pawan kalyan fires on vendeta politics డ్రోన్లతో ప్రభుత్వం కక్షరాజకీయాలు: పవన్ కల్యాణ్

Pawan kalyan fires on ycp government on drone vendeta politics

Pawan Kalyan, pawan kalyan on drones, pawan kalyan on vendeta politics, pawan kalyan on floods, pawan kalyan on good governance, Janasena, Amaravathi, vijayawada, undavalli, chandrababu, TDP, JanaSena, YSRCP, Andhra Pradesh, Politics

Janasena Party President Pawan Kalyan slams the government on vendetta politics in the state, while the people in capital region are seeking help as their houses are drowned by floods.

వరదలతో ప్రజలు అగచాట్లు.. డ్రోన్లతో ప్రభుత్వం కక్ష రాజకీయాలు: పవన్ కల్యాణ్

Posted: 08/17/2019 08:22 PM IST
Pawan kalyan fires on ycp government on drone vendeta politics

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలు, కక్షసాధింపు చర్యలపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు సమస్యలతో సతమతం అవుతుంటే.. అధికారంలోని పార్టీ నేతలు రాజకీయ కక్షసాధింపుకు తెరలేపారని.. ఈ చర్యలు వారిలోని అధికార దాహాన్ని చూపుతున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. అకస్మాత్తుగా వచ్చిన వరదలతో ప్రజలు ముంపుకు గురవుతుంటే.. వారిని అదుకునే చర్యలకు ప్రభుత్వం మంగళం పాడిందని ఆయన ధ్వజమెత్తారు.

ఓ వైపు కృష్ణా నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లు పడుతుంటే.. ప్రభుత్వ యంత్రాగాన్ని ప్రజలకు అందుబాటులో వుండేలా నిత్యం మానిటరింగ్ చేస్తూ ప్రజలకు మేమున్నామన్న భరోసా కల్పించాల్సిన ప్రబుత్వం.. మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరగడం శోచనీయమని పవన్ మండిపడ్డారు. వరద ఉద్ధృతి ఉన్నప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడడం మానేసి.. కరకట్ట మీద ఉన్న నిర్మాణాలు మునిగిపోతాయా? లేదా? అంటూ డ్రోన్లు ఎగరేసి చూడటం ఏంటని?అని నిలదీశారు.

వరద ఉద్ధృతి పెరిగితే కరకట్ట ప్రాంతంలో ఉన్న అన్ని నివాసాలూ మునుగుతాయని, అందుకోసం డ్రోన్ రాజకీయాలు అక్కర్లేదని పవన్‌ అన్నారు. ముందుగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కాపాడి, వారికి కావాల్సిన అన్ని రకాల సహాయాలు చేయాలని పవన్ సూచించారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిని ముంచేస్తారా? అని ప్రతిపక్షం, మునిగిందా?లేదా? అని చూసేందుకు అధికార పక్షంవాళ్లు వెళ్లి రాజకీయాలు చేస్తూ ప్రజలను వరద నీటికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయాలు, కక్ష సాధింపులు ఏవైనా ఉంటే ప్రజలు కష్టాలు పడుతున్న సమయంలో కాకుండా తీరిక సమయాల్లో చూసుకోవాలని పవన్ సూచించారు. అయినా ప్రజలు అధికార పార్టీకి 151 సీట్లు అందించింది.. తమకు ప్రభుత్వం అండగా నిలుస్తుదని.. తమకు బాధ్యతతో సుపరిపాలన అందించాలని, ప్రజాస్వామ్య విలువున్న మంచి ప్రభుత్వం ఉండాలని మాత్రమేనని, అంతేకానీ, రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టడం కోసమో.. లేక విమర్శలు, ప్రతివిమర్శలు చేయడం కోసమే కాదని పవన్ అన్నారు. జనసేన ఎప్పుడూ రాజకీయాల్లో హుందాతనం కోరుకుంటుందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles