సంచలనం రేపిన అమీన్ పూర్ దిశ కేసును పోలీసులు 24 గంటలు కూడా గడవకుండానే చేధించారు. నలుగరు యువకులు తనను కారులో ఎక్కించుకుని వెళ్లి.. సమీపంలోని నిర్జన ప్రాంతంలో సామూహికంగా అత్యాచారం చేశారని, మద్యం సీసాలు కూడా ఘటనాస్థలంలోనే వున్నాయని బాలిక చెప్పిన విషయమంతా కట్టుకథగా తేల్చారు పోలీసులు. బాయ్ ఫ్రెండ్ తో సినిమాకు వెళ్లిన మైనర్ బాలిక అమ్మ మందలిస్తుందనే అబద్దమాడిందని.. అందుకోసం గ్యాంగ్ రేప్ డ్రామాకు తెరలేపిందని పోలీసులు తేలిపారు.
బాధితురాలైన మైనర్ బాలికపై అత్యాచారం జరగలేదని ప్రభుత్వాసుపత్రిలోని వైద్యులు ఇచ్చిన నివేదికతోనే నిన్న సాయంత్రామే ఈ కేసులో ట్విస్టు ఏదో వుందని గ్రహించారు పోలీసులు. అయితే బాలికను విచారించడంతో పాటు స్థానికంగా గల సీసీ కెమెరా ఫూటేజీలను పరిశీలించిన తరువాత ఈ కేసులో ఏం జరిగిందన్న విషయంలో క్లారిటీకి వచ్చారు పోలీసులు. అయితే అబద్దం చెప్పిన బాధితురాలైన మైనర్ బాలికకు పోలీసులు కౌన్సిలింగ్ కల్పించారు. అదే సమయంలో బాలికను సినిమాకు తీసుకెళ్లిన యువకుడితో పాటు బాలిక ఇంటి యజమానిపై పోస్కో యాక్టు కింద కేసులు నమోదు చేశారు.
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగిందన్న విషయంలో ఒక్కసారిగా సంచలనం రేపగా.. రంగంలోకి దిగిన సంగారెడ్డి పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అక్కడ పడివున్న మద్యం సీసాలను సేకరించారు. బాధితురాలైన బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అమెకు పరీక్షలు చేసి అమెపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని చెప్పారు. దీంతో ఈ కేసులో ట్విస్టు తేలిసిపోవడంతో పోలీసులు మరో రకంగా బాలిక నుంచి సమాచారం రాబట్టేందుకు అమెను విచారించారు.
బాధిత బాలిక అబద్దం చెప్పింది కానీ నిజం పోలీసులకు తెలిసిపోవడంతో తప్పించుకోవాలని చూసింది. తనపై అత్యాచారయత్నం మాత్రమే జరిగిందని మాటమార్చింది. దీంతో పోలీసులు బాలికను సముదాయించి మెల్లిగా వివరాలు రాబట్టారు. అయితే కొన్ని వివరాలు మాత్రమే చెప్పిన బాలిక పూర్తివివరాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు బాలిక చెప్పిన వివరాలతో సీసీటీవీ ఫూటేజీని పరిశీలించారు. బాలికకు మున్సిఫల్ ఎన్నికల సందర్భంగా పరిచయమైన సందీప్ అనే యువకుడు పరిచయం అయ్యాడని, అతడితో కలసి గురువారం ఉదయం మార్కింగ్ షో సినిమాకు వెళ్లిందని సిసిటీవీ ఫూటేజీల ఆధారంగా నిర్థారించుకున్నారు.
అందుకోసం ఇంట్లోంచి ఒంటరిగా బయటకు వచ్చిన యువతి కొంతదూరం వరకు రాగానే అప్పటికే అక్కడి సందీప్ బైక్ పై వెయిట్ చేస్తున్నాడు. అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్లిన బాలిక.. అక్కడి నుంచి సందీప్ బైక్ ఎక్కి వెళ్లింది. మియాపూర్ లోని టాకీటౌన్ థియేటర్ లో సినిమా చూశారు. సినిమా వదిలిన అనంతరం నేరుగా కాకుండా దొడ్డి మార్గంలో అత్యాచార ఘటన జరిగిందని చెప్పిన స్థలానికి చేరకున్నాక అక్కడ బాలికను దింపేసి సందీప్ వెళ్లాడు. బాలిక మాత్రం అమ్మను తనను మందలిస్తుందని భయంతో అబద్దాలు చెప్పింది.
ఇంటికి రావడానికి ఆలస్యం కావడంతో తల్లిదండ్రులకు భయపడ్డ బాలిక.. గుర్తు తెలియని వ్యక్తులు తనను కారులో పొదల్లోకి లాక్కెల్లారని.. అక్కడ తనపై అత్యాచారం చేశారని.. అబద్ధం చెప్పిందని పోలీసులు తెలిపారు. దీంతో బాలికను సినిమాకు తీసుకెళ్ళిన సందీప్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అతను కూడా అదే విషయాన్ని చెప్పాడు. తాము ఇద్దరం కలసి సినిమాకు వెళ్లామని, సినిమా అయిపోగానే అక్కడి నుంచి తిరిగి వచ్చేశామన్నన్నారు. అయితే అత్యాచార ఘటనల్లో బాధితురాలిని.. అందులోనూ ముఖ్యంగా మైనర్ బాలిక అని కూడా చూడకుండా అమె ఫోటోలను, వీడియోలను నెట్టింట్లో పెట్టి వైరల్ చేసిన ఇంటి యజమాని రవిపై కూడా ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more