప్రజల పాలిట కల్పతరువుగా మారిన ఉక్కు పరిశ్రమను ఎందుకని ప్రైవేటు పరం చేస్తున్నారని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. ఈ కర్మాగరం ప్రైవేటు పరం చేసి.. దాని స్థాపనకు అమరులు చేసిన ప్రాణత్యాగాలను అవహేళన చేయవద్దని గంటా కేంద్రానికి విన్నవించారు,

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ganta Srinivasa Rao  TDP MLA  Resignation  AP Assembly Speaker  Andrha Pradesh  Politics  

Other Articles