Fire breaks out in Chandigarh-Kochuveli Express train ఛండీగడ్ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఘటన

Fire breaks out in chandigarh kochuvalli express rear power car at new delhi station

Fire, Delhi fire, Chandigarh Kochuvalli express, Delhi railways station fire, Fire Chandigarh Kochuvalli express, Chandigarh-Kochuvalli Express fire,New Delhi station fire, ndls, ndls fire, railway station fire, new delhi railway station, Crime

A fire broke out in the rear power car of the Chandigarh-Kochuvalli Express as it was departing the New Delhi station on Friday, a railway spokesperson said.

ITEMVIDEOS: ఛండీగడ్ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఘటన

Posted: 09/06/2019 03:06 PM IST
Fire breaks out in chandigarh kochuvalli express rear power car at new delhi station

దేశ రాజధాని న్యూఢిల్లీలోని రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చండీగఢ్ కొచ్చివేలి ఎక్స్ ప్రైస్ రైలులో మంటలు వ్యాపించాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక దళాలు మంటలను అదుపుచేశాయి. రైలు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లోని 8వ నెంబరు ఫ్లాట్ ఫామ్ పై వుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు బోగీల్లోని వెనుకనున్న పవర్ కారులో అకస్మాత్తుగా పొగ కమ్ముకుని ఆ వెనువెంటనే మంటలు అంటుకున్నాయి. ఫ్లాట్ ఫామ్ పైనున్న ప్రయాణికులు ఈ విషయాన్ని వెంటనే రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చండీగఢ్ నుంచి కేరళలోని కొచ్చివెల్లి ప్రాంతానికి వెళ్లే చంఢీగడ్ ఎక్స్ ప్రెస్.. ఇవాళ మధ్యాహ్నం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ కు చేరుకుంది. సరిగ్గా 1.40 నిమిషాలకు ఈ రైలులోని వెనుకనుండే పవర్ కార్ లో ఒక్కసారిగా పోగ కమ్మసింది. ఆ వెంటనే మంటలు అంటుకుని వ్యాపించాయి. దీనిని గమనించిన ప్రయాణికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో వారు వెనువెంటనే అగ్నిమాపక దళాలకు సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు.

తమకు సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటా 57నిమిషాలకు అగ్ని ప్రమాదం విషయమై ఫోన్ కాల్ వచ్చిందని.. వెంటనే తాము 12 అగ్నిమాపక శకటాలను ఘటనాస్థలానికి పంపామని సంబంధిత అధికారి తెలిపారు. రైలు పవర్ కారులో మంటలు వ్యాపించడానికి గల కారణాలపై విచారణకు అదేశించామని రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం రైలు కేరళలోని కొచ్చువెల్లి ప్రాంతానికి బయలుదేరిందని, మార్గమధ్యంలో నిజాముద్దీన్ వద్ద మరో పవర్ కారును అమర్చుతామని చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles