SBI links MSME loans to repo rate గుడ్ న్యూస్.. రుణ గ్రహితలకు ఎస్బీఐ బంపరాఫర్..!

Sbi links msme loans to repo rate

sbi news, sbi loans, SBI home loan, SBI auto loan, retail loans, MSME loans, home loans, MSME, Repo rate, Benchmark, MSME Sector, MSME loans, Income RBI, SBI

The country’s largest public sector lender, State Bank of India (SBI) has linked all its floating rate loans to individuals and Micro Small and Medium Enterprises (MSMEs) to the Reserve Bank of India's (RBI's) benchmark repo-rate.

గుడ్ న్యూస్.. పారిశ్రామిక రుణ గ్రహితలకు ఎస్బీఐ బంపరాఫర్..!

Posted: 09/25/2019 12:42 PM IST
Sbi links msme loans to repo rate

దేశీ దిగ్గజ బ్యాంకుగా, దేశంలోనే అగ్రగామిగా అవతరించిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు శుభవార్త అందించింది. బ్యాంక్ జారీ చేసే రుణాలకు ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ గా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు‌ను ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించింది. ఫ్లోటింగ్ రేటు ఎంఎస్ఎంఈ రుణాలు, హోమ్ లోన్స్, రిటైల్ రుణాలకు ఇది వర్తిస్తుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ అమలులోకి వస్తుంది.

బ్యాంకులు ఆర్‌బీఐ రెపో రేటు, ఫైనాన్షియల్ బెంచ్‌మార్క్స్ ఇండియా (ఎఫ్‌బీఐఎల్) ప్రకటించే భారత ప్రభుత్వ 3 నెలల ట్రెజరీ బిల్ ఈల్డ్, ఎఫ్‌బీఐఎల్ పబ్లిష్ చేసే భారత ప్రభుత్వ ఆరు నెలల ట్రెజరీ బిల్ ఈల్డ్, లేదంటే ఎఫ్‌బీఐఎల్ ప్రకటించే ఇతర బెంచ్‌మార్క్ మార్కెట్ వడ్డీ రేటు ప్రాతిపదికన బ్యాంకులు కస్టమర్లకు రుణాలు జారీ చేయొచ్చు. బ్యాంకులు పైన పేర్కొన్న ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్స్‌లో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. ఎంపిక చేసుకున్న బెంచ్‌మార్క్ ప్రాతిపదికన రుణాలు జారీ చేయాల్సి ఉంటుంది.

ఆర్‌బీఐ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రెపో రేటు తగ్గినప్పుడు రుణ రేట్లు కూడా దిగొస్తాయి. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణల జారీ విధానాన్ని వాలంటరీ ప్రాతిపదికన ఇప్పుడు ఎస్‌బీఐ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఇది కేవలం ఎంఎస్ఎంఈలకు మాత్రమే వర్తిస్తుంది. సూక్ష్మ, స్థూల మధ్యతరహా పరిశ్రమలకు రుణ సదుపాయాన్ని అందించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇకపోతో స్టేట్ బ్యాంక్ రెపో ఆధారిత ఫ్లోటింగ్ రేటు హోమ్ లోన్స్‌ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. 2019 జూలై 1న వీటిని ఆవిష్కరించింది. ఇవి కూడా 2019 అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MSME  Repo rate  Benchmark  MSME Sector  MSME loans  Income RBI  SBI  

Other Articles