Rahul and Priyanka Gandhi, Detained on Way to Hathras కిందపడిన రాహుల్.. హాత్రస్ వెళ్తుకుండా అరెస్టు

Rahul gandhi pushed by cops falls during confrontation in up

Rahul Gandhi, Hathras Rape Case, Hathras Rape, Rahul Gandhi pushing image, rahul gandhi picture, priyanka gandhi picture, Hathras Rape Case, Hathras Rape Case News, Rahul Gandhi Pushed by Cops, Hathras Gang Rape News, Greater Noida, Yamuna Express Highway, Uttar pradesh, Politics

Congress leader Rahul Gandhi was pushed and fell to the ground in a tussle with the Uttar Pradesh police after he, his sister Priyanka Gandhi Vadra and scores of party workers were stopped from marching on the Delhi-Noida highway on their way to Hathras to meet the family of the gang rape victim who died on Tuesday.

కిందపడిన రాహుల్.. పోలీసుల ఓవరాక్షన్.. హాత్రస్ వెళ్తుకుండా అరెస్టు

Posted: 10/01/2020 09:16 PM IST
Rahul gandhi pushed by cops falls during confrontation in up

ఉత్తర్ ప్రదేశ్ లోని దళిత యువతిని దారుణంగా సామూహిక అత్యాచారం చేసిన కేసులో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్ల  పోలీసులు మితిమీరిన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఆయన గుండెలపై చేతులు పెట్టి మరీ ఆయనను తోసేసి కిందపడేలా చేశారు. హుటాహుటిన తోటి కాంగ్రెస్ నేతలు ఆయనను పైకి లేపారు. ఈ ఘటన తనకు కూడా ఎదురైందని, పోలీసులు తనను కూడా కిందకు తోసేందుకు ప్రయత్నించారని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర్ ప్రదేశ్ లోని హాత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో మృతిచెందిన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఇవాళ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తమ పార్టీ క్యాడర్ తో కలసి వెళ్తుండగా, గ్రేటర్ నోయిడా వద్ద వారి వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలిద్దరూ వాహనాలు దిగి కాలినడకన యమునా ఎక్స్ ప్రెస్ హైవే వద్దకు చేరుకున్నారు. దీంతో వారిని మరోమారు  పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్నారు, ఈ క్రమంలో పోలీసులు రాహుల్ కు మధ్య వాగ్వాధం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీని పోలీసులు విఛక్షణ రహితంగా తోసివేయడంతో ఆయన కిందపడ్డారు. వెంటనే పక్కనున్న కాంగ్రెస్ నేతలు ఆయనను పైకి లేపారు.

కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపి సర్కార్ హయాంలో రోడ్లపై నడిచే హక్కు కూడా ప్రజలకు లేదా.? అని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సర్కార్ దేశంలో నడిచేందుకు కూడా అవకాశం లేదా? అని ప్రశ్నించారు. కేవలం ఆరెస్సెస్‌, బీజేపీ నేతలు మాత్రమే రోడ్డుపై నడవాలా? అని నిలదీశారు. అంటువ్యాధుల చట్టం కింద తమను అరెస్టు చేశామంటున్న అటు మోడీ, ఇటు యోగీల ప్రభుత్వాలు.. లాక్ డౌన్ నేపథ్యంలో లక్షలాది మంది వలస కార్మికులు రోడ్డుపై పిల్లలతో నడుస్తున్నా ఎందుకు అడ్డుకోలేకపోయాయి, వారికి రవాణ ఎందుకు ఏర్పాటు చేయలేకపోయాయి. కనీసం వారు తిన్నారా.? లేదా అన్న అలోచన కూడా చేయలేదని దుయ్యబట్టారు.

తమ తప్పులు ఎక్కడ బయటకు వస్తాయోనని మాత్రం అన్ లాక్ 5.0 అమల్లోకి వచ్చిన తరువాత తాము నడుస్తూవున్నా అది ఈ ప్రభుత్వానికి తప్పగా కనబడుతోందని మండిపడ్డారు.  కాగా, రాహుల్‌ హాత్రాస్‌ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు సెక్షన్‌ 188 కింద అరెస్టు చేస్తున్నట్టు ఆయనకు చెప్పారు. ఎపిడమిక్‌ చట్టం ఉల్లంఘనకు పాల్పడ్డారని, అందుకే అడ్డుకున్నట్టు నోయిడా ఏసీపీ తెలిపారు. ఆయన్ను ముందుకు వెళ్లనీయబోమన్నారు. దీనిపై స్పందించిన రాహుల్‌.. తానొక్కడినే నడిచి వెళ్తానని, అడ్డుకోవద్దని చెప్పినా పోలీసులు వినలేదన్నారు. తనను ఏ చట్టం ప్రకారం అదుపులోకి తీసుకుంటున్నారో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై ప్రియాంకగాంధీ కూడా తీవ్రంగా స్పందించారు. పోలీసులు తమపైనే ఇలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారంటే.. ఇక సామాన్యులపై ఎంతటి దౌర్జన్యకాండను సాగిస్తున్నారో అర్థమవుతోందని దుయ్యబట్టారు. దళిత యువతికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. కామాంధుల కొమ్ముకాస్తూ వారి పక్షపాతిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పోలీసులు తమను ఉక్కు సంకెళ్లతో బంధించినా తాము హాత్రాస్ బాధితురాలి తరుపున పోరాటం చేస్తామని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో అడపడచులకు అండగా వుండేందుకు పలు రకాల పోలీసింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తామన్న నేతల మాటలు నీటిమూటలుగా మారాయని తూర్పారబట్టారు.

యూపీలో మహిళలపై కామంధుల అఘాయిత్యాలకు అడ్డు అదుపులేకుండా పోతోందని అగ్రహం వ్యక్తం చేశారు. వీటికి అడ్డుకట్ట వేసే బాధ్యతను రాష్ట్ర ముఖ్యమంత్రి అధిత్యనాథ్ తీసుకోవాలని అమె  డిమాండ్ చేశారు. యువతి అంత్యక్రియల విషయంలో పోలీసులు అనుసరించిన తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. మహిళల రక్షణలో యోగి సర్కార్‌ మొద్దు నిద్రవీడే దాకా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. హథ్రాస్‌ ఘటన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles