Telangana permits reopening bars, clubs, parks బార్లకు బంగారు కబురు చెప్పిన తెలంగాణ సర్కార్..

Telangana government allows to re open bars and clubs

Telangana government, Bars, Clubs, Coronavirus, musical events, lockdown, Coronavirus, Telangana, Telangana News, telangana bars open, telangana bars open hyderabad

Telangana government on Friday issued orders permitting to re-open bars, clubs, and tourism bars across the state with COVID-19 regulations. However, permits rooms will be closed until further notice from the government.

బార్లకు బంగారు కబురు చెప్పిన తెలంగాణ సర్కార్.. ఇక పెగ్గు మీద పెగ్గు..

Posted: 09/26/2020 09:22 AM IST
Telangana government allows to re open bars and clubs

తెలంగాణ ప్రభుత్వం బార్ల నిర్వాహకులకు ఎట్టకేలకు బంగారం లాంటి కబురును అందించింది. వారితో పాటు రిక్రియేషన్ క్లబ్బులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఇంటికే పరమితమైన వారిని ఇక సాయంకాలంలో సరదాగా బయటకు వెళ్లేందుకు కూడా అనుమతించింది. అదేంటి అంటే క్లబ్, పార్క్, బార్లను తెరుచుకునేందుకు అనుమతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తమ అదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని కూడా పేర్కోంది. దీంతో బార్లలోనే మందు కొట్టే పాష్ మందుబాబులతో పాటు.. ఇన్నాళ్లు ఇళ్లకు మాత్రమే పరిమితమైన ఉన్నత కుటుంబాల వారిని క్లబ్బులకు, ఇక మధ్యతరగతివారని తమకు చేరువలో వున్న పార్కులలో అహ్లాదంగా కొంత సమయాన్ని గడిపేందుకు వెసలుబాటు కలిగినట్టే.

కరోనా కారణంగా మార్చి 22న మూతపడ్డ బార్లు సరిగ్గా ఆరు నెలల తరువా తెరుచుకోనున్నాయి. బార్లు, క్లబ్ లు, పార్కులు తెరిచేందుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే బార్లు, క్లబ్ లు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ముఖ్యంగా శానిటైజర్లు ఏర్పాటు చేయాలని, దాంతో పాటు టెంపరేచర్ ను పరిశీలించిన తరావాతే క్లబులు, బార్లలోకి అనుమతించాలని అదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ), పరిధిలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ పరిధిలోని పార్కులు సందర్శకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు హెచ్ఎండిఎ ప్రకటించింది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో లుంబినీ పార్క్ ఎన్టీఆర్ గార్డెన్ సంజీవయ్య పార్క్ తదితర పార్కులు మూసి వేసిన సంగతి తెలిసిందే.

శనివారం నుంచి హెచ్ఎండిఎ, బిపిపి పార్కులు ఓపెన్ అవుతాయని వెల్లడించింది. ఇక అలానే రేపటి నుండి అర్బన్ ఫారెస్ట్ పార్కులు కూడా ప్రజలకి అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 6 నుంచి జూ పార్కులోకి సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నట్టు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలుపారు. నగర, పట్టణ వాసులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు, కోవిడ్ నిబంధనలను అనుసరించి భౌతిక దూరం పాటిస్తూ సందర్శకులకు పార్కు ల లోపలికి అనుమతించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అన్ లాక్ ప్రక్రియలో భాగంగా జనజీవనాన్ని గాడిన పెట్టి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. కాగా మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్ లకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bars  bar and restaurent  Clubs  parks  Coronavirus  lockdown  Covid-19 rules  hyderabad  Telangana  

Other Articles